లైఫ్‌స్టైల్

Trending:


Narmada Pushkaralu 2024 నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటి.. పుష్కర స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందా?

Narmada Pushkaralu 2024 భారతదేశంలోని 12 పుణ్య నదుల్లో ఒకటైన నర్మదా నది పుష్కరాలు మే 1వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి.. ఈ సందర్భంగా నర్మదా నది పుష్కరాల ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


తత్తూరు స్వీట్స్ తిన్నారా.. స్పెషాలిటీ ఇదే, ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదలరు!

500 సంవత్సరాల చరిత్ర గల తత్తూరు రంగనాథ స్వామి తిరుణాలలో పెద్దపెద్ద స్వీట్ షాప్ లో చాలా చక్కగా ఎంతో రుచికరమైన స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు. స్వీట్ అన్ని మన కళ్ళు ఎదురుగానే తయారుచేసి అమ్మకాలు జరుపుతారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో తత్తూరు గ్రామంలో వెలసిన శ్రీ శ్రీ తత్తూరు రంగనాథ స్వామి తిరుణాల ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ తిరుణాల కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తరలివచ్చి స్వామి అమ్మవార్ల దర్శనం చేసుకుంటూ ఉన్నారు. స్వామి అమ్మవార్ల దర్శనం అనంతరం తిరునాళ్లను తిలకించేందుకు వెళ్తూ ఉంటారు. తిరుణాలలో భాగంగా పెద్దపెద్ద స్వీట్ షాపులను ఇక్కడ ఏర్పాటు చేశారు, తత్తూరు తిరునాళ్లకు ముఖ్యమైనవిగా ఈ స్వీట్ షాపులు అని చెప్పవచ్చును. తిరుణాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఇక్కడ తయారు చేసే స్వీట్లు కొనుగోలు చేయనిదే వారి గ్రామాలకు వెళ్ళరు. జాంగిర్, మైసూర్ పాక్, బాదుషా, తీయకారాలు, మిచ్చెర, తీయని బెండ్లు, ఇలా మొదలైనవి అన్ని అమ్మకాలు జరుపుతున్నారు. దాదాపుగా 80 సంవత్సరాల నుంచి మహమ్మద్ రఫీ, వారి కుటుంబ సభ్యులు తత్తూరు జాతరలో ఇలా స్వీట్ షాపుల టెంట్లు వేసి, రకరకాల స్వీట్ అమ్మకాలు జరుపుతూ ఉన్నామని తెలిపారు. ఇక్కడ ప్రతిరోజు ఉమ్మడి జిల్లాల నుంచి వేలాదిమంది భక్తాదులందరూ తత్తూరు రంగనాథ స్వామి దర్శించుకొని స్వీట్ కొనుగోలు చేయడానికి వస్తూ ఉంటారని అమ్మకాలు బాగానే జరుగుతూ ఉన్నాయని తెలిపారు. పూర్వం నుంచి ఇక్కడే మా వంశస్థులు స్వీట్ అమ్మకాలలో మా ప్రత్యేకత ఉంది.


ఈ ఇటుకలతో ఇల్లు కట్టారో.. చెక్కు చెదరదు!

సొంతింటి కలలు నెరవేర్చుకోవాలంటే చక్కటి ఏదైనా క్వాలిటీ తో ఉన్న ఇటుకలతో ఇల్లు నిర్మించుకునే అవకాశం చాలా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం. పెద్దపెద్ద షాపింగ్ మాల్స్ పెద్దపెద్ద ఆఫ్ స్టేట్స్ వీటన్నిటిని నిర్మించాలంటే.. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు ఇటుకలతోటే ఇల్లు నిర్మాణం చేపడుతున్నారు. వాటికి తగ్గట్టుగానే ఇటుకలు తక్కువ ధరలకు వస్తే ఇంకేముంది సొంతింటి కలలు నెరవేర్చుకున్నట్టే. నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గ పరిధిలో రబ్బాని గోడం పక్కన ఉన్న ఇటుకల ఫ్యాక్టరీలో రకరకాల ఇటుకల తయారు చేస్తూ అమ్మకాలు జోరుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇక్కడ సిమెంట్ ఇటుకలు, మట్టితో చేసినటువంటి ఇటుకలు అమ్మకాలు జరుగుతున్నాయి. సొంత ఇల్లు కట్టుకోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చులతో మనం పోల్చుకున్నట్లయితే రాళ్లతో ఇల్లు నిర్మించే ప్రసక్తి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది. రాళ్లకు ఉన్నటువంటి డిమాండ్ వల్ల పేద ప్రజలు వారి సొంతింటి కలలు నెరవేర్చుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులలో ఇటుకలతో ఇల్ల నిర్మాణం అనేది చాలా సులువైన పద్ధతిగా ప్రజలు నేర్చుకున్నారు. తక్కువ ఖర్చుతోనే వారి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకునే విధంగా ప్రజలందరూ అడుగులు వేస్తూ ఉన్నారు. పెద్దపెద్ద కాంప్లెక్స్ పూర్తిగా ఇటుకల తోటే నిర్మాణం చేపడుతూ ఉన్నారు. అదేవిధంగా నందికొట్కూరు పట్టణంలో దొరికేటువంటి ఈ ఇటుకలను కొనుగోలు చేయడానికి కర్నూలు నుంచి, అదేవిధంగా నంద్యాల నుంచి అధికంగా జనాలు వస్తూ మట్టి ఇటుకల కొనుగోలు చేస్తూ ఉన్నారని ఇటుకల షాపులో పనిచేసే వ్యక్తి ,చరణ్, తెలియజేశారు. ఈ ఇటుకల ఫ్యాక్టరీలో ఇటుకలను కొనుగోలు చేసినట్లయితే నేరుగా వీరే డెలివరీ చేయడం, ఇల్లు నిర్మించాలన్నా వీరే నేరుగా, ఇల్లు నిర్మాణం చేపట్టే వ్యక్తులతో సంప్రదింపులు జరపడం ఇల్లు నిర్మాణం చేపట్టేటట్టు చర్యలు తీసుకోవడం ఇలా ప్రతి ఒక్కటి ప్రజలకు అనుకూలమైన విధంగా తగు చర్యలు తీసుకుంటామని న్యూస్ 18 ద్వారా తెలియజేశారు


ఈ రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి భవితవ్యం వారి రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల ఆడవారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్లు ఎవరెవరంటే? హిందూ సంస్కృతిలో ఎన్నో ఏండ్లు జ్యోతిష్యాన్ని ఆచరిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది అనేది వారి రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల ఆడారు తమ జీవితంలో కోటీశ్వరులు అవుతారు. వాళ్లు ఎవరెవరంటే? వృషభ రాశి...


Tomato Pachadi: టమాటో పచ్చడి రుచికరమైన భారతీయ ఆహారం!

Tomato Pachadi Recipe: టమాటో పచ్చడి అనేది భారతదేశంలో చాలా ప్రసిద్ధి చెందిన కూరగాయల వంటకం. ఇది తాజా టమాటాలు, మసాలాలు, నూనెతో తయారు చేయబడుతుంది. టమాటో పచ్చడిని సాధారణంగా అన్నం, రొట్టె లేదా దోసెతో తింటారు.


14ఏళ్లుగా చల్లని సేవ.. వీరి సేవకు చేతులు జోడించాల్సిందే !

అసలే ఎండాకాలం. ఎవరికైనా అధిక దాహం సర్వసాధారణమే. అలా ఎండలో కొద్ది క్షణాలు వెళ్ళామంటే చాలు, ఖ చ్చితంగా మన దప్పిక మనం తీర్చుకోవాల్సిందే. అలా దప్పిక తీర్చుకొని పక్షంలో మనం పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఆ సమయంలో దాహం తీర్చుకోక పోతే ప్రమాదం కొని తెచ్చుకున్నట్లే. అందుకే ఎండాకాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఎందరో మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తారు.ఇలా ఎన్నో ఏళ్లుగా ఎన్నో స్వచ్చంధ సంస్థల సభ్యులు ఎండాకాలం రాగానే చలివేంద్రాలను...


అసలే సమ్మర్.. మీ శరీరం నుండి దుర్వాసన వస్తోందా.. ఇదే బెస్ట్ ఆప్షన్ !

శరీరం నుండి వచ్చే దుర్వాసన రాకుండా ఉండాలంటే సుగంధ పరిమళాన్ని ఇచ్చే బాడీ స్ప్రేలు వాడుతుంటాం. మానవ జీవితంలో అభివృద్ధితో పాటు కొన్ని రకాల అలవాట్లు మొదలైనవి. దానిలో ముఖ్యంగా వస్త్రాలంకరణ, ఆభరణాల అలంకరణకు ప్రాముఖ్యతనిస్తారు. శరీరం నుండి పరిమళాలు వెదజల్లాలని బాడీ స్ప్రేలు, అత్తర్ వంటివి వాడుతుంటారు. ఫంక్షన్లు, పార్టీలకు వెళ్లేటప్పుడు కొంత ఎక్కువ మోతాదులోనే ఈ స్ప్రేలను దుస్తులపై జల్లుకుంటారు. ఇలా సువాసనలు స్ప్రే లను చల్లుకోవడం వల్ల మనసుకు కొంత ఉత్తేజం కలుగుతుంది. కానీ ఈ పర్ఫ్యూమ్లను ఎక్కువ మోతాదులో చల్లుకోవడం వల్ల దుస్తులపై మరకలు ఏర్పడడంతో పాటు ఘాటైన వాసనలు వెదజల్లడం, కొంతవరకు ఆరోగ్య సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. బాడీ స్ప్రే ల తయారీలో వివిధ రకాల సువాసనలు వెదజల్లే రసాయనాలు వాడడం వల్ల కొంతమందికి చర్మవ్యాధులు సంభవించే ప్రమాదం ఉంది. దాంతోపాటు నాణ్యమైన స్ప్రే లను ఉపయోగించాలంటే ఎక్కువ మొత్తంలో డబ్బులు వెచ్చించక తప్పదు . నాణ్యమైన స్ప్రే లను సామాన్య ప్రజలకు అందించాలన్న ఉద్దేశంతో ఢిల్లీలోనీ పరిమళాలు వెదజల్లే పూలను సేకరించి వాటిని ఎండ బెట్టి పోడి చేసి స్వయంగా చేతితో తయారు చేసిన అత్తరును హన్మకొండ జిల్లాలోనీ గ్రీన్ బావార్చి హోటల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో స్టాల్ ఏర్పాటు చేసి అతి తక్కువ ధరలకే అందిస్తున్నారు. కొన్ని వస్తువులను వాటి అసలు ప్యాకేజింగ్‌లో నేరుగా సూర్యకాంతి నుండి దూరంగా ఉంచడానికి అనేక చిట్కాలు ఉన్నాయి. అటువంటి వివరాలు దాని ప్యాకేజింగ్‌లోనే ఉంటాయి. ఢిల్లీ అత్తరు ఒక్కసారి చల్లుకున్నారంటే ......రోజంతా పరిమళమే., మీరు నేరుగా సూర్యకాంతి నుండి పర్ఫ్యూమ్‌ను దూరంగా ఉంచాలి. అంతే కాకుండా, వేడిగా లేని చల్లని ప్రదేశంలో ఉంచడం ముఖ్యం. ఢిల్లీలో స్వయంగా తయారుచేసిన తమ అత్తర్ లతో ఎటువంటి చర్మ సమస్యలు ఉండవుని, దీనిలో ఎటువంటి నూనె పదార్థాలు వాడకుండా స్వచ్ఛమైన పూల రసాలతో తయారు చేశామని నిర్వాహకుడు సయ్యిద్ తెలిపాడు. పర్ఫ్యూమ్ లతోపాటు రూమ్ స్ప్రేలు కూడా అందుబాటులో ఉన్నాయి వీరి వద్ద .మా వద్ద 150 రూపాయల నుండి 4 వేల రూపాయల వరకు వివిధ రకాల అత్తర్ లు అందుబాటులో ఉన్నాయి.


బంగారు నగలు పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ఆడవాళ్లే కాదు మగవారు కూడా మెడలో చెయిన్, చేతికి ఉంగరాలను, బ్రేస్ లెట్ వంటి బంగారు నగలను పెట్టుకుంటుంటారు. అయితే ఈ బంగారు నగలను పెట్టుకుంటే ఏమౌతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆడవాళ్లకు బంగారం అంటే పిచ్చి. డబ్బులుంటే చాలు బంగారు షాపుకు వెళ్లి నచ్చిన నగలను కొంటుంటారు. చేతికి గాజులు, చెయిన్, చెవులకు కమ్మలు, ముక్కు పుడక వంటివి కొంటూనే ఉంటారు. బంగారు ఆభరణాలను ధరించి ఆడవాళ్లు తెగ మురిసిపోతుంటారు. అయితే ఆడవాళ్లు ధరించే బంగారు ఆభరణాల వెనుక ఎన్నో ఆరోగ్య...


Money Astrology: మే 5 ధన జ్యోతిష్యం.. వారు వ్యాపారంలో గోప్యత పాటించాలి!

Money Astrology (ధన జ్యోతిషం): (Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) ఓ రాశివారు వ్యాపారంలో గోప్యత పాటించాలి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి. మరో రాశికి చెందిన వారు ట్యాక్స్‌ సంబంధిత పనుల్లో జాగ్రత్తగా ఉండాలి. నక్షత్రాల గమనం ఆధారంగా ధన జ్యోతిష్యాన్ని జ్యోతిష్య నిపుణులు అంచనా వేశారు. మే 5వ తేదీ ఆదివారం నాడు ఆయా రాశుల వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలుసుకోండి. మేషం (Aries):వ్యాపార పనుల్లో చిక్కులు ఎదురవుతాయి, కానీ సమస్యల నుంచి బయటపడటానికి కూడా మార్గం కనుగొంటారు. వ్యాపారానికి సంబంధించిన ప్రభుత్వ వ్యవహారాలను సకాలంలో పరిష్కరించడం అవసరం. మీ ఆర్థిక స్థితికి ఎలాంటి ముప్పు లేదు. ఉద్యోగంలో పనిభారం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి.పరిహారం: ఇంటి నుంచి బయటకు వెళ్లే ముందు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వృషభం (Taurus):వ్యాపార సంబంధిత కార్యకలాపాల్లో గోప్యత పాటించండి. ప్రతికూల పరిస్థితులను పరిష్కరించడానికి ఇది సరైన సమయం. పన్ను సంబంధిత పత్రాలను సక్రమంగా మెయింటైన్‌ చేయండి. కొన్ని పనుల విషయంలో ఆఫీసు సహోద్యోగులతో విబేధాలు ఏర్పడవచ్చు.పరిహారం: శివలింగంపై నీటిని సమర్పించండి. మిథునం (Gemini):మీ బిజినెస్‌ పార్టీలతో సన్నిహితంగా ఉండండి. మీ పనికి సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ఛేంజ్‌ చేసుకోండి. మీరు ఖచ్చితంగా కొన్ని విజయాలను పొందుతారు. ఈ సమయంలో చేసిన కృషి సమీప భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.పరిహారం:ఆంజనేయస్వామికి పచ్చిమిర్చి సమర్పించండి. కర్కాటకం (Cancer):బిజినెస్‌కి సంబంధించిన ప్రభుత్వ పనుల్లో సమస్యలు ఉంటాయి. కాబట్టి మీ ఫైల్‌లు, పేపర్‌లను సక్రమంగా ఉంచుకోండి. విదేశీ వ్యవహారాల్లో అఖండ విజయం సాధించే అవకాశం ఉంది. ఈ సమయంలో నిలిచిపోయిన పనులు ఊపందుకుంటాయి. ఇప్పుడు ఏ కొత్త ప్రణాళికను అమలు చేయవద్దు.పరిహారం:వినాయకుడికి మోదకం సమర్పించండి. సింహం (Leo):వ్యాపారంలో నిలిచిపోయిన అన్ని పనులను పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. సిబ్బందితో సమన్వయం చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు కెరీర్‌పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. అధికారులతో సంబంధాలు చెడిపోకుండా చూసుకోండి.పరిహారం: వినాయకుడికి లడ్డు సమర్పించండి. కన్య (Virgo):బిజినెస్‌లో నిర్దిష్ట జాబ్‌లో మరింత అనుభవం అవసరం. యువత పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో అధికారిక విషయాల్లో, పొగిడే వ్యక్తుల పట్ల జాగ్రత్త వహించండి.పరిహారం:తల్లి ఆవుకి పచ్చి మేత తినిపించండి. తుల (Libra):వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి. నిర్దిష్ట సంస్థ లేదా కమిటీలో చేరడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రమాదకర కార్యకలాపాలకు దూరంగా ఉండండి. శాఖాపరమైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఆఫీసులో వివాదాలు కూడా పెరగవచ్చు.పరిహారం:శ్రీకృష్ణుని పూజించండి. వృశ్చికం (Scorpio):ప్రాపర్టీ రిలేటెడ్‌ బిజినెస్‌లో పెద్ద ఒప్పందాలు ఉండవచ్చు. యువతకు కెరీర్‌కు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. పని సామర్థ్యం పెరుగుతుంది. జాబ్‌కి సంబంధించిన కాన్ఫిరెన్స్‌కి హాజరయ్యేందుకు ఆహ్వానం అందుతుంది.పరిహారం:ఆంజనేయ స్వామిని పూజించండి. ధనస్సు (Sagittarius):ఈ రోజు మీరు వ్యాపార పనుల్లో చాలా బిజీగా ఉంటారు. మీరు కొత్త పనులపై ఆసక్తిని కలిగి ఉంటారు. చాలా వరకు విజయం సాధిస్తారు. పెట్టుబడి పెట్టే ప్రణాళిక కూడా ఉంటుంది. చట్టపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ అధికారులకు కొన్ని ముఖ్యమైన బాధ్యతలు ఉండవచ్చు.పరిహారం:యోగా- ప్రాణాయామం సాధన చేయండి. మకరం (Capricorn):వ్యాపారంలో అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. కొత్త పనుల పట్ల సిబ్బందిలో ఉత్సాహం ఉంటుంది. యువతకు కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఏదైనా పోటీ పరీక్షలో విజయం సాధించి ఉద్యోగం పొందే అవకాశం ఉంది.పరిహారం: విష్ణువును పూజించండి. కుంభం (Aquarius):కొత్త వ్యాపార ప్రణాళికలను అమలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. కాంటాక్ట్‌ల ద్వారా ఏదైనా ప్రత్యేక సమాచారం అందుకుంటారు. ఈ సమయంలో కమీషన్, క్లాత్ సంబంధిత వ్యాపారంలో లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి. ఆఫీసులో పాత వివాదాలు ఏవైనా ఉంటే పరిష్కారమవుతాయి.పరిహారం: శివలింగంపై నీటిని సమర్పించండి. మీనం (Pisces):వ్యాపారంలో పెద్ద ఒప్పందానికి అవకాశం ఉంది. ఒక నిర్దిష్ట నిర్ణయం తీసుకోవడంలో మీ విశ్వాసం, నైతికత మీకు సహాయం చేస్తాయి. ప్రజలకు సేవలందిస్తున్న ప్రభుత్వ అధికారులకు అదనపు బాధ్యతలతో పని భారం కూడా పెరుగుతుంది. ఏదైనా బిజినెస్‌ ట్రిప్‌కి ప్రోగ్రామ్‌ ప్లాన్‌ చేస్తార.పరిహారం: ఇంటి పెద్దల ఆప్యాయత, ఆశీర్వాదం మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పాలలో ఖర్చూరాలను నానబెట్టి తింటే ఏమౌతుందో తెలుసా?

చాలా మందికి ఉదయాన్నే పాలను తాగే అలవాటు ఉంటుంది. అయితే ప్రతి రోజూ ఉదయం పాలలో నానబెట్టిన ఖర్చూరాలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రక్తహీనత చాలా మందికి రక్తహీనత సమస్య ఉంటుంది. ముఖ్యంగా మగవారి కంటే ఆడవారే రక్తహీనత సమస్యతో ఎక్కువగా బాధపడుతుంటారు. అయితే ఈ రక్తహీనత ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం ఖర్జూరాలను పాలలో నానబెట్టి తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడతారు. ఇది శరీరంలో రక్త ప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. ఒంట్లో...


Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Bird Flu: విజృంభిస్తున్న బర్డ్‌ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే! గత కొద్దిరోజలుగా దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. వదిలిపోయిందనుకున్న ఈ వైరస్ మహమ్మారి మళ్లీ జన సంచారంలోకి రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం హెచ్‌5ఎన్‌1 అనే వైరస్. దీనికి అత్యధికంగా వ్యాప్తి చెందే స్వభావం ఉంట...


మీరు పుట్టిన తేదీ ప్రకారం.. మే నెల మీకు ఎంత అదృష్టాన్ని తెస్తుందో తెలుసా?

న్యూమరాలజీ ప్రకారం మే నెలలో ఏ తేదీలో పుట్టిన వారికి ఎలాంటి అదృష్టం వరించనుందో తెలుసుకుందాం... Number1 (1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వ్యక్తులు) ఏ నెలలో అయినా 1, 10, 19 లే, 28వ తేదీలలో జన్మించిన వారి అదృష్ట సంఖ్య 1. మే నెలలో ఈ తేదీల్లో పుట్టిన వారు కొన్ని సార్లు విపరీతంగా ఆందోళన చెందే అవకాశం ఉంది. విపరీతంగా ఆలోచిస్తూ ఉంటారు. ఈ ఆందోళన కారణంగా ఏ పనిపై ఎక్కువ దృష్టి పెట్టలేరు. కానీ.. ఈ తేదీల్లో పుట్టిన వారు ఈ నెలలో మంచి జరగాలంటే మరీ ఎక్కువగా...


దండకారణ్యంలో శక్తివంతమైన ఆలయం.. ఒక్కసారి నిద్రిస్తే మీరు అనుకున్నది జరగాల్సిందే

అది ఒకప్పుడు దండకారణ్యం.. ప్రాచీన కాలం నాటి ఆలయం. ఆ ఆలయంలో ఉన్న స్వామి వారు ఎవరు..!? ఆ ఆలయం విశిష్టతను, స్థల పురాణాన్ని లోకల్18 స్పెషల్ స్టోరీలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి బావుసాయిపేట గ్రామాలకు మధ్యలో రాముల గుట్ట అనే ప్రాంతంలో మామిడిపల్లి గ్రామానికి చెందిన శ్రీ సీతారామస్వామివారి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం మాఘమాస జాతర,రథోత్సవాలు కన్నుల పండువగా,ఘనంగా జరుగుతాయనే విషయం మనందరికీ తెలిసిందే.ఈ స్థల...


Cooking Oil: ఏ వంట నూనె మంచిది? సైన్స్ ఏం చెబుతుందో తెలుసా?

నూనె ,నెయ్యి భారతీయ ఆహారం యొక్క జీవ రక్తం. వంటింట్లో పోపు వేయడం దగ్గర నుంచి చిప్స్ ఫ్రై చేయాలంటే కూడా నూనె ఉండాల్సిందే. అయితే ఏ ఎడిబుల్ ఆయిల్ బెస్ట్ అని మీకు తెలుసా? సైన్స్ ప్రకారం, అసంతృప్త కొవ్వులు అధికంగా ఉండే నూనెలు ఆరోగ్యకరమైన ఎంపికగా పరిగణించబడతాయి. ఇవి గుండె, చర్మం, మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ సంతృప్త కొవ్వు ఉన్న నూనెలు ఆరోగ్యానికి చాలా హానికరం. సైన్స్ ప్రకారం, తినదగిన నూనెలలో ఆలివ్ నూనె ఉత్తమ ఎంపిక. ఆలివ్ ఆయిల్ లేదా ఆలివ్ ఆయిల్‌లో మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, రక్తపోటు టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా మెదడుకు కూడా మేలు చేస్తుంది. అవోకాడో నూనె కూడా ఆరోగ్యకరమైన ఎంపిక. ఇందులో ఒలేయిక్ యాసిడ్ మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులు ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్, బ్లడ్ షుగర్ , బ్లడ్ ప్రెజర్‌ని తగ్గించడంలో సహాయపడతాయి. అదనంగా, అవకాడో నూనెలో లుటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది కంటి ఆరోగ్యానికి చర్మానికి గొప్పది. అవిసె గింజలు లేదా అవిసె గింజల నూనె కూడా వంట చేయడానికి ఆరోగ్యకరమైన ఎంపిక. ఇది ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA) ను కలిగి ఉంటుంది, ఇది గుండెకు చాలా మంచిదిగా పరిగణించబడుతుంది. వాపు, కీళ్లనొప్పులు , ఆరోగ్యకరమైన మనస్సుకు ఇది చాలా ముఖ్యం. అంతే కాకుండా నూనె కూడా ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నూనెలో యాంటీఆక్సిడెంట్ , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆవాల నూనె కూడా వంటకు మంచి ఎంపిక. ఇందులో ఒమేగా-3 , ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే, ఆవాల నూనెలో ఎరుసిక్ యాసిడ్ కూడా ఉంటుంది, ఇది తీసుకోవడం మరింత ప్రమాదకరం. ఇది కాకుండా, సన్‌ఫ్లవర్ ఆయిల్ , కుసుమ నూనె కూడా అసంతృప్త కొవ్వుల వర్గంలోకి వస్తాయి. భారతదేశంలో చాలా మంది ప్రజలు పామాయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, కొబ్బరి నూనె , దేశీయ నెయ్యిని వంట కోసం ఉపయోగిస్తారు. ఇవి సంతృప్త కొవ్వు వర్గంలోకి వస్తాయి . ఆరోగ్యానికి హానికరం. వీటిని ఎక్కువ సేపు తినడం వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఒకే నూనెను ఎక్కువ కాలం వాడే బదులు నూనెను మార్చుకోవడం మంచిదని, ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.


Shukraditya Rajyog: వృషభరాశిలోకి సూర్య, శుక్ర గ్రహాలు... ఈ రాశులకు వృత్తి ఉద్యోగాల్లో లాభా

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 14న సూర్యభగవానుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత మే 19న శుక్రుడు వృషభ రాశిలో సంచరిస్తాడు. వృషభ రాశిలో శుక్రాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారి అదృష్టాన్ని ప్రకాశవంతం చేస్తుంది. అలాగే ఈ రాశుల వారి సంపద కూడా పెరుగుతుంది. అయితే ఈ రాశులు ఏమిటో తెలుసుకుందాం. వృషభం: ఈ కలయిక మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంయోగం మీ రాశి యొక్క ఆరోహణ ఇంటిపై ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు గౌరవం ,ప్రతిష్ట పొందుతారు. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. దీంతో పాటు కెరీర్ విషయంలో ఇప్పటివరకు ఎదురవుతున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అలాగే వివాహితుల వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. కర్కాటకం: ఈ రాజయోగం మీ రాశి నుండి ఆదాయం లాభాన్ని కలిగించే ప్రదేశంగా ఉండబోతున్నందున శుక్రుడు రాజయోగం యొక్క కూర్పు కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి, ఈ సమయంలో మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు కూడా ఉండవచ్చు. మీరు కెరీర్‌కు సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది .మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. అలాగే, ఈ సమయంలో మీ పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. మీరు పిల్లలకు సంబంధించిన కొన్ని శుభవార్తలను కూడా పొందవచ్చు. మేషం: శుక్రాదిత్య రాజయోగం ఏర్పడటం మీకు శుభప్రదంగా ఉండవచ్చు. ఎందుకంటే ఈ రాజయోగం మీ రాశి నుండి సంపద మరియు వాక్కు ఇంటిపై జరగబోతోంది. కాబట్టి, ఈ సమయంలో మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అలాగే, ఈ కాలంలో, మీరు మీ వ్యాపారంలో కొత్త ఆర్డర్‌లను పొందవచ్చు . మీరు మంచి మొత్తాన్ని సంపాదించే అవకాశాన్ని పొందుతారు. అక్కడ మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అలాగే ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. మీ ప్రసంగం యొక్క ప్రభావం పెరుగుతుంది, దీని కారణంగా ప్రజలు ప్రభావితమవుతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. (గమనిక: ఈ సమాచారం జ్యోతిషశాస్త్ర గణనలపై ఆధారపడి ఉంటుంది, న్యూస్18 ఇక్కడ ఇవ్వబడిన ఉజ్జాయింపు వాస్తవాలను నిర్ధారించలేదు. పాటించే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Pulagam Recipe: రుచికరమైన, ఆరోగ్యకరమైన పులగం తయారీ విధానం

Pulagam Recipe: పులగం అనేది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధమైన వంటకం. ఇది బియ్యం, పెసరపప్పు తో తయారు చేయబడుతుంది. పులగం చాలా సులభమైన వంటకం దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టదు.


4 cooling Herbs in Summer: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..

4 cooling Herbs in Summer: మండే ఎండలు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అంతా స్కిన్‌ అలర్జీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ వల్ల శరీరం ట్యాన్ అయిపోతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లదనాన్ని అందించే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి.


Strawberry Health Benefits: రుచికరమైన స్ట్రాబెర్రీ రసం తయారీ విధానం!

స్ట్రాబెర్రీ రసం ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఇష్టమైన పానీయం. ఇది తాజా, రుచికరమైన పోషకమైనది, ఇది వేసవిలో చల్లబరచడానికి లేదా ఏడాది పొడవునా ఆరోగ్యకరమైన ఎంపికగా ఆస్వాదించవచ్చు.


Rahu Dosh రాహువు మహాదశతో మనశ్శాంతి అనేదే ఉండదట..! ఈ సమస్యకు పరిష్కారమేంటో తెలుసా...

Rahu Dosh హిందూ మత విశ్వాసాల ప్రకారం, రాహు మహాదశ ఉన్న వారికి మనశ్శాంతి అనేది అసలు ఉండదట. అంతేకాదు ఆర్థిక, ఆరోగ్య సమస్యలు వెంటాడుతాయట. అయితే రాహు దోష నివారణకు ఏ పూజలు చేయాలి.. ఎలాంటి పరిహారాలు పాటించాలనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


Curd VS Butter milk: పెరుగు లేదా మజ్జిగ, ఈ రెండింటిలో వేసవిలో ఏది అధికంగా తీసుకుంటే చలువ?

Curd VS Butter milk: పెరుగు, మజ్జిగ.. రెండూ పాల ఆధారిత ఉత్పత్తులే. ఈ రెండింటిలో వేసవిలో ఏది ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందో వివరిస్తున్నారు పోషక ఆహారం నిపుణులు.


ఇక్కడ విదేశీ అతిధులు మిమ్మల్ని పలకరిస్తారు.. మీ స్నేహం కోరుకుంటారు.. వారెవరంటే !

పక్షుల కిలకిల రాగాలు వింటే ఎవరి మనసుకైనా ఆహ్లాదం కలుగుతుంది. కోయిల కుహు కుహూ రాగాలు వింటుంటే మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. కాలక్రమేణా పక్షి జాతి అంతరించి పోయే పరిస్థితులు మన కళ్ల ముందే మనకు కనిపిస్తున్నాయి. ఆధునికత పెరుగుతున్న కొద్దీ పక్షి జాతుల రకాల గురించి నేటి యువత కు అంతగా అవగాహన ఉండడం లేదనే చెప్పవచ్చు. అయితే కొందరు పక్షి జాతి ప్రేమికులు మాత్రం నేటికీ పక్షుల పెంపకం చేస్తూ.. పక్షి జాతి మనుగడ అంతరించి పోకుండా కృషి చేస్తున్నారు. ఇలా...


Water Melon Seeds: పుచ్చకాయ గింజల్లో దాగిన అద్భుతాలు ఇవే!

Water Melon Seeds Benefits: పుచ్చకాయ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. అయితే పుచ్చకాయ ా మాత్రమే కాకుండా దీని గింజలు కూడా శరీరానికి ఎంతో సహాయపడుతాయి.


‘నా గదిలో భూతాలు ఉన్నాయి’ అంటూ చిన్నారి కేకలు, ఏంటా అని చూస్తే..

మూడేళ్ల బాలిక సేలర్ క్లాస్ తన బెడ్‌రూమ్‌లో మాన్‌స్టర్స్ ఉన్నాయంటూ తరుచూ తన తల్లిదండ్రులకు చెబుతోంది. పాప ఎక్కువగా ఊహించుకుంటూ ఇలా భయపడుతోందని తొలుత వారు పెద్దగా పట్టించుకోలేదు.


Water Tank Cool Tips : వేసవిలో వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా చేసేందుకు చిట్కాలు

Water Tank Cool In Summer : వేసవిలో నీరు వేడిగా అవ్వడం సహజం. కానీ మన రోజూవారి అవసరాలకు ఉపయోగించే నీరు వేడిగా ఉంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకోసమే ఇంటిపైన ఉన్న వాటర్ ట్యాంక్‌లోని నీరు చల్లగా ఉంచేందుకు ట్రై చేయాలి.


కొడుకులు సరిగ్గా చూసుకోవట్లేదని ఆస్తిని అంజన్న పేరు మీద రాసిన తండ్రి.. చివర్లో ట్విస్ట్

కడుపున పుట్టిన పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడుతుంటారు. ఓ పూట తిని.. మరో పూట పస్తులుంటూ ఎంతో కొంత ఆస్తిని పోగేస్తుంటారు. అయితే.. తమ కోసం ఎంతో కష్టపడిన తల్లిదండ్రులను చివరి దశలో పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. పట్టెడన్నం పెట్టరు కానీ.. వాళ్లు సంపాధించిన ఆస్తి కోసం మాత్రం వెంపర్లాడుతుంటారు. అలాంటి సంఘటనే సిద్ధిపేటలో జరగ్గా.. ఆ తండ్రి దిమ్మతిరిగే నిర్ణయం తీసుకున్నారు.


మే 7న శనీశ్వర జయంతి.. శని దేవుని అనుగ్రహం కోసం ఈ పనులు తప్పక చేయాల్సిందే!

శని భగవానుడి జన్మదినాన్ని సూచించే పవిత్రమైన రోజును శని జయంతిగా పేర్కొంటారు. ఆయన ఆశీర్వాదం, రక్షణను కోరుకునే భక్తులకు ముఖ్యమైన దినం. ఇది సాధారణంగా మే లేదా జూన్‌లో వచ్చే హిందూ నెల జ్యేష్ఠలో అమావాస్య (అమావాస్య రోజు) నాడు వస్తుంది. ఈ సంవత్సరం శని జయంతి 2024 మే 7న, మంగళవారం రాబోతోంది.ఒకరు చేసిన కర్మల ఆధారంగా శని దేవుడు న్యాయాన్ని అందిస్తాడని నమ్ముతారు. అడ్డంకులు, కష్టాలు, దురదృష్టాల నుంచి రక్షణ కోసం శని భగవంతుని అనుగ్రహం కోసం భక్తులు పూజిస్తారు....


ఇంట్లోని అద్దాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

మన ఇంట్లో ఎన్నో చోట్ల అద్దాలు ఉంటాయి. ఇన్ని అన్నింటినీ క్లీన్ చేసినా.. రోజూ ముఖం చూసుకునే అద్దాలను మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంటారు.అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోని అద్దాలన్నింటినీ తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? ఇంట్లో అద్దాలు ఉండటం చాలా కామన్. ఇంటి గోడలపై, బాత్రూమ్ లో లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా.. ఎన్నో చోట్ల అద్దాలను పెడుతుంటాం. అయితే చాలా మంది అద్దాలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల అద్దాలకు దుమ్ము, ధూళి పట్టి...


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!!

హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయ చాలా మంచి రోజు. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా మంచి ఘడియ. అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహన మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఆనాదిగా వస్తుంది. ఆ రోజున బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండి కొనుగోలు చేస్తారు.అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు...


భర్తను గొలుసులతో కట్టేసిన భార్య.. ఆ విషయంలో గొడవలు, పారిపోతే పట్టుకొచ్చి మరీ..!

ఇన్ని రోజులు భార్యలను భర్తలు కొట్టిన వార్తలే వచ్చేవి. తాగుడు అలవాటు ఉన్నవాళ్లు పీకలదాకా తాగొచ్చి భార్యలను కొట్టటమో.. అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయయటమో ఇలాంటి సంఘటనలు చూసేవాళ్లం. కానీ.. వాటన్నింటికీ భిన్నంగా.. తన భర్తను గొలుసులతో కట్టేసి మూడు రోజులు చిత్రహింసలు పెట్టిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే.. ఇంతగా తన భర్తను బాధపెట్టిన ఘటన ఏంటీ అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


వేసవిలో చల్లగా ఉంచే మసాలా దినుసులు!

వేసవిలో తినాల్సిన బెస్ట్‌ సుగంధద్రవ్యాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. వేసవిలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.


Horoscope: మే 1 రాశిఫలాలు. వారు ఇవాళ శుభవార్తలు వింటారు

Horoscope today:రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 1, 2024 బుధవారం)... రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేష రాశి (Aries):రోజంతా చాలావరకు హ్యాపీగా గడిచిపోతుంది. ఉద్యోగ జీవితం ఆశాజనకంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన అభివృద్ధి కనిపిస్తుంది. బంధుమిత్రులతో శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి చాలావరకు పూర్తిగా బయటపడతారు. ఆదాయం మరింత మెరుగ్గా ఉండడానికి చర్యలు చేపడతారు. కొద్దిపాటి శ్రమతో ఒకటి రెండు ముఖ్యమైన వ్యవహా రాలు పూర్తిచేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభ రాశి (Taurus):నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. ఒక వ్యక్తిగత సమస్య పరిష్కారంలో కొందరు మిత్రులు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. ఆదాయ, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. దైవ కార్యాల్లో ఎక్కువగా పాల్గొంటారు. మిథున రాశి (Gemini):అన్ని రంగాల వారికి సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అంచనాలకు మించిన ఆర్థిక ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు లాభ దాయకంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. శుభవార్తలు వింటారు. కర్కాటక రాశి (Cancer):ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలు ఆశించిన స్థాయిలో ఘన విజయాలు సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఉద్యోగంలో బరువు బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. సకాలంలో లక్ష్యాలను పూర్తి చేస్తారు. కొందరు స్నేహితులకు ఆర్థిక సహాయం చేయవలసి వస్తుంది. కొద్ది ప్రయత్నంతో ముఖ్యమైన వ్యవహారాలు, పనులు పూర్తవుతాయి. వ్యాపారాల్లో అంచనాలకు తగ్గట్టు లాభాలు అందుకుంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. సింహ రాశి (Leo):ఆర్థిక, ఆరోగ్య పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. సొంత వ్యవహారాల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. వృత్తి, ఉద్యోగాల రీత్యా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామికి మంచి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదం విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుని సమస్యను పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగిపోతాయి. ఆరోగ్యం మీద ఒక కన్ను వేసి ఉండాలి. కన్య రాశి (Virgo):ఆర్థిక వ్యవహారాలు బాగా మెరుగ్గా ఉంటాయి. అవసరమైనప్పుడు మిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగపరంగా అందవలసిన బకాయీలు కూడా అందుతాయి. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. వ్యాపారాల రాబడి బాగా పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగంలో అధికారుల అండతో హోదా పెరిగే అవకాశముంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. తుల రాశి (Libra):కీలక విషయాల్లో సమయం బాగా అనుకూలంగా ఉంది. ఇష్టమైన బంధువులను శుభకార్యంలో కలుసుకుంటారు కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులతో సఖ్యత, సాన్నిహిత్యం పెరుగుతాయి. ఆరోగ్యం మీద వీలైనంత శ్రద్ధ పెట్టాలి. ఉద్యోగంలో బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. మీ ఆలోచనలు, ప్రయత్నాలను ఆచరణలో పెట్టడానికి ఇది చాలా మంచి సమయం. ఆర్థిక పరిస్థితి చాలావరకు చక్కబడుతుంది. వృశ్చిక రాశి (Scorpio):వృత్తి, ఉద్యోగాల వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వ్యయ ప్రయాసలతో కొన్ని పనులు, వ్యవహారాలన్నీ చాలావరకు పూర్తవుతాయి. ఇంటా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. సోదరులతో రాజీ మార్గంలో ఆస్తి వివాదం పరిష్కారం కావచ్చు. ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ధనస్సు రాశి (Sagittarius):ఉద్యోగంలో ప్రాముఖ్యత పెరుగుతుంది. పదోన్నతికి కూడా అవకాశముంది. లాభాలపరంగా వృత్తి, వ్యాపారాలు పురోగతి చెందుతాయి. కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు అనుకున్నవి అనుకున్నట్టు పూర్తవుతాయి. కుటుంబ జీవితం సంతృప్తికరంగా సాగిపోతుంది. బంధువులతో కొద్దిగా పారదర్శకంగా వ్యవహరించడం మంచిది. జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు ఉపకరిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మకర రాశి (Capricorn):ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. ప్రయాణాల్లో ఆర్థిక ప్రయోజనం అధికంగా ఉంటాయి. బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. పెండింగు పనులు పూర్తవుతాయి. కుటుంబ జీవితం బాగానే గడిచిపోతుంది. వ్యక్తిగత సమస్య ఒకటి సమసిపోతుంది. వృత్తి, ఉద్యోగాల వాతావరణం హ్యాపీగా సాగిపోతుంది. కుంభ రాశి (Aquarius):కష్టార్జితాన్ని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. అనవసర ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. పిల్లలు ఆశించిన స్థాయిలో విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశముంది. వృత్తి, ఉద్యోగాల్లో సంతృప్తికర, సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగులకు కొత్త ఆఫర్లు అందివస్తాయి. మాట తీరుతో ఇంటా బయటా అందరినీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం, ఆరోగ్యం చాలావరకు పరవాలేదనిపిస్తాయి. మీన రాశి (Pisces):కుటుంబ పరిస్థితులు అన్నివిధాలుగానూ అనుకూలంగా ఉంటాయి. వ్యక్తిగత సమస్యలను తేలికగా పరిష్కరించుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది కానీ, అంతకు మించి ఖర్చులు పెరిగే సూచనలున్నాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఆర్థిక లావాదేవీకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగంలో కొద్దిగా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పిల్లలను చురుకుగా మార్చే యోగాసనాలు ఇవి..!

ఆటల్లో మాత్రమే కాదు.. కొందరు పిల్లలు చదువుల్లోనూ పెద్దగా ఆసక్తి చూపించరు. చదువుల్లో వెకపడిపోతూ ఉంటారు. మీ పిల్లల్లోనూ ఆ సమస్య ఉంటే.. వారు చదువుల్లో, ఆటల్లో వెకనపడుతున్నారని మీకు అనిపిస్తే.. వారిని వెంటనే యోగాలో చేర్పించాలి. తమ పిల్లలు అన్నింట్లోనూ ముందుండాలని, వారి తెలివి తేటలు పెరగాలని , చాలా చురుకుగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. అందరు పిల్లలు అలా అన్నింట్లోనూ ముందు ఉండాలని రూల్ లేదు. దీంతో.. పేరెంట్స్ తమ పిల్లలు...


ఫోన్, బట్టలు లేదా ఇంకేదైన కొందామనుకుంటున్నారా..? ఈ ఛాన్స్ అస్సలు మిస్సవకండి..

అద్భుతమైన ఆఫర్‌లతో అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మే 2 నుంచి భారతదేశంలో ప్రారంభం కానుంది. మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, బ్యూటీ ప్రొడక్ట్‌లు, ట్యాబ్లెట్‌లు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ టీవీలు, ఏసీ, వాషింగ్ మెషీన్ వంటి మీ ఇంటికి కావాల్సినవన్నీ డిస్కౌంట్ ధరకే ఆర్డర్ చేసుకోవచ్చని అమెజాన్ ప్రకటనలో తెలిపింది. మే 2 మధ్యాహ్నం నుంచి ఈ సేల్ ఆన్ లైన్ ద్వారా మొదలవుతుంది. అయితే Amazon Prime సబ్‌స్క్రిప్షన్ ఉన్న కస్టమర్‌లు మధ్యాహ్నం 2:00 గంటల నుండి మొదట ఆర్డర్...