పెళ్లికి ఫుల్లుగా తాగొచ్చిన పెళ్లికొడుకు... ఆ తర్వాత ఏం జరిగిందంటే

వివిధ కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోయే ఘటనల్ని మనం చూస్తూనే ఉంటాం. సరిగ్గా ఇలాంటి ఘటనే కేరళలోని పతనంతిట్ట జిల్లా కోజెన్చెరిలోని తాడియూర్‌లో జరిగింది. కాసేపట్లో పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లికొడుకు మద్యం మత్తులో పెళ్లి మండపానికి వచ్చాడు. పెళ్లి దుస్తుల్లోనే మద్యం సేవిస్తూ కారులో చర్చి దగ్గరకు వచ్చాడు. కారులోంచి దిగడానికి కూడా ఇబ్బంది పడ్డాడు. కారు దిగాక రచ్చరచ్చ చేశాడు. పెళ్లి చేయాల్సిన మతాధికారితో అసభ్యంగా మాట్లాడాడు. ఈ ఘటనతో పెళ్లికి వచ్చిన అతిథులంతా షాకయ్యారు.

Special Trains: సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం మీదుగా స్పెషల్ ట్రైన్స్... మొత్తం 42 ట్రిప్స్

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికీ వరుడి రచ్చ ఆగలేదు. మద్యం సేవించి ఇబ్బంది పెట్టాడనే అభియోగంపై పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల్లో అతను మద్యం సేవించినట్లు తేలింది. విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడు పెళ్లి కోసం రాష్ట్రానికి చేరుకున్నాడు. ఉదయం నుంచి అతను మద్యం సేవిస్తూనే కనిపించారని అతని బంధువులు తెలిపారు. చివరకు వధువు కుటుంబానికి రూ.6 లక్షలు ఇవ్వాలని వరుడి బృందం నిర్ణయించింది.

Tirumala Darshanam: తిరుమల శ్రీవారి దర్శనానికి లక్కీ డిప్ డేట్స్ వచ్చేశాయి... ఈ తేదీలు గుర్తుంచుకోండి

ఇలా పలు కారణాల వల్ల పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు మామూలే. కొద్ది రోజుల క్రితం తెలంగాణలో ఇలాంటి ఘటనే జరిగింది. నిజామాబాద్‌కు చెందిన మహిళకు, జగిత్యాలకు చెందిన యువకుడికి పెళ్లి ఫిక్స్ అయింది. వధువు ఇంట్లో నిశ్చితార్థానికి ఏర్పాట్లు కూడా జరిగాయి. నిశ్చితార్థంలో మటన్ వడ్డించలేదని పెద్ద రచ్చే జరిగింది. వరుడి కుటుంబం గొడవకు దిగడంతో పోలసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. చివరకు ఈ పెళ్లి రద్దైంది.

2024-04-16T12:32:29Z dg43tfdfdgfd