Trending:


సమ్మర్‌లో కాఫీ మానేసి ఈ సూపర్ డ్రింక్స్ తాగండి.. మీ శరీరంలో జరిగే అద్భుత మార్పులివే!

ఉదయం నిద్ర లేవగానే చాలామంది వేడివేడి టీ, కాఫీ తాగుతారు. ఈ హాట్ డ్రింక్స్‌ బాడీ, మైండ్‌ను రీఫ్రెష్ చేస్తాయి. అయితే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాఫీలో ఇది ఎక్కువ మొత్తంలో ఉంటుంది. నిజానికి ఈ డ్రింక్స్ పరిమితంగా తాగితే, కెఫిన్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుంది. అయితే ఎక్కువ సార్లు తాగితే మాత్రం ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. వేసవిలో కాఫీ ఎక్కువగా తాగితే వేడి చేస్తుంది. ఇందులో ఉండే కెఫిన్ జీర్ణ సమస్యలకు కారణమవుతుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచి నరాల పటుత్వాన్ని తగ్గిస్తుంది. అందుకే ఈ సీజన్‌లో కాఫీకి బదులుగా కొన్ని హెల్తీ డ్రింక్స్ తాగడం మంచిది. అవేంటో తెలుసుకోండి. గ్రీన్ టీఇటీవల కాలంలో గ్రీన్ టీ హెల్తీ డ్రింక్‌గా పాపులర్ అయింది. బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే అందుకు కారణం. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని డిటాక్సిఫై చేస్తాయి. మొక్కల సమ్మేళనాలు, యాంటీఆక్సిడెంట్స్‌ ఉండటం వల్ల దీనికి హెల్తీ డ్రింక్‌‌గా గుర్తింపు వచ్చింది. వేసవిలో కాఫీకి బదులుగా గ్రీన్ టీ తాగితే సమ్మర్ హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది, శరీరానికి కావాల్సిన విటమిన్స్, పోషకాలు అందుతాయి. కొబ్బరి నీళ్లువేసవిలో బెస్ట్ ఎనర్జిటిక్, హైడ్రేటింగ్ డ్రింక్స్‌లో కొబ్బరి నీళ్లు ముఖ్యమైనవి. ఈ సీజన్‌లో కాఫీ బదులుగా ఇవి తాగడం మంచిది. కొబ్బరి నీళ్లలో పొటాషియం, సోడియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి వేసవి తాపానికి కోల్పోయిన పోషకాలు, శక్తిని భర్తీ చేస్తూ బాడీని రీఫ్రెష్‌ చేస్తాయి. కొబ్బరి నీళ్లలో కేలరీలు, కొవ్వులు, కొలెస్ట్రాల్‌ తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గే ప్రయోజనాలతో పాటు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ డ్రింక్ వేసవిలో డీహైడ్రేషన్ ముప్పును తగ్గిస్తుంది. తేనె, దాల్చిన చెక్క నీరుతేనె, దాల్చిన‌ చెక్కలో ఔషధ గుణాలు ఉంటాయి. ఈ రెండూ కలిపి చేసిన డ్రింక్‌ను కాఫీకి బదులుగా తీసుకోవచ్చు. దాల్చిన చెక్క పొడి, తేనె, నీరు కలిపి చేసే ఈ డ్రింక్‌తో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. దీంట్లో యాంటీ బాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతూ, సీజనల్ వ్యాధుల ప్రభావాన్ని తగ్గిస్తాయి. దీంతో మొత్తం శ్రేయస్సు మెరుగుపడుతుంది. బీట్‌రూట్ జ్యూస్బీట్‌రూట్‌లో విటమిన్ B9, ఫోలేట్, ఫైబర్, ఐరన్, యాంటీఆక్సిడెంట్స్ వంటి పోషకాలు లభిస్తాయి. శరీర కణాల అభివృద్ధి, పనితీరును ప్రోత్సహించడంలో ఫోలేట్ కీలకంగా పనిచేస్తుంది. అలాగే రక్తనాళాల క్షీణతను నిరోధిస్తుంది. గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వీటిలో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీకి సహాయం చేస్తాయి. అందుకే బోలెడు ప్రయోజనాలను అందించే బీట్‌రూట్ జ్యూస్‌ను కాఫీకి ప్రత్యామ్నాయంగా ఉదయం తాగవచ్చు. నిమ్మరసంవేసవిలో కాఫీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకోవాల్సిన మరో హెల్తీ డ్రింక్ నిమ్మరసం. ఇది బాడీ హీట్‌ను తగ్గించి, శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది. రక్తంలో షుగర్ లెవల్స్‌ తగ్గిస్తుంది. షుగర్ పేషెంట్లు ఈ సీజన్‌లో రోజూ నిమ్మరసం తాగితే ప్రయోజనం ఉంటుంది. బరువును నియంత్రించడంలో కీలకంగా పనిచేసే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దీంట్లో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా కూడా పనిచేస్తాయి. యాంటీఆక్సిడెంట్స్ శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


Today Panchangam: నేడు శుభ సమయం ఎప్పుడు ఉందంటే?

Today Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం.. 14 మే 2024 మంగళవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. పంచాంగం తేది :- 14 మే 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్ల పక్షం మంగళవారం తిథి :- సప్తమి పూర్తి నక్షత్రం :- పుష్యమి ప॥3:07ని॥ వరకు యోగం:- గండం ఉ॥9:35ని॥ వరకు కరణం:- గరజి సా॥ 5:23 వర్జ్యం:- తె. 4:53ని॥ల అమృత ఘడియలు:- ఉ॥ 8:21ని॥ల 10:02 ని॥ వరకు దుర్ముహూర్తం: ఉ॥ 08:05ని॥ల...


Besan Laddu Recipe: శనగ పిండితో తొక్కుడు లడ్డూ ఇలా ఇంట్లోనే చేయండి, నెయ్యితో చేస్తే రుచి సూపర్

Besan Laddu Recipe in Telugu: నెయ్యితో శనగ పిండి లడ్డూ చేసి చూడండి. ఇది ఆరోగ్యానికి మంచిది. పిల్లలకు కూడా నచ్చుతుంది. దీన్ని చేయడం చాలా సులువు.


Cold Coffee: కేఫ్ స్టైల్‌లో అదిరిపోయే 4 కోల్డ్‌ కాఫీ.. తయారు చేసుకోండి ఇలా !

Cold Coffee Recipe: వేసవిలో చల్లగా ఒక గ్లాసు కోల్డ్ కాఫీ తాగడం కంటే మరింత రిఫ్రెష్‌గా ఉండేది ఏముంటుంది? చల్లటి కాఫీ భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన పానీయం. దీనిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు లేదా మీకు ఇష్టమైన కాఫీ షాప్‌లో కొనుగోలు చేయవచ్చు.


Food Labelling: కంటికి కనిపించేదంతా నిజం కాదు, ఫుడ్ లేబుల్స్‌పై ICMR హెచ్చరిక

Misleading Food Labelling: ఫుడ్ ప్యాకెట్స్‌పై ఉన్న లేబుల్స్ అన్నీ నిజమే అని నమ్మొద్దంటూ ICMR హెచ్చరించింది. ఫుడ్ లేబులింగ్‌పై కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ఓ ఫుడ్ ప్యాకెట్‌ని తీసుకునే ముందైనా కచ్చితంగా దానిపై ఉన్న సమాచారాన్ని జాగ్రత్తగా చదవాలని సూచించింది. కొన్ని సంస్థలు లేబుల్స్‌ విషయంలో వినియోగదారుల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని అసహనం వ్యక్తం చేసింది. ప్యాకేజ్డ్‌ ఫుడ్‌ విక్రయిస్తున్న సంస్థలు తమ ఉత్పత్తులు చాలా ఆరోగ్యకరమైనవని ప్రచారం...


ఈరాశి వారికి ఉద్యోగంలో పనితీరుకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది

Horoscope Today: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 11న శనివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు దినఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. మేషం (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)వృత్తి, వ్యాపారాల్లో కొద్దిగా లాభాలు పెరిగే అవకాశముంది. ఉద్యోగంలో మంచిగుర్తింపు లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు ఉపయోగపడతాయి. ముఖ్యమైనవ్యవహారాల్లో సొంత నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయత్నాలు చాలావరకువిజయవంతం అవుతాయి. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనులుసకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒకటి రెండువ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. శుభ వార్తలు వింటారు.. వృషభం(Taurus):(కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2) కొన్ని వ్యవహారాలను ధైర్యంగా చక్కబెడతారు. ఆదాయం బాగా పెరిగే అవకాశంఉంది. ముఖ్య మైన పనులు, వ్యవహారాలు సునాయాసంగా పూర్తి అవుతాయి. వృత్తి,ఉద్యోగాల్లో అధికారుల అండదండలు లభిస్తాయి. వ్యాపారాల్లో సొంత నిర్ణయాలుఅమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యో గావకాశాలు కలిసి వస్తాయి. పెళ్లిప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఉద్యోగం మార డానికి చేసేప్రయత్నాలు సఫలం అవుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. మిథునం (Gemini): (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3) రోజంతా ప్రశాంతంగా సాగిపోతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతోకలిసి ఇష్ట మైన ఆలయాలను సందర్శిస్తారు. పిల్లల నుంచి శుభవార్త వింటారు.వ్యక్తిగత సమస్యల ఒత్తిడి ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్ల సమస్యబాగా తగ్గుతుంది. ఆస్తి వివాదం పెద్దల జోక్యంతో పరిష్కారమవుతుంది.వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆహార, విహారాల్లో జాగ్రత్తలుపాటించడం మంచిది. ఆదాయం పెరుగుతుంది కానీ, ఖర్చులు కూడా పెరుగుతాయి. కర్కాటకం (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ముఖ్యంగా ఎవరితోనూవాదోపవాదా లకు దిగవద్దు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. మిత్రులతోవిందులు, వినోదాల్లో పాల్గొంటారు. అను కున్న పనులు అనుకున్నట్టుపూర్తవుతాయి. చిన్న చిన్న సమస్యలకు ఆందోళన చెందక పోవడం మంచిది. ఇంటా బయటాకొద్దిగా ఒత్తిడి ఉంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. సింహం(Leo):(మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. బాగా ఇష్టమైన మిత్రులను, బంధువులనుకలుసుకుం టారు. ఒక శుభకార్య‍ంలో పాల్గొంటారు. సమాజంలో పలుకుబడి కలిగినవ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ప్రతిభా పాటవాలకు ప్రత్యేకమైన గుర్తింపులభిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో అధికారు లను, సహోద్యోగులను పని తీరుతోఆకట్టుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలుచేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి. ఆరోగ్యం బాగానేఉంటుంది.. కన్య (Virgo):(ఉత్తర 2,3,4. హస్త, చిత్త 1,2)రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. కొందరుమిత్రులు అండగా నిలబడతారు. వృత్తి, వ్యాపారాల్లో లాభాలకు లోటుండదు.ఆరోగ్యం చాలావరకు కుదుట పడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సానుకూలపడతాయి.ఉద్యోగంలో మీ పనితీరుకు అధి కారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఆస్తివివాదాల్లో పెద్దల నుంచి సహాయం లభిస్తుంది. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడిఉండే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో వృద్ధిలోకి వస్తారు. తుల (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)వృత్తి, ఉద్యోగాలలో మీ మాటకు, చేతకు తిరుగుండదు. వ్యాపారాలు ఆశాజనకంగా,ఉత్సాహంగా సాగిపోతాయి. కొన్ని పాత రుణాలు వసూలు అవుతాయి. బంధువుల నుంచిరావాల్సిన డబ్బు కూడా అందుతుంది. ఆర్థిక ప్రయత్నాల వల్ల మానసిక ఒత్తిడికిగురవుతారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. మంచి పరిచయాలుఏర్పడతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు చాలా వరకు సఫలం అవుతాయి. కుటుంబజీవితం సాఫీగా సాగిపోతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వృశ్చికం(Scorpio):(విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. అలవికాని లక్ష్యాలతో ఇబ్బందిపడతారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ముఖ్యమైన అవసరాలుతీరిపోతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.బంధుమిత్రుల సహాయంతో ప్రధానమైన పనులు పూర్తవు తాయి. సొంత ఆలోచనలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందు తుంది. వృత్తి,వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఒకటి రెండు శుభవార్తలు వింటారు.. ధనుస్సు(Sagittarius): (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. వృత్తి, ఉద్యోగాలతో పాటువ్యాపారాలు కూడా లాభసాటిగా, ప్రోత్సాహకరంగా పురోగతి చెందుతాయి. కొన్నిఆర్థిక వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బాగా లాభపడతారు.వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నా లకు సానుకూలంగా ముందుకుసాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. అనుకున్న వ్యవహారాలుఅనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.. మకరం (Capricorn):(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2) ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. పొదుపు అలవాటు చేసుకోవడం మంచిది.మితిమీరిన ఔదార్యంతో మిత్రులకు సహాయం చేసే అవకాశం ఉంది. వృత్తి జీవితంలోబిజీ అయ్యే అవకాశం ఉంది. రాబడికి, లాభాలకు లోటుండదు. వ్యాపారాల్లో కొత్తఆలోచనలు అమలు చేసి, ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో అధికారుల నుంచిఆదరణ ఉంటుంది. మంచి పరిచ యాలు ఏర్పడతాయి. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. కుంభం (Aquarius):(ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3) స్తోమతకు మించి ఇతరులకు సహాయపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులుఎక్కువగా ఆధారపడతారు. అధికారులు మీ సలహాలతో ప్రయోజనాలు పొందుతారు.ముఖ్యమైన శుభ వార్తలు అందుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుంచి ఆదరణ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది.విలువైన కానుకలు లభిస్తాయి. నిరు ద్యోగులకు ఆశించిన స్థాయిలోఉద్యోగావకాశాలు అందివస్తాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు.. మీనం(Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి) రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. పిల్లలకు సంబంధించిన సమాచారం ఒకటి ఆనందంకలి గిస్తుంది. చాలా పనులు సానుకూలంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితిబాగా అనుకూలంగా ఉంటుంది. ఒకరిద్దరు మిత్రులకు సహాయం చేస్తారు. దైవకార్యాల మీద ఖర్చు ఎక్కువవుతుంది. ఇంటా బయటా అనుకూలతలు బాగా పెరుగుతాయి.పిల్లల చదువుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు.. (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.)


Combination Foods: కాఫీ తాగుతూ ఇవి అస్సలు తినకండి.. తింటే మీ ఆరోగ్యం మటాష్!

కాఫీ ఒక బెస్ట్ రీఫ్రెష్ డ్రింక్. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది, మెదడును చురుకుగా ఉంచుతుంది. కాఫీ తాగడం వల్ల మూడ్ ఇంప్రూవ్ అవుతుంది. దీంట్లో ఉండే కెఫిన్, ఇతర సమ్మేళనాలు డిప్రెషన్‌కు చెక్ పెడతాయి. అందుకే చాలామంది రోజూ ఈ హాట్ డ్రింక్ తాగుతారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా బిస్కట్లు, బ్రెడ్, స్నాక్స్ వంటివి తినడం చాలామందికి అలవాటు. ఈ కాంబినేషన్ వెరైటీ టేస్ట్‌ ఇస్తుంది. అయితే కాఫీ తాగేటప్పుడు కొన్ని రకాల ఫుడ్స్‌ను కాంబినేషన్‌గా తినకూడదు. వీటివల్ల కాఫీ రుచి మారవచ్చు, కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఆ పదార్థాలు ఏవో చూద్దాం. సిట్రస్‌ ఫ్రూట్స్నారింజ, ద్రాక్ష, బత్తాయి, జామ వంటి సిట్రస్ జాతి పండ్లలో సిట్రిక్ యాసిడ్ కంటెంట్ ఉంటుంది. కాఫీ తాగేటప్పుడు ఈ పండ్లను తినకూడదు. ఎందుకంటే వీటిలోని సిట్రిక్ యాసిడ్, కాఫీలోని కెఫిన్‌తో రియాక్షన్ జరుపుతుంది. ఫలితంగా వివిధ రకాల జీర్ణ సమస్యలు రావచ్చు. కొందరికి పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది. పనీర్చాలామంది కాఫీ తాగుతూ పనీర్‌తో చేసిన స్నాక్స్ తింటారు. అయితే ఇది కూడా సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే పనీర్‌‌లో కాల్షియం ఉంటుంది. కాఫీలోని కెఫిన్, శరీరం కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అందుకే ఈ కాంబినేషన్ సెట్ కాదు, ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఫ్రైడ్ స్నాక్స్కరకరలాడే ఫ్రైడ్ స్నాక్స్‌ను కాఫీ తాగుతూ తింటే రుచి మారే అవకాశం ఉంది. పైగా వీటితో కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు. సాధారణంగా చాలామంది కాఫీ తాగుతూ పకోడీలు, కారపూస వంటి పప్పు దినుసులతో చేసిన చిరుతిళ్లను తింటారు. ఇది సరైన కాంబినేషన్ కాదు. ఎందుకంటే కాఫీ, ఫ్రైడ్‌స్నాక్స్ కాంబినేషన్ జీర్ణ సమస్యల తీవ్రతను మరింత పెంచుతుంది. పోషకాల శోషణ తగ్గుతుంది. ఫ్రైడ్ ఫుడ్స్ తినడం వల్ల శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్ లెవల్స్ పెరుగుతాయి. కాఫీ తాగుతూ మిరపకాయ బజ్జీలు కూడా తినకూడదు. ఈ ఫుడ్ కాంబినేషన్‌ పొట్టలో ఎసిడిటీ, చిరాకు కలిగిస్తుంది. పాలు, పాల ఉత్పత్తులుకాఫీ, డెయిరీ ప్రొడక్ట్స్‌ను కాంబినేషన్‌గా అసలు తీసుకోకూడదు. ఎందుకంటే జున్ను, క్రీమ్, పాలు వంటి డెయిరీ ప్రొడక్ట్స్ తింటూ కాఫీ తాగినప్పుడు.. శరీరం ఐరన్‌ను శోషించే సామర్థ్యం తగ్గుతుంది. అందుకే ఈ కాంబినేషన్‌ మంచిది కాదు. అంతేకాకుండా కాఫీ తాగేటప్పుడు ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండే బీన్స్, పప్పు ధాన్యాలు, ఆకుకూరలతో చేసిన ఆహారాలు కూడా తినకూడదు. స్పైసీ ఫుడ్స్స్పైసీ ఫుడ్స్, స్నాక్స్ రుచికరంగా, ఘాటుగా ఉంటాయి. అందుకే వీటిని చాలా మంది ఆస్వాదిస్తారు. అయితే కాఫీ తాగుతూ కాంబినేషన్‌గా స్పైసీ ఫుడ్స్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఈ రెండిటి కాంబినేషన్ పొట్ట ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. డైజేషన్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. (Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ అంచనాల ఆధారంగా రూపొందించబడింది. news18 Telugu ఇదే విషయాన్ని ధృవీకరించలేదు. దయచేసి వాటిని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి)


చేతులు లావుగా ఉన్నాయా.. ఈ ఎక్సర్‌సైజెస్ చేయండి..

కొందరికీ బాడీ మొత్తం సన్నగా ఉన్నా చేతులు లావుగా ఉంటాయి. అలాంటివారు ఏ వర్కౌట్స్ చేస్తే చేతులు సన్నగా మారతాయో తెలుసుకోండి.


Horoscope: మే 14 రాశిఫలాలు. వారికి ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగుతాయి.

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 14, 2024 మంగళవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువగా ఆధారపడతారు. ఆర్థిక సమస్యల నుంచి క్రమంగా బయటపడతారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆదాయం బాగా పెరిగే అవకాశముంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి దైవకార్యాల్లో పాల్గొంటారు. ఇష్టమైన ఆలయాలు సందర్శిస్తారు. విదేశాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. వృషభ రాశి (Taurus):నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. ఉద్యోగంలో అధికారులు అప్పగించిన బాధ్యతలను విజయవంతంగా నెరవేరుస్తారు. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు తొలగిపోతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆటంకాలు ఏర్పడతాయి. పిల్లల చదువుల విషయంలో కాస్తంత శ్రద్ధ పెంచడం మంచిది. ఆరోగ్యం పరవాలేదు. మిథున రాశి (Gemini):వృత్తి, ఉద్యోగాల్లోనే హోదా పెరిగే అవకాశం ఉంది. సామాజికంగా కూడా హోదా పెరుగుతుంది. తల్లితండ్రుల జోక్యంతో సోదరులతో ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వ్యాపారాలు లాభాల బాటపడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన విధంగా స్థిరత్వం లభిస్తుంది. ఇంటా బయటా అనుకూలతలు ఉంటాయి. జీవిత భాగస్వామి ఏ రంగంలో ఉన్నప్పటికీ, అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఉపయోగకర పరిచయాలు ఏర్పడతాయి. కర్కాటక రాశి (Cancer):అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. కొందరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభకార్యంలో పాల్గొంటారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఎవరికీ వాగ్దానాలు చేయవద్దు. సింహ రాశి (Leo):ముఖ్యమైన వ్యవహారాలను చక్కబెట్టడం మీద దృష్టి కేంద్రీకరిస్తారు. వృత్తి, ఉద్యోగాలు హ్యాపీగా, సాఫీగా సాగిపోతాయి. మీ సలహాలు, సూచనలకు అధికారులు విలువనిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆర్థిక పరి స్థితి చాలావరకు ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబసమేతంగా దైవకార్యాల్లో పాల్గొంటారు. నిరుద్యో గులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కొందరు మిత్రులకు సహాయపడతారు. కన్య రాశి (Virgo):సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. అనుకోకుండా ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులను మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకుని ఇబ్బంది పడతారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. ఉన్నతస్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఆదాయపరంగా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. తుల రాశి (Libra):గ్రహ సంచారం చాలావరకు అనుకూలంగా ఉంది. కొద్ది ప్రయత్నంతో కొన్ని వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సోదరులతో, కొందరు బంధువులతో వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆదరణ ఉంటుంది. పని ఒత్తిడి తగ్గడానికి వీలుంది. వృత్తి, వ్యాపారాలను లాభాల బాటలో నడిపిస్తారు. జీవిత భాగస్వామి నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి (Scorpio):ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కడానికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు సానుకూలంగా సాగిపోతాయి. రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి. కుటుంబంలో కొద్దిగా బాధ్యతలు పెరుగుతాయి. పిల్లలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ధనస్సు రాశి (Sagittarius):ఏ ప్రయత్నం తలపెట్టినా నెరవేరుతుంది. వృత్తి, వ్యాపారాల్లో బాగానే రాబడి పెరుగుతుంది. ఉద్యో గంలో బాధ్యతలు పెరిగే సూచనలున్నాయి. కొద్దిగా వ్యయ ప్రయాసలున్నా కొన్ని ముఖ్యమైన వ్యవహారాలను పూర్తిచేస్తారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ఆరోగ్యానికీ, ఆదాయానికీ ఇబ్బందేమీ ఉండదు. అవసరానికి తగ్గట్టుగా డబ్బు అందుతుంది. సోదర వర్గంతో ఆస్తి వివాదంలో రాజీమార్గం అనుసరిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మకర రాశి (Capricorn):వృత్తి, ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆదాయానికి ఇబ్బందేమీ ఉండదు. ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. తల్లితండ్రుల్లో ఒకరి ఆరోగ్యం కాస్తంత ఇబ్బంది పెడుతుంది. ఓ వ్యక్తిగత సమస్య అనుకో కుండా పరిష్కారం అవుతుంది. జీవిత భాగస్వామికి కెరీర్ పరంగా మంచి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. పిల్లలు చదువుల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కుంభ రాశి (Aquarius):ఉద్యోగులకు కూడా మంచి అవకాశాలు అందివస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో అంచనాలకు మించి రాబడి ఉంటుంది. ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశముంది. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలు, వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ఆదాయపరంగా ఇతరులకు సహాయపడే స్థితిలో ఉంటారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీన రాశి (Pisces):ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేయడం జరుగుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులను చేపడతారు. ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధువుల నుంచి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో శ్రమ పెరిగినా ఫలితం ఉంటుంది. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Milk Ghee Benefits : రాత్రి పడుకునే ముందు పాలలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని తాగండి

Milk Ghee Benefits : పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే రాత్రిపూట పడుకునేముందు ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుని తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు.


శనివారం రోజున ఏం చేస్తే.. మీ అప్పులు తీరతాయో తెలుసా?

సాధారణంగా ప్రజలు శనివారం శనిదేవుడిని ప్రార్థిస్తారు. ఈ శనివారం రోజున ఆయనను పూజించడం వల్ల ఏవైనా దోషాలు ఉన్నా పోతాయి అని నమ్ముతారు. అదే శని దేవుడు ఆవనూనె తో పూజిస్తే... మీ జీవితమే మారిపోతుంది. చాలా మంది ఏదో ఒక సమయంలో ఏదో ఒక అవసరానికి అప్పులు చేస్తూ ఉంటారు. కానీ.. అందరికీ చేసిన అప్పులు తీరవు. ఆ అప్పు తీరక..దానిపై వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. ఇక చేసిన అప్పులు తీరక ఆస్తులు అమ్ముకున్నవాళ్లు... జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నవారు చాలా మందే ఉన్నారు....


Hair Care Tips: వేసవిలో విపరీతంగా జుట్టు రాలుతోందా? నిపుణులు సూచించిన చిట్కాలు ఇవే

summer hair care tips: వేసవి కాలంలో వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం కారణంగా చాలామందిలో చర్మ సమస్యలతో పాటు జుట్టు సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొందరి లోనైతే జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు వస్తాయి. అయితే ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి తప్పకుండా ఈ చిట్కాలు వినియోగించండి.


Brinjal Peanut Pulusu: రాయలసీమ వంకాయ పల్లీల పులుసు రెసిపీ

Brinjal Peanut Pulusu Recipe: వంకాయ పల్లీల పులుసు ఒక ప్రసిద్ధ రాయలసీమ వంటకం. ఇది వంకాయలు, పల్లీలు, మసాలాలతో తయారు చేయబడుతుంది. ఈ వంటకం చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, పోషకాలతో కూడా నిండి ఉంటుంది.


అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​!

అవేర్ నెస్ : నేచురల్​ బొటాక్స్​! బొటాక్స్​​ను కండరాలకు సంబంధించిన డిజార్డర్స్​, మైగ్రెయిన్స్​, చెమటలను తగ్గించడానికి వైద్యంలో వాడే మెథడ్​. అదే అందం విషయానికి వస్తే ముఖం చర్మం మీద ముడతలు, గీతలు తగ్గించేందుకు వాడుతున్నారు. అందం కోసం బొటాక్స్​ వాడడం అనే విషయం మీద ఇప్పటికీ ఎన్నో వాదనలు నడుస్తూనే ఉన్నాయి​. అయితే ముఖ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచుకునేం...


ఓ తండ్రిగా మీకు ఉండాల్సిన గుణాలు!

పిల్లలను సరిగా పెంచాలంటే తండ్రి గుణాలు సరిగా ఉండాలి. ఈ నేపథ్యంలో తండ్రికి ఎలాంటి


6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు

6 Fiber rich foods: మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ 6 ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు ఉంటే బరువు పెరిగే ఛాన్సే లేదు


Gulab Jamun: నోరూరించే గులాబ్ జామున్ తయారీ విధానం..!

Gulab Jamun Recipe: గులాబ్ జామున్ ఒక ప్రసిద్ధ భారతీయ స్వీటు, ఇది పాల పొడి, మైదా పిండి కొన్నిసార్లు ఖోవాతో తయారవుతుంది. అయితే దీని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలి అనేది మనం తెలుసుకుందాం.


Money Astrology: ఈ రాశి వారి పెండింగ్ పనులు పూర్తవుతాయి

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) జ్యోతిష్యులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు, ధన జ్యోతిష్యం ఫలితాలు చెబుతుంటారు. మే 12వ తేదీ, ఆదివారం నాటి ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో పరిశీలించండి. మేషం (Aries):వృత్తిపరమైన విషయాల్లో ఉత్సాహంగా ఉంటారు. కెరీర్‌లో కచ్చితంగా ముందుకు వెళ్తారు. ఒక శుభవార్త అందుకుంటారు. లాభాల లక్ష్యంపై దృష్టి సారిస్తారు. కొన్ని విషయాల్లో అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాలు సాధిస్తారు. వివిధ పనులు చురుకుగా సాగుతాయి. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి.పరిహారం: గాయత్రీ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వృషభం (Taurus):మౌలిక సదుపాయాలపై దృష్టి ఉంటుంది. అధికారులు మీకు సహకరిస్తారు. కొత్త ప్లానింగ్‌పై దృష్టి పెడతారు. వృత్తి వ్యాపారాలు బాగుంటాయి. పనికిరాని చర్చలు, సంభాషణకు దూరంగా ఉంటారు. వివిధ ప్రయత్నాలలో వేగం కొనసాగుతుంది. మీ కాంటాక్ట్ సోర్సులను పెంచుకుంటారు.పరిహారం: వినాయకునికి దూర్వా సమర్పించండి. మిథునం (Gemini):లక్ష్యంపై దృష్టి పెట్టండి, మీకు అందరి మద్దతు లభిస్తుంది. ఉత్సాహం అలాగే ఉంటుంది. కమర్షియల్ పనులకు ప్రాధాన్యత ఇస్తారు. వృత్తిపరమైన ప్రయాణాలు సాధ్యమే. ఆర్థిక వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. సంప్రదాయ పనులలో సమయం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో వేగం ఉంటుంది, లాభం పెరుగుతుంది.పరిహారం: హనుమంతునికి కొబ్బరికాయ కొట్టండి. కర్కాటకం (Cancer):సంప్రదాయ పనులను ప్రోత్సహిస్తారు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందుకుంటారు. కలెక్షన్ వర్క్‌కు ప్రాధాన్యత ఉంటుంది. బ్యాంకింగ్ పనులు జరుగుతాయి. వ్యాపార విషయాలపై దృష్టి పెడతారు. పని సామర్థ్యం బలపడుతుంది. ఆర్థిక, వ్యాపార ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.పరిహారం: దుర్గాదేవికి ఎర్రని చున్రీని నైవేద్యంగా పెట్టండి. సింహం (Leo):వర్క్ ఫీల్డ్‌లో మీ క్రియేటివిటీ పెరుగుతుంది. లాభాల శాతం మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో మీ ప్రభావం పెరుగుతుంది. పనిలో సంతృప్తి కొనసాగుతుంది. అవసరమైన లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక వాణిజ్య లాభం మెరుగ్గా ఉంటుంది.పరిహారం: చిన్నారులకు ఖీర్ తినిపించండి. కన్య (Virgo):పెట్టుబడి, విస్తరణ పనులతో అనుబంధం ఉంటుంది. వ్యాపారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారు. దూరదేశానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారమవుతాయి. వివిధ విషయాల్లో అప్రమత్తంగా ఉంటారు. క్రమశిక్షణ పాటితారు. ఆర్థిక విషయాలలో నిమగ్నం అవుతారు, సహనం పాటిస్తారు.పరిహారం: అరటి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):పరిశ్రమ, వ్యాపార విషయాలలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి నిపుణులతో అనుబంధం ఉంటుంది. మీ ప్రతిభ మెరుగుపడుతుంది. ప్రొఫెషనల్స్ మంచి ఫలితాలు పొందుతారు. విజయం పట్ల ఉత్సాహంగా ఉంటారు. పెద్దగా ఆలోచిస్తారు, ఆర్థిక రంగం మెరుగ్గా ఉంటుంది.పరిహారం: పొద్దున్నే నిద్రలేచి సూర్యుడికి నీరు సమర్పించండి. వృశ్చికం (Scorpio):వృత్తిపరమైన ప్రణాళికలను వేగవంతం అవుతాయి. కమ్యూనికేషన్‌లో విజయం సాధిస్తారు. విజయాలు పెరుగుతాయి. సక్రమంగా ముందుకు సాగుతారు. మీ ప్రతిష్ట, గౌరవం పెరుగుతుంది. పనిలో సౌకర్యాలు పెరుగుతాయి. పోటీ భావం పెరుగుతుంది. లాభం, విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు మెరుగుపడతాయి.పరిహారం: లక్ష్మీదేవికి తామర పూలు సమర్పించండి. ధనస్సు (Sagittarius):ఉద్యోగ వ్యాపారంలో మంచి పనితీరును కొనసాగిస్తారు. లక్ష్యాలు, తీర్మానాలను నెరవేరుస్తారు. పరిస్థితులలో సానుకూలత పెరుగుతుంది. పెండింగ్ వ్యవహారాలు ఊపందుకుంటాయి. కొత్త పనులు ప్రారంభించవచ్చు, ఈ విషయంలో వేగం ఉంటుంది. ఆఫీస్‌లో యాక్టివిటీ పెరుగుతుంది.పరిహారం: నూనెతో చేసిన ఇమర్తిని నల్ల కుక్కకు ఆహారంగా ఇవ్వండి. మకరం (Capricorn):పాలసీ రూల్స్ పాటించడం, తెలివిగా ఉండటం ద్వారా సిస్టమ్‌ను నమ్మండి. అందరి సహకారంతో ముందుకు సాగుతారు, క్రమశిక్షణ పాటిస్తారు. మీరు ఓర్పు, నమ్మకంతో మంచి ఫలితాలు పొందుతారు. పరిశ్రమల వ్యాపారం అలాగే ఉంటుంది. అపరిచితులకు దూరంగా ఉండండి. పుకార్లను నమ్మకూడదు.పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. కుంభం (Aquarius):ఆఫీస్‌లో ఓపికతో పని చేస్తారు. వ్యవస్థీకృత ప్రయత్నాలు బాగుంటాయి. లాభాల శాతాన్ని మెరుగుపరచుకోగలుగుతారు. ఉద్యోగ వృత్తిలో మెరుగ్గా రాణిస్తారు. ఆర్థిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. పెద్ద ప్రయత్నాలకు మార్గం తెరచుకుంటుంది. పరిశ్రమలు, వ్యాపారంలో శుభప్రదంగా ఉంటుంది. అంచనాలకు తగ్గట్టుగా పనితీరు ఉంటుంది.పరిహారం: చీమలకు పంచదార కలిపిన పిండిని ఆహారంగా ఇవ్వండి. మీనం (Pisces):ఉద్యోగ వ్యాపారంలో కోరుకున్న స్థానాన్ని నిలబెట్టుకోవడంలో విజయం సాధిస్తారు. నిబంధనలను పాటిస్తూనే ఉంటారు. దురాశ, ప్రలోభాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన చర్చలో భాగం అవుతారు. జాగ్రత్తగా ముందుకు సాగుతారు. సహచరుల మద్దతు లభిస్తుంది. వృత్తిపరమైన సంబంధాలలో సమన్వయం ఉంటుంది.పరిహారం: చేపలకు ఆహారం ఇవ్వండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Rasi Phalalu 14-5-2024: వారు మంచి పనితీరుతో ప్రశంసలు పొందుతారు

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 14వ తేదీ, మంగళవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మీ పార్ట్‌నర్‌తో అవగాహన అవసరం, అది మీ రిలేషన్‌షిప్‌ వృద్ధి చెందడానికి ఈ రోజు అవకాశం కల్పిస్తుంది. వర్కింగ్ ఫీల్డ్‌లో మీ పనితీరుతో మీకు ప్రశంసలు లభిస్తాయి. ధ్యానం లేదా యోగా చేస్తే ప్రశాంతంగా ఉంటుంది. బ్యాలెన్స్‌డ్ ఫుడ్ తింటూ, సాధారణ వ్యాయామం చేస్తూ హెల్తీ లైఫ్‌స్టైల్ మెయింటెన్ చేయండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 14, లక్కీ కలర్ రెడ్. సన్‌స్టోన్ లక్కీ క్రిస్టల్. వృషభం (Taurus):మీ ఫీలింగ్స్, ఆకాంక్షల గురించి రిలేషన్‌షిప్ పార్ట్‌నర్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. ఆఫీస్‌లో మీదైన పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు, సక్సెస్ అవుతారు. గార్డెనింగ్ లేదా పెయింటింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీస్ మీ మనసును రిఫ్రెష్ చేస్తాయి. విశ్రాంతి తీసుకోవడంతో పాటు వ్యాయామం చేయడం మర్చిపోవద్దు, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. లక్కీ నంబర్ 45, లక్కీ కలర్ ఆకుపచ్చ, లక్కీ స్టోన్ రోజ్ క్వార్ట్జ్. మిథునం (Gemini):గొప్ప వ్యక్తులతో పార్ట్నర్‌షిప్ ఏర్పరచుకోండి. మీ ఆలోచన శక్తితో వర్క్‌లో కష్టమైన సవాళ్లను పరిష్కరించవచ్చు. జర్నలింగ్ లేదా బుక్ రీడింగ్ వంటి మైండ్‌ఫుల్‌నెస్ పనులతో మానసిక సంతృప్తి లభిస్తుంది. తగినంత విశ్రాంతి తీసుకోవడం, పోషకాహారం తినడం తప్పనిసరి. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోండి. లక్కీ నంబర్ 79, లక్కీ కలర్ పసుపు రంగు, లక్కీ స్టోన్ క్లియర్ క్వార్ట్జ్. కర్కాటకం (Cancer):మీ లవ్ లైఫ్‌లో ఎమోషనల్, సపోర్టివ్ నేచర్‌తో ప్రయోజనం పొందవచ్చు. మీ కెరీర్‌ పరంగా తెలివైన నిర్ణయం తీసుకోవాలి. వంట లేదా తోటపని చేయడం ద్వారా మనసును రీఫ్రెష్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్డ్ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. లక్కీ నంబర్ 7, లక్కీ కలర్ సిల్వర్, లక్కీ స్టోన్ లాబ్రడోరైట్. సింహం (Leo):రిలేషన్‌షిప్‌లో రొమాన్స్, మ్యూచువల్ లవ్ ఉంటాయి. వర్క్ పరంగా మీ నాయకత్వ లక్షణాలు బాగుంటాయి, మీరు ఈ స్కిల్స్‌తో విజయం సాధించవచ్చు. డ్యాన్స్, మ్యూజిక్ వినడం వంటి యాక్టివిటీస్ మీ ఉత్సాహాన్ని పెంచుతాయి. యాక్టివ్ లైఫ్‌స్టైల్‌తో సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించుకోండి, ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. లక్కీ నంబర్ 18, లక్కీ కలర్ గోల్డెన్ కలర్, లక్కీ స్టోన్ అంబర్ స్టోన్. కన్య (Virgo):రిలేషన్‌షిప్, ప్రొఫెషనల్ లైఫ్.. రెండింటిలోనూ స్థిరత్వం, శ్రద్ధ అవసరం. పనిలో మీ పద్దతి, విధానంతో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. పజిల్స్ లేదా సుడోకు వంటి మైండ్-షార్పెనింగ్ యాక్టివిటీస్ ప్రయత్నించడం మంచిది. సెల్ఫ్ కేరింగ్, హెల్తీ ఫుడ్, ఇతర మంచి అలవాట్లతో ఆరోగ్యంగా ఉండండి. మీ లక్కీ నంబర్ 93, నేవీ బ్లూ లక్కీ కలర్, లాపిస్ లాజులి లక్కీ స్టోన్. తుల (Libra):మీరు ఈ రోజు రిలేషన్‌షిప్‌లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి, రాజీ పడాలి. ఉద్యోగంలో తెలివిగా పని చేస్తూ విజయ మార్గంలో నడుస్తారు. పెయింటింగ్ లేదా ఆర్ట్ వంటివి మీకు మోటివేషన్‌గా ఉంటాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు మీ దృష్టిలో ఉండాలి. లక్కీ నంబర్ 11, లక్కీ కలర్ గులాబీ రంగు. లక్కీ స్టోన్ రోడోనైట్ క్రిస్టల్. వృశ్చికం (Scorpio):భాగస్వామికి మీ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయండి, తద్వారా ఈ రోజు మీ ఎమోషనల్ కనెక్షన్ పెంచుకోండి, రిలేషన్‌షిప్‌ను ఆస్వాదించండి. వర్కింగ్ ఫీల్డ్‌లో మీ సంకల్పం, సోర్సుల ద్వారా విజయం సాధిస్తారు. మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లు చేస్తూ ప్రశాంతంగా ఉండవచ్చు. మీ శరీరం చెప్పే సంకేతాలు విని, ఆరోగ్యం కాపాడుకోండి. మీకు లక్కీ నంబర్ 22, లక్కీ కలర్ బ్లాక్, లక్కీ స్టోన్ గోమేదికం. ధనస్సు (Sagittarius):ఈ రోజు మీకు ఒక అడ్వెంచర్‌గా ఉంటుంది. కొత్త పనులు చేయాల్సి ఉంటుంది. పనిలో మీ సానుకూల దృక్పథంతో గుర్తింపు తెచ్చుకుంటారు. హైకింగ్ లేదా వాకింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీస్‌ మిమ్మల్ని యాక్టివ్‌గా ఉంచుతాయి. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం నేడు మీ ప్రాధాన్యతగా ఉండాలి. మీ లక్కీ నంబర్ 44, లక్కీ కలర్ పర్పుల్, లక్కీ స్టోన్ అమెథిస్ట్. మకరం (Capricorn):రొమాంటిక్ రిలేషన్‌లో స్థిరత్వం, నిబద్ధత ముఖ్యం, నేడు వీటిపై మీరు దృష్టి పెట్టవచ్చు. పట్టుదలతో పనిలో విజయాలు సాధిస్తారు. దారితీయవచ్చు. ఆర్గనైజేషనల్ టాస్క్‌లు మీ వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్‌ను సరికొత్తగా మార్చగలవు. మంచి ఆరోగ్యం కోసం బ్యాలెన్స్‌డ్ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలి. మీ లక్కీ నంబర్ 10, లక్కీ కలర్ బ్రౌన్, లక్కీ స్టోన్ టైగర్స్ ఐ. కుంభం (Aquarius):ఈ రోజు కుటుంబం, రొమాంటిక్ రిలేషన్స్‌లో మేధోపరమైన (Intellectual) పనులు చేయాల్సి ఉంటుంది, తెలివిగా ఆలోచించాలి. మీ వినూత్న ఆలోచనలు మిమ్మల్ని వృత్తిపరంగా విజయ బాటలో నడించగలవు. మెదడుకు పని పెట్టే యాక్టివిటీస్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్‌కు హాజరు కావడం ద్వారా యాక్టివ్‌గా ఉండండి. మైండ్‌ఫుల్‌నెస్, రిలాక్సేషన్ పద్ధతులు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రోజు మీ లక్కీ నంబర్ 15, లక్కీ కలర్ మణి రంగు, లక్కీ స్టోన్ అమేజొనైట్. మీనం (Pisces):ఈ రోజు మీ రిలేషన్‌షిప్‌ పార్ట్నర్‌కు ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. మీ నేచురల్, క్రియేటివ్ స్కిల్స్‌తో పనిలో సక్సెస్ అవుతారు. జర్నలింగ్ లేదా గ్రాట్టిట్యూడ్ యాక్టివిటీస్ మనసుకు ప్రశాంతత ఇస్తాయి. ఈరోజు మీరు ఎమోషనల్ హెల్త్‌పై (భావోద్వేగ శ్రేయస్సు) శ్రద్ధ వహించండి, అవసరమైనప్పుడు పనిలో బ్రేక్స్ తీసకోండి. మీ లక్కీ నంబర్ 98, లక్కీ కలర్ సీ గ్రీన్, లక్కీ స్టోన్ ఫ్లోరైట్. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Egg Masala Fry: కోడిగుడ్డు మసాలా వేపుడు ఇలా చేశారంటే లొట్టలు వేసుకొని తింటారు, రెసిపీ ఇదిగో

Egg Masala Fry: కోడిగుడ్డుతో చేసిన వంటకాలు ఏవైనా కూడా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మేము కోడిగుడ్డు మసాలా వేపుడు ఇచ్చాము. ఇది ఒక్కసారి తిన్నారంటే రుచి మర్చిపోలేరు.


ఈ రాశుల వారు పని పిచ్చోళ్లు..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు ఎప్పుడూ చూసినా పనిలో బిజీగానే ఉంటారు. ఇలాంటి వారే కంపెనీలో ఉత్తమ ఎంప్లాయ్ గా పేరుతెచ్చుకుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? జ్యోతిష్యం పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి వ్యక్తి జీవితంలో ఒక అంతర్భాగం అంటారు జ్యోతిష్యులు. ఇకపోతే కొన్ని రాశుల వారు పనికి దూరంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారు మాత్రం ఎప్పుడూ పనిలోనే ఉంటారు. వీరికి పనే లోకం. పనిలోనే వీరు సంతోషాన్ని వెతుక్కుంటారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరెవరంటే? మేష...


మామిడి పండ్లు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదా..? ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏం చేయాలి?

చాలా మంది ఒకేసారి మామిడి పండ్లు ఎక్కువగా కొనుక్కోని.. ఆ తర్వాత వాటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటారు. మండే ఎండల్లో మనకు ఊరటనిచ్చేది ఏదైనా ఉంది అంటే అది మామిడి పండు మాత్రమే. ఈ మామిడి పండును ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. మార్కెట్లోకి మామిడి పండ్లు రాగానే... వాటిని కొనేసి ఇష్టంగా తినేస్తూ ఉంటాం. చాలా మంది ఒకేసారి మామిడి పండ్లు ఎక్కువగా కొనుక్కోని.. ఆ తర్వాత వాటిని తెచ్చి ఫ్రిడ్జ్ లో నిల్వ చేస్తూ ఉంటారు. కానీ మామిడి పండ్లను ఫ్రిడ్జ్ లో నిల్వ...


Summer Fruits: వేసవి సమస్యల్ని ఇట్టే మాయం చేస్ 5 అద్భుతమైన పండ్లు

Summer Fruits: వేసవి సమస్యల్ని ఇట్టే మాయం చేస్ 5 అద్భుతమైన పండ్లు


TSRTC Dress Code : ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లకు నో- టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ ఆదేశాలు

TSRTC Dress Code : టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వస్త్రధారణ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు ఇకపై టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది.


మీరు పుట్టిన తేదీ ప్రకారం మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా..?

న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారో కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. మనం ఎలా ఉన్నాం అనేది మనకు ఉన్న అలవాట్లే నిర్ణయిస్తాయి. మంచి ఆరోగ్యకరమైన అలవాట్లు ఉన్నవారు.. ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటారు. అదే.. చెడు అలవాట్లు ఉన్నవారికి అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అదేవిధంగా న్యూమరాలజీ ప్రకారం... ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అలవాట్లుు ఉంటే.... వారి జీవితంలో...


చెరకు రసం వాళ్లు మాత్రం తాగకూడదు.. ఎందుకో తెలుసా?

వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మొత్తంమీద ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. చెరకు రసం భారతదేశంలో చాలా ప్రసిద్ధ వేసవి పానీయం. శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ధర కూడా చాలా తక్కువ. ఇందులో కార్బోహైడ్రేట్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం , పొటాషియం వంటి అనేక రకాల పోషకాలు ఉన్నాయి. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో ఇది ఎంతగానో సహకరిస్తుంది. మొత్తంమీద ఈ జ్యూస్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఇది చాలా...


అక్షయ తృతీయ ఎంతో శుభప్రదం.. అయినా పెళ్లి ముహూర్తాలు లేవు.. ఎందుకంటే..?

హిందువులు జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండగలలో అక్షయ తృతీయ (Akshaya Tritiya) ఒకటి. హిందూ సంస్కృతి, సంప్రదాయాలలో ఈ పర్వదినానికి అపారమైన ప్రాముఖ్యత ఉంది. ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్షంలోని తదియ ఈ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది మే 10న శుక్రవారం నాడు అక్షయ తృతీయ వచ్చింది. అక్షయ తృతీయ 2024 పూజ ముహూర్తం ఉదయం 5:33 గంటల నుంచి మధ్యాహ్నం 12:18 గంటల వరకు ఉంటుంది. తృతీయ తిథి మే 10 ఉదయం 4:17 గంటలకు ప్రారంభం అవుతుంది. మే 11 ఉదయం 2:50 గంటలకు ముగుస్తుంది. అయితే ఇంత...


Black Tea with Lemon: లెమన్ బ్లాక్ టీ ఆరోగ్యానికి మంచిది కాదా, కిడ్నీల్ని పాడు చేస్తుందా

Black Tea with Lemon: మనిషి ఆరోగ్యం అనేది ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. కొన్ని అలవాట్లు ఆరోగ్యానికి కొంతవరకూ మేలు చేసినా కొందరికి మాత్రం హాని కల్గిస్తాయి. అందుకే ఆరోగ్యం విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి


Mothers day 2024 Wishes in Telugu: అమ్మ ప్రేమకు ఇవే మా నీరాజనాలు, మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు అందమైన కోట్స్ ఇదిగో

Mothers day 2024 Wishes in Telugu: మాతృ దినోత్సవం రోజు తల్లి ప్రేమను అందించిన ప్రతి స్త్రీకి శుభాకాంక్షలు చెప్పవలసిన అవసరం ఉంది. అందుకోసం తెలుగులోనే కొన్ని శుభాకాంక్షలు ఇచ్చాము.


Chapati Flour : చపాతీ పిండిలో ఐస్ క్యూబ్స్ వేస్తే జరిగే విషయం తెలిస్తే ఇకపై అదే పని చేస్తారు

Chapati Flour : చపాతీ పిండిని ఫ్రిజ్‌లో ఉంచితే పైన నల్లటి పొర కనిపిస్తుంది. ఇది జరగకుండా నిరోధించడానికి, పిండి త్వరగా చెడిపోకుండా ఉండేందుకు ఒక మార్గం ఉంది. అది ఏంటో తెలుసా?


Celebs First Mother's Day: మొదటిసారి పిల్లలతో కలిసి మథర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్న సెలబ్రిటీలు వీరే!

Celebs First Mother's Day 2024: మథర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం తమ తల్లులకు విష్ చేస్తూ, వారి స్పెషల్ మూమెంట్స్‌ను షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు. అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ తల్లులతో ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. ఇక ఈసారి మొదటిసారిగా తమ పిల్లలతో మథర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు. అందులో చాలావరకు బాలీవుడ్ సినీ సెలబ్రిటీలే ఉన్నారు. ఉపాసన కొణిదెల మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసనకు గతేడాది.. అంటే...


నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్

నిప్పులు కక్కిన సూరీడు..భూమిని తాకిన భారీ సౌర తుఫాన్ భూమిపై రెండు మూడు రోజులు సూర్యుడి ప్లాస్మా, రేడియేషన్ ఎఫెక్ట్       లడఖ్​లోని హాన్లే గ్రామంలోనూ రంగుల్లో మెరిసిన ఆకాశం కేప్ కానవెరాల్ (యూఎస్ఏ):    సూర్యుడు రెండు దశాబ్దాల్లోనే అతి తీవ్రంగా నిప్పులు కక్కాడు. దీంతో భారీ సౌర తుఫాన్ ఏర్పడి, అది భూమిని తాకింది. సూర్యుడిపై బుధవారం పెద్ద ఎత్తున సౌర జ్వ...


Tomato Halwa Recipe: టమాటో హల్వా ఎప్పుడైనా తిన్నారా? తింటే మైమరిచిపోతారు, రెసిపీ ఇదిగో

Tomato Halwa Recipe: టమాటోలతో హల్వా ఏమిటి? అనుకోకండి. టమాటాలతో ఎన్నో రకాల రెసిపీలను ప్రయత్నించవచ్చు. ఇక్కడ మేము టమాటో హల్వా రెసిపీ ఇచ్చాము. ఈ స్వీట్ రెసిపీ ఒకసారి ప్రయత్నించండి.


పిల్లల విషయంలో తల్లులు అస్సలు చేయకూడని తప్పులు ఇవే...!

తమ పిల్లలను గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలిపెడుతున్నారు. కానీ... మీ పిల్లలను మీరే పెంచాలి. వారికి మీరు కచ్చితంగా క్వాలిటీ టైమ్ కేటాయించాలి. ప్రతి తల్లి తన బిడ్డపై అమితమైన ప్రేమ పెంచుకుంటుంది. అమ్మ ప్రేమ విషయంలో మనం ఎలాంటి లోపాలు ఎత్తి చూపించాల్సిన అవసరం లేదు. కానీ... తెలిసీ తెలియక చాలా మంది తల్లులు.. పిల్లల పెంపకంలో తప్పులు చేస్తూ ఉంటారు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ రోజుల్లో పేరెంట్స్ కి పిల్లలపై ప్రేమ ఉంటే సరిపోదు....


కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు

కాసేపట్లో పెళ్లి.. అయినా పెళ్లికొడుకు ఓటేశాడు మరికాసేపట్లో పెళ్లి చేసుకోబుతున్నాడు.  అయినా సరే ఓటే ముఖ్యమనుకున్నాడు.  పెళ్లి కొడుకు గెటప్​ లో  ఓ వ్యక్తి పోలింగ్​కేంద్రానికి వచ్చాడు.   శ్రీనగర్​ లోక్​సభ నియోజకవర్గంలోని గందర్​బల్​ పట్టణంలోని పోలింగ్​స్టేషన్​ ఓ పెళ్లికొడుకు తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అనంతరం పెళ్లి కొడుకు మీడియాతో మాట్లాడుతూ.....


నేచర్ లవర్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాలు!

ప్రకృతి అందాలను ఇష్టపడే వారికి ఇండియాలో కొన్ని డెస్టినేషన్స్ తప్పక నచ్చుతాయి. అవేంటో తెలుసుకుందాం.


ఫిష్‌ ఆయిల్‌ వల్ల ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు ఇవే!

ఫిష్ ఆయిల్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలోని పోషకాలు అనేక అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి.


ఈ 3 రాశుల వారికి భారీ శుభవార్త.. అఖండ యోగం, ఆకస్మిక ధన లాభం!

మే 14న సూర్యుడు, మే 19న శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తారని జ్యోతిష్య నిపుణులు తెలిపారు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో రావడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. కొన్ని రాశుల వారు బృహస్పతి గ్రహం కారణంగా ఏర్పడే త్రిగ్రాహి యోగం వల్ల ఎంతో ప్రయోజనం పొందుతారు. మరి ఈ అదృష్ట సంకేతాలు ఏమిటో చూద్దాం. వృశ్చికం : సూర్యుడు, శుక్రుడు, బృహస్పతి త్రిగ్రాహి యోగం ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం ఉండనుంది. ముఖ్యంగా మీ ఆదాయం పెరుగుతుంది. అలాగే, ఈ నెలలో మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. కెరీర్‌లో ముఖ్యమైన బాధ్యతలను పొందవచ్చు. మీరు మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడినట్లయితే, మీరు మీ భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. వృషభం: త్రిగ్రాహి యోగం మీకు చాలా మేలు చేస్తుంది. గ్రహాల గమనం మారినప్పుడు, మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి కూడా స్థిరంగా ఉంటుంది. ఖర్చులపై కొంచెం నియంత్రణ ఉంచండి. ప్రత్యేకత ఏమిటంటే కష్టాల్లో ఉన్నప్పుడు కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. మకరం: ఈ యోగం మీకు మేలు చేస్తుంది . మీరు తలపెట్టిన పనిలో విజయం సాధిస్తారు. దాంతో మనసులో సానుకూలత ఏర్పడుతుంది . పిల్లలతో మంచి సమయం గడుపుతారు. మీరు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనచ్చు. ఆరోగ్యం కూడా బాగుంటుంది. గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. న్యూస్18 తెలుగు దానికి హామీ ఇవ్వదు.


Numerology: వీరికి ఇది అద్భుతమైన రోజు.. అనుకున్న పని సక్సెస్ అవుతుంది

Numerology: 1 నుండి 9 వరకు ఉన్న సంఖ్యల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి, మీ పుట్టిన తేదీని గమనించండి, పుట్టిన తేదీ సంఖ్యలు రెండింటినీ కలపాలి. మీరు పొందే సంఖ్య మీకు ప్రాతినిధ్యం వహిస్తుంది ఆ సంఖ్య ద్వారా మీ ఈరోజు అనగా 13 మే 2024 ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. Number 1: ఈ రోజు మీకు చాలా ఫలవంతమైన రోజు. ఈరోజు వ్యాపారస్తులు రిస్క్ తీసుకోకుండా ఉండటం మంచిది లేదా వారు తమ ప్రవర్తనలోని మాధుర్యాన్ని కాపాడుకోవాలి, అప్పుడే వారు ఎవరినైనా తమ పనిని చేయించడంలో విజయం సాధిస్తారు. ఈ రోజు మీరు అవసరంలో ఉన్న వ్యక్తికి సహాయం చేయాల్సి ఉంటుంది, కానీ మీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సహాయం చేయడం మంచిది. Number 2: ఈరోజు పని చేసే వారు తమ పనిని జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే ఈ రోజు ఏదైనా పని తొందరపాటుతో చేస్తే, వారు పొరపాటు చేయవచ్చు, దాని వల్ల వారి పని చెడిపోవచ్చు. ఈ రోజు వ్యాపారులకు ఆహ్లాదకరమైన రోజు. భాగస్వామ్యంలో ఏదైనా వ్యాపారం కోసం ఈ రోజు సాధారణ రోజు అవుతుంది Number 3: ఈరోజు, 3వ స్థానానికి చెందిన వ్యక్తులు వారి పాత పెట్టుబడుల నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీరు మీ పిల్లల చదువు, వారికి విదేశాల్లో చదువు చెప్పాలా వద్దా అనే విషయాలపై పెద్ద నిర్ణయం తీసుకోవలసి రావచ్చు. ఈ రోజు, మీ చేతిలో ఒకటి కంటే ఎక్కువ పనులు ఉన్నాయి, ఇది మీ ఆందోళనను పెంచుతుంది Number 4: ఈరోజు వ్యాపారం చేసే వ్యక్తులు రిస్క్ తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండాలి. భారీ లాభాల కోసం రిస్క్‌లు తీసుకుంటే నష్టాలు తప్పవు కాబట్టి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీరు మీ స్నేహితులలో ఒకరికి కొంత డబ్బును ఏర్పాటు చేయవలసి ఉంటుంది. Number 5: ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగాలు లేదా వ్యాపార వ్యక్తులు ఈ రోజు వారి వ్యాపారానికి కొత్తదనాన్ని తీసుకురాగలుగుతారు మరియు భవిష్యత్తులో మీరు దాని నుండి ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ జీవితంలో శాంతి మరియు ఆనందం ఉంటుంది. పెళ్లికాని వారి జీవితంలోకి ఈరోజు కొత్త అతిథి రావచ్చు Number 6: ఈరోజు మీరు శక్తివంతంగా ఉంటారు. ఈ రోజు మీరు ఇతరుల పనిలో మిమ్మల్ని మీరు నిమగ్నం చేయడానికి ప్రయత్నిస్తారు, దాని కారణంగా మీరు సమస్యలను ఎదుర్కొంటారు ఎందుకంటే ఈ రోజు మీరు మీ పనిలో కొంత భాగాన్ని ఇతరుల కోసం వాయిదా వేస్తారు, కానీ వ్యాపారవేత్తలు అలా చేస్తే. , అప్పుడు వారు తమ లాభ అవకాశాలను కోల్పోతారు. Number 7: ఈ రోజు మీరు మీ ప్రవర్తనలో సంయమనం మరియు జాగ్రత్త వహించాలి. మీ పరిసరాల్లో ఏ గొడవ జరిగినా, మీరు దానిని పట్టించుకోకుండా మీ పనిలో బిజీగా ఉండండి. మీరు ఈ రోజు ఎవరి పనిలో నిమగ్నమైతే, మీరు వ్యక్తుల నుండి పరుషమైన మాటలు వినవచ్చు, కాబట్టి మీరు ఈ రోజు ఎవరు చెప్పినా నమ్మకూడదు. Number 8: ఈ రోజు మీకు బిజీగా ఉంటుంది, ఎందుకంటే శ్రామిక ప్రజల అధికారులు పని రంగంలో వారి పనిలో అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు, దాని కారణంగా వారు ఆటంకాలు కలిగి ఉంటారు, అయితే వారు తమ పనిని పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీరు చేదును తీపిగా మార్చే కళను నేర్చుకోవాలి. Number 9: నేటి జాతకం ప్రకారం, ఈ రోజు మీకు చాలా ఒత్తిడితో కూడిన రోజు అవుతుంది, దీని కారణంగా మీరు మీ పిల్లల కోసం సమయాన్ని కనుగొనడంలో విఫలం కావచ్చు మరియు మీపై కోపం తెచ్చుకోవచ్చు. ఈ రోజు మీరు మీ అసంపూర్తి పనులను పూర్తి చేయడానికి రోజంతా గడుపుతారు మరియు మీరు మీ తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నెరవేర్చగలరు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


ఒంటరిగా ఉండలేను రెండో పెళ్లి చేసుకుంటా.. కానీ అలాంటి వాడు కావాలి.. కోరిక బయటపెట్టిన ఎస్తేర్‌ నోర్హా

హీరోయిన్‌ ఎస్తేర్‌ నోర్హ.. నోయల్‌తో విడిపోయి ఒంటరిగానే ఉంటున్న విషయం తెలిసిందే. తాజాగా రెండో పెళ్లిపై ఆమె స్పందించింది. ఒంటరిగా ఉండలేనని కామెంట్‌ చేసింది. హీరోయిన్‌ ఎస్తేర్‌ ఒకప్పుడు హీరోయిన్‌గా మెప్పించింది. విజయాలు అందుకుంది. సునీల్‌తో `భీమవరం బుల్లోడు`తో మెరిసి అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే హీరోయిన్‌గా ఈ బ్యూటీకి సక్సెస్‌ రాలేదు. అడపాదడపా సినిమాలు చేసినా అవి పెద్దగా ఆడలేదు. పైగా అన్నీ చిన్న సినిమాలే కావడం గమనార్హం. ఈ క్రమంలో ఆమె నటుడు...


మహిళల ఇంట్లోకి వెళ్లి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ యువకుడు.. 20 రోజుల్లో రెండు పెళ్లిళ్లు

అతడో 19 ఏళ్ల యువకుడు. అప్పటికే పెళ్లి అయి.. బిడ్డ ఉన్న ఓ మహిళతో సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెను కలిసేందుకు వెళ్లి గ్రామస్థులకు పట్టుబడ్డాడు. దీంతో వారిద్దరికీ పెళ్లి చేశారు. ఈ సంఘటన జరిగిన 20 రోజుల్లోపే మరో గ్రామంలోని ఓ మహిళ ఇంటికి వెళ్లిన అదే యువకుడు.. మరోసారి ఆ గ్రామ ప్రజలకు దొరికిపోయాడు. మొదట జరిగిన పెళ్లి విషయం దాచిన ఆ యువకుడికి, ఆ మహిళకు వివాహం చేశారు. దీంతో 20 రోజుల్లోనే 2 పెళ్లిళ్లు చేసుకున్నట్లు అయింది. అయితే ఆ తర్వాతే అసలు...


ఇండియాలో బ్యాన్ చేసిన ఆహారాలు ఇవిగో!

కొన్ని కారణాల వల్ల ఇండియాలో కొన్ని ఆహారాలను బ్యాన్ చేశారు. అవేంటో తెలుసుకుందాం.


ఎక్కువ సేపు నిద్రపోతే ఏమౌతుంది?

కొంతమంది చాలా తక్కువ సమయం మాత్రమే పడుకుంటారు. మరికొంతమంది పది పదకొండు గంటలు కంటిన్యూగా నిద్రపోతూనే ఉంటారు. కానీ పడుకోవాల్సిన టైం కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కొందమందికి అస్సలు నిద్ర పట్టదు. కొందరికి ఇలా ఒరగగానే అలా నిద్రలోకి జారుకుంటారు. అయితే చాలా మంది ఎంత తొందరగా నిద్రపోయినా ఏడెనిమిది గంటలు మాత్రమే పడుకుంటుంటారు. కానీ మరికొందరు మాత్రం విపరీతంగా నిద్రపోతారు. అంటే రోజులో చాలా టైం నిద్రకే కేటాయిస్తుంటారు. కానీ ఇలా...


Never Eat Foods : ఖాళీ కడుపుతో ఈ 5 ఆహారాలు తినకండి.. ఎందుకో తెలుసుకోండి

Empty Stomach Avoid Foods : ఉదయంపూట మనం తీసుకునే ఆహారం మంచిదై ఉండాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఖాళీ కడుపుతో తీసుకోకూడని కొన్ని ఆహారాలు ఉన్నాయి.


Vastu Tips for Plants: ఇంటి భయట ఏ మొక్కలను నాటాలి.. అరటి, మామిడి చెట్లతో శుభమా..? అశుభమా..

ప్రతి ఒక్కరూ ఇంటి బయట చెట్లను నాటడానికి ఇష్టపడతారు. కానీ ప్రతి మొక్క యొక్క స్వభావం భిన్నంగా ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఒక చెట్టును నాటడం ద్వారా కొన్ని కుటుంబాలు సుభిక్షంగా మారితే మరికొన్ని పేదరికంలో మునిగిపోతాయి. ఈ రోజు మనం మామిడితో సహా అటువంటి 6 మొక్కల గురించి .. వాటి శుభ, అశుభ ప్రభావాల గురించి తెలుసుకుందాం. పండితుల ప్రకారం.. ఉసిరి చెట్టు విష్ణువుకు చాలా ప్రియమైనది. ఇక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. ఈ చెట్టు అన్ని కోరికలను...


రాశిఫలాలు 12 మే 2024 ఈరోజు మేషంలో బుధాదిత్య రాజయోగంతో ఈ రాశుల వారికి గొప్ప ప్రయోజనాలు..!

horoscope today 12 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వల్ల మిధునం, మీనంతో సహా ఈ 5 రాశులకు గొప్ప ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ సందర్భంగా మిగిలిన రాశుల ఫలితాలెలా ఉన్నాయంటే...


మెరుగైన కంటిచూపు కోసం ఇలా చేయండి!

కంటిచూపు మెరుగ్గా ఉంచడం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం


Watermelon Juice:సమ్మర్‌లో ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ ఇలా తయారు చేసుకోండి..!

Watermelon Juice Recipe: పుచ్చకాయ జ్యూస్ వేసవిలో చాలా ప్రాచుర్యం పొందిన డ్రింక్. ఇది రుచికరమైనది, చల్లగా ఉంటుంది, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది.


Interesting: ప్రపంచంలోనే మొదటి దోశ ఎక్కడ తయారు చేశారో తెలుసా.. దోశ చరిత్ర ఇదే..

దక్షిణ భారత వంటకాల్లో ఎక్కువగా ప్రజలు ఇష్టపడేది దోశ. ఉదయం లేవగానే టిఫిన్ కు ఎక్కువగా దీనినే కోరుకుంటారు. స్పెషల్ దోశ, ప్లేన్ దోశ, మసాలా దోశ.. ఇలా పలు రకాలుగా దోశల్లో రకాలు ఉంటాయి. దీనిని భారతదేశం అంతటా ఎంతో ఉత్సాహంతో తింటారు. ఈ రోజు మీరు ప్రతి వీధి, కూడలిలో దీనిని విక్రయించబడటం చూస్తూ ఉంటారు. తోపుడు బండి వాడు దగ్గర నుంచి ఫైవ్ స్టార్ హోటల్ వరకు తమ మెనూ లో దీనికి కచ్చితంగా చేర్చాల్సిందే. అయితే ఈ ప్రత్యేక వంటకం గురించి ఈ రోజు మీకు తెలియజేయబోతున్నాం.. దాని చరిత్ర గురించి మీరు ఇక్కడ తెలుసుకోండి. దోశ గురించిన మొదటి ప్రస్తావన తమిళనాడులోని 8వ శతాబ్దపు నిఘంటువులో కనుగొనబడింది. కన్నడ సాహిత్యంలో దోశ యొక్క మొదటి ప్రస్తావన ఒక శతాబ్దం తరువాత కనుగొనబడింది. అయితే.. 10వ శతాబ్దంలో దోశను కంజం అనే మరో పేరుతో కూడా ప్రస్తావించారు. చరిత్ర పుటలతో పాటు దక్షిణ భారతదేశంలోని దేవాలయాల్లో కూడా ఈ వంటకం కనిపిస్తుంది. తమిళనాడులోని కొన్ని దేవాలయాలలో 16వ శతాబ్దానికి చెందిన అనేక శాసనాలలో కూడా దోశ ప్రస్తావన ఉందని చెబుతారు. తమిళనాడులో ఇడ్లీ , సాంబార్ తో పాటు..ఈ దోశ కూడా ఎంతో ఫేమస్ గా ఉంటుంది. ఇక తిరుపతి, శ్రీరంగం, కాంచీపురంలోని విష్ణు ఆలయాల్లోని శాసనాలు కూడా స్వామికి దోశలు సమర్పించడానికి డబ్బును విరాళంగా ఇచ్చే ఆచారం అప్పట్లో ప్రబలంగా ఉందని.. దీనిని దోశపడి అని పిలిచేవారు. కొంతమంది చరిత్రకారులు దోశ యొక్క మొదటి ప్రస్తావన 5వ శతాబ్దంలో కనుగొనబడిందని నమ్ముతారు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం.. ఆ సమయంలో కర్ణాటకలోని ఉద్పి దేవాలయం చుట్టూ ఉన్న వీధులు ఎక్కువగా దోశ కోసం ప్రసిద్ధి చెందాయి. కాగా.. మైసూర్ మహారాజా వడయార్ కారణంగా మసాలా దోశ ఉనికిలోకి వచ్చింది. ఒక సర్వే ప్రకారం.. ఫుడ్‌ డెలీవరీ సంస్థ స్విగ్గీ 2023 నుంచి 2024 వరకు దాదాపు 29 మిలియన్ల దోశలను డెలివరీ చేసినట్లు తేలింది. అంతేగాదు ఒక నిమిషానికి 122 దోశలను బ్రేక్‌ ఫాస్ట్‌గా డెలీవరి చేస్తున్నట్లు వెల్లడయ్యింది. దోశకు క్యాపిటల్‌గా బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ముంబై వంటి మహా నగరాలు నిలిచాయి. అక్కడ రోజుకి లక్షల్లో దోశ ఆర్డర్లు వస్తున్నట్లు నివేదిక పేర్కొంది. మీరు దోశ చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా.. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దోశ గురించి మీకు తెలుసా..? మేము మీకు ఇక్కడ చెబుతాం.. వాస్తవానికి.. ఇటీవల MTR ఫుడ్స్ 123 అడుగుల పొడవైన దోశ వేసి.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. ఇదే ప్రస్తుతానికి ప్రపంచంలోనే అతి పెద్ద దోశగా ప్రసిద్ధికెక్కింది.


నిషా ఎక్కించిన మంజూష.. చీరలో సిరి సొగసులు.. దివి నేచురల్ లుక్

బుల్లితెర బ్యూటీలు తాజాగా షేర్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ విశేషాలు మీ కోసం.