MORINGA LADDU: మునగాకుల లడ్డూ... ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒకటి తినండి చాలు

Moringa Laddu: మునగాకులు ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వాటిని తినేవారి సంఖ్యా తక్కువే. మునగాకులతో అనేక రకాల వంటకాలు చేసుకోవచ్చు. మునగాకు పొడితో చేసిన లడ్డూను రోజుకొకటి తినండి చాలు. అన్ని రకాల సమస్యలు దూరం అవుతాయి. ఈ మునగాకుల లడ్డూని చేయడం చాలా సులువు. ఇది ఎలా చేయాలో ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము.

మునగాకుల లడ్డూ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

మునగాకుల పొడి - రెండు కప్పులు

కొబ్బరి తురుము - ఒక కప్పు

నట్స్ - ఒక కప్పు

ఖర్జూరం - 7

తేనె - నాలుగు స్పూన్లు

సన్ ఫ్లవర్ సీడ్స్ - అరకప్పు

యాలకుల పొడి - అర స్పూను

నెయ్యి - సరిపడినంత

మునగాకుల లడ్డూ రెసిపీ

1. స్టవ్ మీద కళాయి పెట్టి వేడి చేయండి.

2. అందులో తురిమిన కొబ్బరిని వేసి కాస్త బంగారు రంగులోకి మారేవరకు వేయించండి. దాన్ని తీసి పక్కన పెట్టండి.

3. ఇప్పుడు పొద్దుతిరుగుడు గింజలను వేసి వేయించి పక్కన పెట్టండి.

4. అలాగే బాదం, జీడిపప్పు, వాల్నట్స్, ఎండుద్రాక్ష, పిస్తా వేసి వేయించి పక్కన పెట్టుకోండి.

5. వీటన్నింటినీ బ్లెండర్లో వేసి మెత్తగా పొడి చేసుకోండి.

6. అలాగే బ్లెండర్లో ఖర్జూరాలను కూడా వేసి పొడి చేయండి.

7. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో మునగాకుల పొడిని వేయండి.

8. అలాగే వేయించిన కొబ్బరి తురుము, నట్స్, ఖర్జూరం కలిపిన పేస్టు, తేనె, వేయించుకున్న పొద్దుతిరుగుడు గింజలు, యాలకుల పొడి వేసి బాగా కలపండి.

9. కాస్త నెయ్యిని వేసి చేతులకు కూడా నెయ్యి రాసుకోండి.

10. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొని పక్కన పెట్టుకోండి.

11. గాలిచొరబడని డబ్బాలో మునగాకుల లడ్డూలను వేసి ఫ్రిజ్లో ఉంచుకుంటే ఎన్ని రోజులైనా ఉంటాయి.

12. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

మునగాకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగాకులను తరచూ తినడం వల్ల గుండె జబ్బులు, క్యాన్సర్, మధుమేహం వంటివి రాకుండా ఉంటాయి. అలాగే ఎన్నో దీర్ఘకాలిక వ్యాధుల వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. మునగాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. మునగాకుల్లో విటమిన్ సి, పొటాషియం, క్యాల్షియం, విటమిన్ ఏ వంటి పోషకాలు ఉంటాయి. ఈ మునగాకుల లడ్డూను రోజుకు ఒకటి తినండి చాలు. ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి. భవిష్యత్తులో పోషకాహార లోపం అనేది తలెత్తదు.

2024-04-17T10:12:03Z dg43tfdfdgfd