VENUS TRANSIT ON 25 APRIL: ఈ రాశులవారి జీవితాల్లో అద్భుతం జరబోతోంది.. ఎటు చూసిన డబ్బే, డబ్బు!

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని ఆనందం, వైభవం, ఐశ్యర్యం, జీవితానికి కారకుడిగా భావిస్తారు. ఈ గ్రహం ప్రతి నెల లేదా కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో సంచారం చేస్తుంది. అయితే శుక్రుడు ఏప్రిల్ 25 రోజున తన రాశిని మార్చుకోబోతున్నాడు. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అలాగే ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారిపై శుభ, అశుభ ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి. శుక్ర గ్రహం మీన రాశి నుంచి నేరుగా మేష రాశిలోకి సంచారం చేయబోతోంది. దీంతో 5 రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు అదృష్టం కూడా విపరీతంగా పెరిగే ఛాన్స్‌ కూడా ఉంది. అలాగే శుక్రుడు శుభ స్థానంలో ఉన్నవారికి ఐశ్వర్యం, సంతోషం, సౌభాగ్యాలు కూడా లభిస్తాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Venus Transit On 25 April In Telugu:

మేషరాశి:

శుక్రుడి సంచార ప్రభావంతో మేష రాశివారికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కేరీర్‌ పరంగా అనేక విజయాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే సామాజిక స్థితి కూడా పెరుగుతుంది. దీని కారణంగా వ్యాపారాల్లో విపరీతమైన ఆర్థిక లాభాలు కలిగే ఛాన్స్‌ ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. అలాగే ఆదాయం కూడా పెరుగుతుంది. 

మిథున రాశి:

మిథున రాశి వారికి ఈ సమయంలో చాలా రకాల లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ప్రతి రంగంలో ఆశించిన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సంపదన కూడా రెట్టింపు అవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే ఆస్తి సంబంధింత విషయాల్లో అనేక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఇంట్లో కూడా ఆనంద వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆర్థిక వనరులు కూడా పెరుగుతాయి. 

సింహ రాశి:

సింహ రాశివారికి శుక్రుడి సంచారం కారణంగా జీవితంలో సంతోషం రెట్టింపు అవుతుంది. అలాగే ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఆరోగ్య సంబంధించిత సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసేవారికి పురోగతి కూడా లభిస్తుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:

మకర రాశివారికి ఈ శుక్రుడి సంచారం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి ఉద్యోగాల్లో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. దీంతో పాటు వీరికి జీతాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరు ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనేక లాభాలు పొందుతారు. అలాగే వీరికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు సంబంధింత సమస్యల నుంచి కూడా సులభంగా విముక్తి లభిస్తుంది. దీంతో పాటు ఆర్థికంగా వీరికి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం లభిస్తుంది. 

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడి పేర్కోన్నాము. దీనికి జీ తెలుగు న్యూస్‌కి ఎలాంటి సంబంధం లేదు)

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

2024-04-24T04:55:50Z dg43tfdfdgfd