సమ్మర్‌లో రోజూ ఎన్ని లీటర్ల నీళ్లు తాగాలో తెలుసా? ఇది తెలుసుకోకుంటే డేంజరే

అసలే ఎండాకాలం అంటూ తన ప్రతాపాన్ని చూపుతున్నాడు ఈ నేపథ్యంలో సామాన్య ప్రజానీకం నుండి ప్రతి ఒక్కరు ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రధానంగా రోజువారి కూలీ పనులకు వెళ్ళేటటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ తమ కుటుంబ పోషణ సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే తోపుడు పనుల వ్యాపారులు మార్కెట్లలో వ్యాపారాలు నిర్వహించే వ్యాపారుల సైతం భానుడి భగభగళదాటికి ఎన్నో అష్ట కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఉదయం 11 గంటల సమయం దాటిన తర్వాత కాలు బయటకు పెట్టలేని పరిస్థితి సైతం నెలకొని ఉంది. ప్రధానంగా నల్గొండ జిల్లా పరిధిలో భానుడి ప్రతాపం అధికంగా ఉందని చెప్పవచ్చు.

నిన్నటి వరకు 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ప్రజలు వేడిగాలలో నుండి ఉపశమనం పొందేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఈ వేడిగాలుల ధాటికి ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్యులు సైతం హెచ్చరిస్తున్నారు. ఇలా వేడిగాలుల సమయంలో వడదెబ్బ సోకకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో నల్గొండ జిల్లా నకిరేకల్ ఏరియా వైద్యశాల చెందిన డాక్టర్ చిన్ననాయుడు లోకల్ 18 తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Tirumala Rs 300 Darshanam Tickets: తిరుమలలో రూ.300 దర్శనం టికెట్స్ కావాలా? సులువుగా పొందండి ఇలా

డాక్టర్ చిన్ననాయుడు మాట్లాడుతూ వేసవికాలంలో ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. రోజుకు కనీసం తగిన మోతాదులో నాలుగు లీటర్ల మేర ప్రతి ఒక్కరు మంచినీరు త్రాగాలని సూచించారు. ఎక్కువగా వృద్ధులు, చిన్నారులు ఈ వేడిగాలుల ధాటికి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంటుందని బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా గొడుగు ఉపయోగించాలని సూచించారు. అలాగే కాలానికి అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు పాటించాలని ఎక్కువగా పోషక విలువలు ఉండే ఆహారాన్ని తీసుకునేలా చూడాలని చిన్నారుల తల్లిదండ్రులకు ఆయన సమ్మర్ ఎఫెక్ట్ పై జాగ్రత్తలు తెలిపారు.

Trains Cancelled: సెలవుల్లో ఊరెళ్తున్నారా? విజయవాడ మీదుగా వెళ్లే ఈ రైళ్లు రద్దు

అంతేకాదు ఎండకు తిరిగే ప్రజలపై వడదెబ్బ ప్రభావం అధికంగా ఉంటుందని ఒక్కొక్కసారి వడదెబ్బతో ప్రాణాలు కూడా ప్రమాదం ఏర్పడుతుందన్నారు. ఎవరైనా వడదెబ్బకు గురైన వ్యక్తికి వెంటనే ప్రభుత్వ విదేశాలలో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని అయితే ప్రథమ చికిత్స అందించడం సైతం అవసరమన్నారు. వడదెబ్బకు గురైన వ్యక్తిని చల్లని నీడ కిందకు తీసుకువెళ్ళి,మొదటగా గాలి అందేలా చూడాలన్నారు. వెంటనే త్రాగునీటిని ఇవ్వరాదని కొద్దిసేపు విశ్రాంతి అనంతరం త్రాగునీటిని అందించిన ఎడల సాధారణ స్థితికి సదరు వ్యక్తి చేరుకోవడం జరుగుతుందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, రైతులు ఎండాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎక్కువగా ద్రవపదార్థాలను తీసుకోవాలని ఆరోగ్యవంతులుగా ఉంటారన్నారు.

2024-04-24T07:12:55Z dg43tfdfdgfd