NAIL GROWTH TIPS IN TELUGU: అమ్మాయిలూ.. మీ గోళ్లు అందంగా పెరగాలంటే ఇవి చేయాలి!

 Nails Growth Tips: మీరు పొడవైన, బలమైన గోర్లు ఇష్టపడుతున్నారా? అయితే ఇంకేమి ఆలోచించకండి! అవి వేగంగా పెరగడం కొంచెం కష్టమే! కానీ అది అసాధ్యం కాదు. కొన్ని చిట్కాలను అనుసరించి అందమైన గోర్లు పెంచుకోవచ్చు. ఈ చిట్కాలతో అందమైనవే కాకుండా మీ గోర్లు బలంగా ఉంటాయి. అయితే అందుకోసం మీరు పాటించాల్సిన కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. 

1. నిమ్మరసం

నిమ్మరసంలోని విటమిన్ - సి గోళ్ల పెరుగుదలకు సహాయకారిగా దోహదపడుతుంది. ఈ చిట్కాలో భాగంగా మీకు కావలసిందల్లా నిమ్మకాయ ముక్క. మీరు దానిని మీ వేలు గోర్లు లేదా కాలి గోళ్ళపై కనీసం రోజుకు ఒకసారి రుద్దాలి. ఐదు నిమిషాల పాటు మర్దన చేసి, ఆపై గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది మీ గోర్లు పెరగడానికి సహాయపడుతుంది. దీంతో పాటు వాటిని శుభ్రంగా, బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది.

2. కొబ్బరి నూనె

గోరువెచ్చని కొబ్బరి నూనెతో మీ గోళ్లను మసాజ్ చేయడం వల్ల గోళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కొబ్బరి నూనెలో విటమిన్ - ఇతో నిండి ఉంటుంది. దీంతో పాటు కొబ్బరినూనె యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ప్రతి రాత్రి నిద్రించే ముందు కొబ్బరి నూనెతో మీ వేలు గోళ్లను మసాజ్ చేయండి. కొన్నిరోజులకు మీరు తేడాను చూస్తారు.

3. నారింజ రసం

నారింజ పండు కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కొల్లాజెన్ ఒక ముఖ్యమైన ఏజెంట్, ఇది గోళ్ల పెరుగుదలలో సహాయపడడంతో పాటు గోళ్లకు జీవశక్తిని పెంచుతుంది. ఆరెంజ్‌లోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఏవైనా ఇన్ఫెక్షన్‌లను కూడా దూరంగా ఉంచుతాయి. ఒక గిన్నెలో కొద్దిగా నారింజ రసం తీసుకుని, మీ గోళ్లను సుమారు 10 నిమిషాల పాటు నానబెట్టండి. వెచ్చని నీటితో శుభ్రం చేయండి. ఆశించిన ఫలితం కోసం కనీసం రోజుకు ఒకసారి దీన్ని చేయడానికి ప్రయత్నించండి మార్పు వస్తుంది.

4. ఆలివ్ ఆయిల్

మీరు దెబ్బతిన్న లేదా పెళుసుగా ఉండే గోర్లు కలిగి ఉంటే, ఆలివ్ ఆయిల్ మీ ఉత్తమ ఎంపిక. ఆలివ్ ఆయిల్ మీ గోళ్ల లోపలి పొరకి చేరుకొని మీకు ఉపశమనాన్ని అందిస్తాయి. పొడిని దూరం చేస్తుంది. దీంతో పాటు రక్తప్రసరణను మెరుగుచేస్తుంది. ఇంట్లో ఉండే వర్జిన్ ఆలివ్ ఆయిల్ ని వేడిచేసి, మీ గోళ్లను ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత రాత్రంతా గ్లౌజులతో చేతులను కప్పేయండి. అలా కొన్నిరోజులకు మార్పును గమనిస్తారు. 

5. జెల్, యాక్రిలిక్ గోళ్లను తగ్గించండి

నెయిల్ ఆర్ట్, జెల్, యాక్రిలిక్ నెయిల్స్ ఆకర్షణీయంగా కనిపిస్తాయి. అయితే ఈ యాక్రిలిక్ జెల్ గోర్లు మీ గోళ్లను బలోపేతం చేయడం లేదా పెరగడాన్ని నిరోధిస్తాయి. మీ గోళ్లను జెల్ లేదా యాక్రిలిక్‌లను ఎక్కువ వినియోగించక పోవడమే మంచిది. కానీ క్రమం తప్పకుండా నెయిల్ ఆర్ట్, అక్రిలిక్స్, జెల్స్ ఉపయోగించడం వల్ల మీ గోళ్లలో నాణ్యత, పెరుగుదల క్షీణిస్తుంది.

6. బయోటిన్ తినండి

బయోటిన్ అనేది గోర్లు, జుట్టు పెరుగుదలకు పవర్‌హౌస్ విటమిన్. మీరు మీ ఆహారంలో అరటిపండ్లు లేదా అవకాడోలు వంటి బయోటిన్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవాలి. దానితో పాటు మీరు బయోటిన్ సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. మీరు బయోటిన్ సప్లిమెంట్లను తీసుకోవడం ప్రారంభించే ముందు, వైద్యుడిని సంప్రదించండి.

7. ఆకుకూరలు ఎక్కువగా తినండి

ఆకు కూరలలో ముఖ్యంగా బచ్చలికూర అధిక స్థాయిలో ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ B9తో నిండి ఉంటాయి. ఇవి గోళ్ల పెరుగుదలతో పాటు వాటిని బలంగా చేస్తాయి. రోజుకు ఒకసారి ఆకుకూరలు తీసుకోవడం వల్ల గోర్లు బలంగా, పొడవుగా తయారవుతాయి.

8. గుడ్డు పెంకులను ఉపయోగించండి

గుడ్డు పెంకులోని అదనపు కాల్షియం మీ గోళ్లను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. గుడ్డు పెంకులను తీసుకుని, శుభ్రం చేసి, ఆపై వాటిని గ్రైండ్ చేసి దాని నుండి పేస్ట్‌లా చేయాలి. ఆ తర్వాత ఆ పేస్ట్‌ని మీ గోళ్లపై అప్లై చేసి కాసేపు అలాగే ఉండనివ్వండి. ఈ ప్యాక్ మీ గోర్లు పెరగడానికి సహాయపడుతుంది.

9. తేనె

తేనె తీసుకోవడం వల్ల బ్యాక్టీరియా, శిలీంధ్రాల పెరుగుదలతో పోరాడటానికి సహాయపడుతుంది. మీ గోళ్లు, క్యూటికల్స్ వంటివి పోషణ, మృదువుగా ఉంచడంలో సహాయపడుతుంది. కొన్ని చుక్కల నిమ్మరసంతో  2 టీస్పూన్ల తేనె కలపడం ద్వారా తేనె, నిమ్మ నెయిల్ మాస్క్‌ను రూపొందించండి. దీన్ని మీ గోళ్లకు మసాజ్ చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆ తర్వాత పూర్తిగా శుభ్రం చేయండి.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-04-25T03:44:28Z dg43tfdfdgfd