Trending:


Monday Motivation : బంధం బలంగా ఉండాలంటే ప్రేమే కాదు.. ఇవి కూడా ఉండాలి

Monday Motivation : ఈ కాలంలో చాలామంది ఎదుర్కొనే సమస్య.. నా భాగస్వామి నాతో సరిగా ఉండటం లేదు అని. కానీ బంధం సరిగా ఉండాలంటే ఇద్దరూ సరిగా ఉండాలి. రెండు చేతులు కలిపితేనే చప్పట్లు అనే విషయం గుర్తుంచుకోవాలి.


ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినాలని ఎందుకు అనిపిస్తుంది?

కడుపు నిండిన తర్వాత కూడా రుచి బాగుందంటూ మరింత తిన్నారా? అలా చేయడం వల్ల మీకు తృప్తిగా, సంతోషంగా అనిపించిందా? అయితే, మీరు కూడా ఒక అనారోగ్యకర అహార అలవాటులో చిక్కుకున్నారన్నమాటే.


Nimmakaya Pachadi Telugu: నిమ్మకాయ పచ్చడి రెసిపీ.. ఇలా 10 నిమిషాల్లో తయారు చేసుకోండి!

Nimmakaya Pachadi Telugu: ప్రతి సంవత్సరం నిమ్మకాయ పచ్చడిని వేసవి కాలంలో తయారు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ చిట్కాలు వినియోగించి తయారు చేసుకుంటే సులభంగా మార్కెట్‌లో లభించి పచ్చడ్ల రుచిని పొందుతారు. దీని వల్ల కలిగే లాభాలు కూడా ఇప్పుడు తెలుసుకోండి.


ఇది తెలిస్తే ఎండాకాలంలో చల్లని పాలే తాగుతారు..

వేడి పాలను తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రతి ఒక్కరికీ తెలిసే ఉంటుంది. కానీ మండుతున్న ఎండాకాలంలో వేడిగా తినాలనిపించదు. తాగాలనిపించదు. అయితే చాలా మందికి వేడి వేడి పాలను తాగే అలవాటు ఉంటుంది. కానీ ఈ కాలంలో చల్లని పాలను తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? పిల్లలే కాదు పెద్దలు కూడా రెగ్యులర్ గా పాలను తాగుతుంటారు. పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తాయి. చాలా మంది ఉదయం తాగితే.. మరికొంతమంది రాత్రిపూట పడుకునే ముందు...


New Clay Pot : కొత్త మట్టి కుండను ఉపయోగించే ముందు తప్పక చేయాల్సిన పనులు

New Clay Pot Using Tips : వేసవిలో కచ్చితంగా మట్టికుండను కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే కొత్త మట్టి కుండను ఉపయోగించేముందు కొన్ని పద్ధతులు పాటించాలి.


Oral Health: మీ టూత్ బ్రష్‌ను బాత్రూంలో వదిలేస్తున్నారా? వెంటనే ఈ విషయాలు తెలుసుకోండి

చాలా మంది తమ టూత్ బ్రష్‌ను(Toothbrush)బాత్రూమ్‌లో ఉంచుతారు. బాత్రూమ్‌లో ఓ మూలన చిన్న బ్రష్ స్టాండ్ లో బ్రష్, టూత్ పేస్టు, టంగ్ క్లీనర్ పెట్టుకోవడం చాలామందికి అలవాటు. అయితే బాత్‌రూమ్‌లో టూత్‌బ్రష్‌ను ఉంచడం ఎంతవరకు మంచిది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇలా ఉంచడం వల్ల మీ టూత్ బ్రష్‌పై వివిధ రకాల ధూళి కణాలు స్థిరపడతాయి, ఇది ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. కంటెంట్ క్రియేటర్ శశాంక్ అల్షి.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇటీవల పోస్ట్ చేసిన రీల్‌లో తన అనుచరులకు ముఖ్యమైన హెచ్చరిక ఇచ్చారు. "మీ టూత్ బ్రష్‌ను బాత్‌రూమ్‌లో ఉంచడం వల్ల బ్యాక్టీరియా, ఫంగస్ పెరుగుతాయని మీకు తెలుసా?" అని ఇన్ స్టా క్యాప్షన్‌లో రాశాడు. (image: iStock) బాత్రూమ్ వాతావరణం, దాని తేమ, వెచ్చదనంతో మీ టూత్ బ్రష్‌ను ఉంచడానికి అనుకూలమైన ప్రదేశంగా కనిపిస్తుంది. కానీ ఇది బాక్టీరియా, ఇతర వ్యాధికారక క్రిములకు సంతానోత్పత్తి ప్రదేశం. గుర్గావ్‌లోని పరాస్ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ ఆర్‌ఆర్ దత్తా ప్రకారం.. బాత్రూమ్ వాతావరణంలో తేమ, వెచ్చదనం టూత్ బ్రష్‌పై బ్యాక్టీరియా పెరుగుదలకు అనుకూలమైన పరిస్థితులను సృష్టిస్తాయి. ఇంద్రప్రస్థ అపోలో హాస్పిటల్స్ ప్రొఫెసర్ డాక్టర్ ఆశిష్ కాకర్ మాట్లాడుతూ.. అనేక రకాల వ్యాధికారక సూక్ష్మజీవుల నుండి బ్రష్ కలుషితం అయ్యే ప్రమాదం ఉందన్నారు. టాయిలెట్ ఫ్లషింగ్ సమయంలో తేమతో కూడిన వాతావరణం, ఏరోసోలైజేషన్ బ్యాక్టీరియా పెరుగుదల, వ్యాప్తిని సులభతరం చేస్తుంది, కలుషితమైన టూత్ బ్రష్‌లను ఉపయోగిస్ నోటి, దైహిక(systemic) ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందన్నారు. అధిక తేమ స్థాయిలు బ్యాక్టీరియా, శిలీంధ్రాల విస్తరణను ప్రోత్సహిస్తాయి. టాయిలెట్ ఫ్లషింగ్ నుండి ఏరోసోలైజ్డ్ మల పదార్థం, సూక్ష్మజీవులు, వ్యాధికారకాలను కలిగి ఉండే గాలిలో ఉండే ధూళి కణాలకు గురికావడాన్ని ప్రోత్సహిస్తుంది అని డా. దత్తా చెప్పారు. టూత్ బ్రష్ ఉంచడానికి ఇతర ప్రత్యామ్నాయ ప్రదేశాలు: బాత్రూమ్ వాతావరణం వెలుపల శుభ్రంగా, పొడిగా ఉండే ప్లేస్ ని సృష్టించండి. ఒక మూసివున్న టూత్ బ్రష్ హోల్డర్‌ని తయారు చేసి అందులో ఉంచండి. పేలవమైన టూత్ బ్రష్ పరిశుభ్రత, నిల్వ పద్ధతులు నోటి ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను కలిగి ఉంటాయి. టూత్ బ్రష్‌లపై పేరుకుపోయిన బాక్టీరియా, జెర్మ్స్ చిగురువాపు, పీరియాంటైటిస్, దంత క్షయానికి దారితీస్తుంది, కాలక్రమేణా నోటి ఇన్ఫెక్షన్లు, వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కోసం, ప్రతి 3-4 నెలలకు లేదా అనారోగ్యం తర్వాత టూత్ బ్రష్లను భర్తీ చేయండి. రోజువారీ ఉపయోగం తర్వాత బ్రష్‌ను బాగా కడగాలి, శుభ్రమైన, పొడి వాతావరణంలో నిల్వ చేయండి. మీ టూత్ బ్రష్‌లను ఇతరులతో పంచుకోవడం మానుకోండి. యాంటీమైక్రోబయల్ టూత్ బ్రష్ శానిటైజర్ లేదా క్లోరెక్సిడైన్ మౌత్ వాష్‌లో నానబెట్టడాన్ని పరిగణించండి.


వేసవిలో ఈ కూరగాయలు తినొద్దు!

వేసవిలో తినకూడని కొన్ని ఆహార పదార్థాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఈ కూరగాయలను ఆహారంలో భాగం చేసుకుంటే పలు సమస్యలు వస్తాయి.


Sweat Rice Balls: అందమైన అమ్మాయిల చంకలోని చెమటతో టెస్టీ డిష్.. ఎగబడుతున్న స్థానికులు.. కారణం ఏంటంటే..?

Sweat Rice Balls: అందమైన అమ్మాయిల చంకలోని చెమటతో టెస్టీ డిష్.. ఎగబడుతున్న స్థానికులు.. కారణం ఏంటంటే..?


అమ్మమ్మ చేతి వంట.. ఈజీగా చేసుకునే రసం పొడి.. టేస్ట్ అదిరిపోతుంది..!

ఈ రసం పొడిని చాలా తక్కువ పదార్థాలతో.. అమ్మమ్మ చేతి వంట రుచి వచ్చేలా కమ్మగా చేయాలంటే... ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఈ ఎండాకాలం మనం ఎక్కువగా ఫ్రైలు, బిర్యానీలు, మసాలా వంటి కూరలు తినలేం. అసలే వేడిగా ఉంటుంది. కాబట్టి.. ఎక్కువగా రసం, పప్పు చారు వంటివి తినాలని అనిపిస్తూ ఉంటుంది. అయితే.. రసం చేయడానికి సింపుల్ గానే ఉంటుంది. కానీ... బయట మార్కెట్లో దొరికే రసం పొడి వాడటం వల్ల అంత మంచి సువాసన, రుచి రెండూ కరువౌతాయి. అలా అని ఇంట్లోనే రసం పొడి తయారు...


పన్నీర్‌ పచ్చిగా తింటే ఆరోగ్యమే!

పన్నీర్‌ను పచ్చిగా తినడంతో కలిగే లాభాల గురించి ఇక్కడ వివరించాం. పచ్చి పన్నీర్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ సమస్యలను దూరం చేస్తాయి.


Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: రాగిపిండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం ఎంతో సులభం.


ఈ బాలుడు చెప్పే వేదాలు వింటే షాక్ అవ్వాల్సిందే..

ఆరేళ్ల వయసులో వేద పాఠశాలలో చేరి వేదాలు అన్ని కంఠస్తంచేసి అవలీలగా గలగల అని వేదాలు అన్ని చెప్పేస్తున్నాడు నల్గొండ జిల్లా లోని నకిరేకల్ పట్టణానికి చెందిన వైష్ణవచార్యులు . ఈ సందర్భంగా ఆ బాలుడిని లోకల్ 18 ప్రత్యేకంగా పలకరించింది. పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.వేద పాఠశాలలో తనను ఎందుకు చేర్పించారు, వేదాలు నేర్చుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయని విషయాలనులోకల్ 18 తో పంచుకున్నారు.వివరాల్లోకెళ్తే.. ఈ సందర్భంగా వైష్ణవచార్యులు లోకల్ 18 తో మాట్లాడుతూ...


సింహాచలం చందనోత్సవానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక.. ఆ దర్శనాలు ఉండవు, ఈ విషయాలు తెలుసుకోండి

Simhachalam Chandanotsavam: సింహాచలంలో ఈ నెల 10న జరగనున్న చందనోత్సవంలో భక్తులందరికీ అప్పన్న నిజరూప దర్శనం కల్పిస్తామంటున్నారు అధికారులు. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటంతో ప్రొటోకాల్‌ దర్శనాలు ఉండవని తెలిపారు. అంతేకాదు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా రద్దు చేయగా.. వైదిక కార్యక్రమాల అనంతరం వేకువజామున నాలుగు గంటల నుంచి గంటపాటు ధర్మకర్తల కుటుంబానికి, దేవాలయ దాతలకు మాత్రమే అంతరాలయ దర్శనం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఈ నెల 10న మధ్యాహ్నం 3 నుంచి 4...


Akshaya Tritiya 2024: అక్షయ తృతీయ రోజు శుభ ముహూర్తం ఎప్పుడు? ఏ నగరంలో ఏ సమయంలో బంగారం కొనాలో తెలుసా?

Akshaya Tritiya 2024 Shubh Muhurat: మే 10న అక్షయ తృతీయ రాబోతుంది. ఇలాంటి పవిత్రమైన రోజున బంగారం కొనుగోలు చేయడం అనేది సంప్రదాయంగా వస్తోంది. బంగారం వంటిది ఈ రోజున కొంటే.. ఇంట్లో అంతులేని సంపదకు హామీ ఇస్తుందని నమ్ముతుంటారు. అక్షయ అంటేనే అంతులేనిది అని అర్థం. అయితే అక్షయ తృతీయ రోజున మంచి ముహూర్తం ఎప్పుడు ఉంటుంది.. ఏ నగరంలో ఎప్పుడు బంగారం కొనాలి అనేది తెలుసుకుందాం.


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


నిలబడి "మూత్ర విసర్జన" చేయడం ఆరోగ్యానికి మంచిదేనా.. పురుషులకు సరైన పొజిషన్ ఏదంటే..?

మన శరీరంలోని వ్యర్థ పదార్థాలు మరియు అదనపు నీరు మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. శరీర పనితీరును నిర్వహించడానికి మూత్రవిసర్జన చాలా ముఖ్యం. ఆరోగ్యానికి మూత్ర విసర్జన ఎంత అవసరమో.. మూత్ర విసర్జన సమయంలో మీ భంగిమ కూడా అంతే ముఖ్యం. సరైన భంగిమతో మూత్రవిసర్జన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అదే సమయంలో తప్పు భంగిమలో చేస్తే సమస్యలను కలిగిస్తుంది. చాలా మంది మంగవారు నిలబడి మూత్ర విసర్జన చేస్తుంటే.. కొంత మంది మాత్రం కూర్చొని మూత్రాన్ని విసర్జిస్తుంటారు. అయితే నిలబడి మూత్ర విసర్జన చేయడం పురుషుల ఆరోగ్యానికి హానికరమని.. కూర్చొని మూత్ర విసర్జన చేయడం ప్రయోజనకరమని తరచుగా చెపుతుంటారు.. ఇందులో నిజం ఎంతుందో ఇప్పుడు తెలుసుకుందాం. పశ్చిమబెంగాల్ కుందిన యూరాలజీ విభాగం సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అమరేంద్ర పాఠక్.. అభిప్రాయం ప్రకారం. పురుషులు నిలబడి లేదా కూర్చొని ఏ విధంగానైనా మూత్ర విసర్జన చేసినా అది ఆరోగ్యంపై ఎటువంటి చెడు ప్రభావాలను చూపదన్నారు. మూత్ర విసర్జన చేయడానికి సరైన పొజిషన్ అంటూ ఏదీ లేదని తెలిపారు. ప్రజలు తమ సౌకర్యం ప్రకారం మూత్ర విసర్జన చేయవచ్చన్నారు.డాక్టర్ చెప్పిన దాని ప్రకారం.. నిలుచుకుని మూత్ర విసర్జన చేయడం వల్ల పురుషుల ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింటుందని కొందరు చెపుతుంటారని.. అయితే దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవని.. ఇవన్నీ పుకార్లేనని చెపుతున్నారు. అయితే ఎవరైనా మూత్ర విసర్జనకు ఇబ్బందిగా ఉంటే వైద్యులను సంప్రదించాలని.. సమస్యను గుర్తించాలన్నారు. మూత్ర విసర్జనకు కూర్చోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు జరగదని యూరాలజిస్టులు చెబుతున్నారు. అయితే ఒక వ్యక్తి కూర్చొని మూత్ర విసర్జన చేసినప్పుడు, వారి కాళ్లు మూత్రాశయంపై కొద్దిగా ఒత్తిడిని కలిగిస్తాయి, ఇది మూత్రవిసర్జనను సులభతరం చేస్తుంది, కానీ ఇది వైద్యపరంగా కూడా నిరూపించబడలేదు. కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని చెప్పడం సరికాదు. ప్రోస్టేట్ సమస్యలతో బాధపడేవారు కూడా వారి సౌలభ్యం మేరకు మూత్ర విసర్జన చేయవచ్చుని తెలిపారు. వైద్యులు ఈ విషయంలో ప్రోస్టేట్ రోగులకు లేదా ఏ రోగికి ప్రత్యేక సలహాలు ఇస్తారని తెలిపారు. ఇది మానవ అలవాట్లపై కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుందన్నారు. ఇది పురుషులకే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. (గమనిక: ఈ నివేదిక సాధారణ సమాచారం కోసం మాత్రమే, కాబట్టి వివరాల కోసం ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోండి.)


ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం.. ఎక్కడంటే..

ఈ జ్యోతిర్లింగాలను దర్శిస్తే.. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించిన పుణ్యం..ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. ప్రతి హిందూ సోదరుడు మన భారతదేశంలో గల 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించడం మహా పుణ్యకార్యంగా భావిస్తారు. ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శిస్తే చాలు.. తెలియక చేసిన తప్పులన్నీ క్షమించబడతాయని భక్తుల విశ్వాసం. అందుకే కాబోలు ప్రతి హిందూ సోదరుడు ఈ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు అమిత ఆసక్తి చూపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఈ జ్యోతిర్లింగాలను దర్శించిన వారికి పరమశివుడు వరాలను ప్రసాదిస్తారని భక్తులు తెలుపుతారు. అందుకే చిన్న, పెద్ద వయసుతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించేందుకు వెళుతుంటారు. ఈ జ్యోతిర్లింగాల దర్శనంతో తమ ఇంట సౌభాగ్యం వర్ధిల్లుతుందని, తమ కుటుంబం పై పరమేశ్వరుని ఆశీస్సులు నిరంతరం ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. అయితే ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించాలంటే వృద్ధులు, వికలాంగులు కొంత శ్రమించాల్సి ఉంటుంది. కాగా ఇటువంటి వారి కోసం మన తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం అనంతసాగర్ గ్రామంలో కాశీ నుండి తెచ్చిన ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. 12 ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించలేని వారు ఈ ఆలయానికి వస్తే చాలు అంతటి మహా పుణ్య భాగ్యం కలుగుతుందని స్థానిక ఆలయ అధిపతిశ్రీ హరి హరా నంద స్వామి తెలిపారు. అనంతసాగర్ లో త్రిమూర్తుల హరిహర దేవాలయం వెలసి ఉంది. ఈ ఆలయంలో లోక కళ్యాణం కొరకు ద్వాదశ జ్యోతిర్లింగాలను ప్రతిష్టించారు. హరిహర దేవాలయంలో గల ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే చాలు తమ కోరికలు సిద్ధిస్తాయని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఎక్కువగా సంతానలేమి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఈ ఆలయాన్ని దర్శిస్తే చాలు సంతాన భాగ్యం కలుగుతుందని ఆలయ అధిపతితెలిపారు. ఇంకా ఆలయ అభివృద్ధి పనులు విస్తృతంగా జరుగుతున్నాయని, ఎందరో దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించినట్లు తెలిపారు. ఎవరైనా దాతలు ఆలయ నిర్మాణానికి సహకరించేందుకు తమను సంప్రదించాలన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఆలయంలో ప్రతిష్టించిన ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకుని పునీతులు కావాలని కోరారు. అయితే ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించే భాగ్యం కోసం మీరు వేచి ఉన్నారా అయితే ఈ హరిహర దేవాలయంలో గల ద్వాదశ జ్యోతిర్లింగాలను ఒకేసారి దర్శించండి మరి.


స్నేహ బంధాన్ని బలంగా మార్చే 8 సూత్రాలు!

అన్నింటికంటే స్నేహ బంధం చాలా గొప్పది. ఆ స్నేహ బంధాన్ని బలంగా మార్చుకోవడానికి సహాయపడే 8 సింపుల్‌ టిప్స్‌ గురించి ఇక్కడ వివరిస్తున్నాం.


ఈ రాశుల వారికి డేటింగ్ అంటే అస్సలు ఇష్టం ఉండదు..

కొంతమంది డేటింగ్ కోసం సమయాన్ని అస్సలు వృథా చేయడానికి ఇష్టపడరు. అలాగే డేటింగ్ లో ఓపెన్ గా కూడా మాట్లాడరు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు వ్యక్తిగత కారణాల వల్ల డేటింగ్ ను అస్సలు ఇష్టపడరు. డేటింగ్ చాలా మందికి ఉత్తేజాన్ని కలిగిస్తుంది. డేటింగ్ కొంతమందికి ఆహ్లాదకరంగా అనిపించినప్పటికీ.. వారితో ఉన్నవారికి కష్టంగా అనిపించొచ్చు. అవును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల వారు డేటింగ్ ను అస్సలు ఇష్టపడరు. ఇలాంటి వారితో డేటింగ్ కు...


మంచి పుచ్చకాయను కొనడం కూడా ఓ ఆర్ట్ గురూ.. ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగుండదు!

సమ్మర్(Summer) అనగానే భరించలేని వేడి, ఉక్కపోత మాత్రమే కాదు, తియ్యటి పండ్లను ఆస్వాదించే కాలం కూడా ఇదే! వేసవిలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు, పుచ్చకాయలు అందరికీ నోరూరిస్తుంటాయి. ఈ పండ్లు అందరికీ ఇష్టమే అయినా, మంచి పండ్లు ఎంపిక చేసుకుని కొనే సామర్థ్యం కొందరికే ఉంటుంది. మార్కెట్లో తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి, కొనడం అంత ఈజీ కాదు. చాలాసార్లు కోసిన తరువాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తియ్యటి పుచ్చకాయను గుర్తించవచ్చు. బరువు, రంగు, సైజు, కాయ మీద తట్టినప్పుడు వచ్చే శబ్ధం ద్వారా మంచిది ఎంపిక చేసుకోవచ్చు. తొక్కను పరిశీలించాలిఒక మంచి పుచ్చకాయకు గట్టిగా, మృదువైన తొక్క ఉంటుంది. దానిని నొక్కినప్పుడు, అది కొద్దిగా లోపలికి పోతుంది. తొక్క చాలా గట్టిగా ఉంటే, పుచ్చకాయ పండలేదని అర్థం చేసుకోవచ్చు. చాలా మృదువుగా, మెత్తగా ఉంటే, అది బాగా పండిపోయింది కావచ్చు. వాసన చూడాలిపుచ్చకాయ పండితే దాని నుంచి స్వీట్, పండిన వాసన వస్తుంది. వాసన ఎక్కువగా వస్తుంటే, పుచ్చకాయ అతిగా పండింది కావచ్చు. వాసన కొంచెం తక్కువగా వస్తుంటే లేదా లేకపోతే, పుచ్చకాయ పూర్తిగా పండలేదు. ఫీల్డ్ మార్క్, రంగును తనిఖీ చేయాలిపుచ్చకాయ పాకాన పడితే, దాని కింద భాగంలో పసుపు లేదా తెల్లటి మచ్చ ఉంటుంది. పుచ్చకాయ పూర్తిగా పండకపోయినా లేదా అతిగా పండినా ఈ మచ్చ ఉండదు. ఈ పుచ్చకాయ దిగువ భాగం పసుపు రంగులో ఉంటే అది భూమిపై సరిగ్గా పండినట్లు సూచిస్తుంది. పుచ్చకాయను తట్టి పరిశీలించాలిపుచ్చకాయ అతిగా పండి ఉంటే, దాన్ని తట్టినప్పుడు ఖాళీ (Hollow) లేదా ఫ్లాట్‌ సౌండ్‌ వస్తుంది. మంచి పుచ్చకాయను తట్టినప్పుడు డీప్‌ సౌండ్‌ శబ్దం వస్తుంది. వేళ్లతో తడుతూ చెవిని పుచ్చకాయకు దగ్గరగా ఉంచడం ద్వారా సౌండ్‌ని స్పష్టంగా వినవచ్చు. బరువు చెక్ చేయాలిఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయల బరువును పోల్చడం ద్వారా పుచ్చకాయ ఎంత బాగా పండిందో తెలుసుకోవచ్చు. బరువైన పుచ్చకాయ సాధారణంగా పండి, జ్యూసీగా ఉంటుంది. అలానే పెద్ద సైజు పుచ్చకాయల కంటే చిన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయని అంటారు. ప్రయోజనాలుచల్లదనాన్ని అందించే పుచ్చకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలో 92% శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి తగినంత నీటిని అందించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుచ్చకాయ విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పుచ్చకాయలోని లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Love Affair: ఎనిమిదేళ్ల డీప్ లవ్.. పెళ్లికాగానే అదృశ్యమైన ప్రియుడు.. స్టోరీ మాములుగా లేదుగా..

Tamilnadu news: మేరీ, తమిళరసన్ ల మధ్య లు ఒకర్నిమరోకరు ఇష్టపడ్డారు. ఇంట్లో వాళ్లకు తెలియకుండా తరచుగా కలుసుకునే వారు. వీరి ప్రేమ ఎనిమిదేళ్లుగా కొనసాగింది. ఈ క్రమంలో యువతీ మేరీ పెళ్లి చేసుకొమ్మని తమిళరసన్ ను గట్టిగా నిలదీసింది.


Today Horoscope: ఓ రాశివారికి ఆదాయ మార్గాలు బాగుంటాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 2-5-2024, గురువారం మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..) మేషం (అశ్విని , భరణి , కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి (దినాధిపతి రాహు) భరణి నక్షత్రం వారికి (దినపతి...


అక్షయ తృతీయ రోజు బంగారం కొనడానికి డబ్బులు లేవా? ఇవి కొన్నా లక్ష్మీకటాక్షం పొందొచ్చు

వైశాఖ శుద్ధ తదియ రోజున అక్షయ తృతీయను చాలా విశిష్టంగా జరుపుకుంటారు. ఈ రోజున సూర్యోదయమునకు ముందే లేచి శుచిగా స్నానం చేసి విష్ణుమూర్తి ని ప్రార్థిస్తే సకల సంపదలు కలుగుతాయి. పురాణాలలో నారదుడు ఒకసారి విష్ణుమూర్తిని అడిగాడట ఓ నారద అక్షయ తృతీయ విశిష్టత ఏమిటని తెలియజేయమన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడట క్షయ కానిది అనగా తరిగిపోనిది అక్షయ తృతీయ అంటారు..ఈరోజు సిరి సంపదలను కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే సంపద తరగదని అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం...


రాత్రిపూట అన్నం తింటే ఏమౌతుందో తెలుసా?

మనలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్నాన్నే తింటుంటారు. కానీ ఇన్ని పూటలా అన్నాన్నే తింటే ఏమౌతుందో తెలిస్తే ఇక నుంచి అలా తినే సాహసం చేయరు తెలుసా? బియ్యంలో కార్బోహైడ్రేట్లు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవే కాదు బియ్యంలో ప్రోటీన్, కాల్షియం, ఫ్యాట్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం లు కూడా ఉంటాయి. ఇవి మన శరీరానికి మంచి మేలు చేస్తాయి. అయితే దీనిలో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తింటే బరువు పెరిగిపోతామని చాలా మంది రాత్రి...


Gongura Pachadi: గోంగూర పచ్చడి..ఆంధ్ర వంటకాలకు రుచికరమైన విందు!

Gongura Pachadi Recipe: గోంగూర పచ్చడి ఒక ప్రసిద్ధ ఆంధ్ర వంటకం, దీని తీవ్రమైన రుచి, పులుపు వాసనకు ప్రసిద్ధి చెందింది. ఇది వేడి అన్నం, పూరీలు, ఇడ్లీలు లేదా దోసలతో పాటు ఒక రుచికరమైన వంటకం.


మరమరాలతో గారెలు ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్!

మరమరాలు తేలికైన ఆహారం. వీటితో గారెలు చేసుకుని తినొచ్చు. వీటి తయారీ విధానం చూద్దాం.


ఆధ్యాత్మికత పెంపొందించే లక్ష్యంతో.. వేసవి శిక్షణ తరగతులు ప్రారంభం.. ఎక్కడంటే..

ఎండలు మండుతున్న తరుణంలో చిన్నారులు బయటకిపోకుండా చిన్న వయసులో భక్తి మార్గం వైపు వారి మనసును మళ్లించే విధంగా దేవ, దేవతలకు సంబంధించిన నామాలు చిన్నారులు చేత జపించడం, పటిష్టం చేయడం, భక్తి మార్గం వైపు వెళ్లే విధంగా చూడటం జరుగుతున్నది. భక్తి మార్గం వైపు చిన్న వయసులో చిన్నారులను మల్లిస్తే వారు భవిష్యత్ లో ఉన్నత రంగాల్లో ముందుకు రావడం జరుగుతుంది. సమాజంలో మంచి ఏదీ... చెడు ఏది అన్న విషయాలపై క్లారిటీ ఉంటుందన్నారు.ఉమ్మడి జిల్లాలోని శ్రీ వేంకటేశ్వర వేద...


మేల్కొన్న వెంటనే ఇలా చేస్తే ముఖం మెరుస్తుంది!

ఉదయాన్నే మేల్కొన్న వెంటనే ఈ టిప్స్ ఫాలో అయితే చర్మాన్ని అందంగా, ఆకర్షణీయంగా మార్చుకోవచ్చు. ఈ టిప్స్‌ సులభమైనవి.


కాలేయాన్ని పాడుచేసే చెడు అలవాట్లు ఇవే!

కాలేయాన్ని కాపాడుకోవడం కోసం కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


Rasi Phalalu 6-5-2024: వారికి బంధువుల సపోర్ట్‌ లభిస్తుంది

Rasi Phalalu:జ్యోతిష్య పండితులు గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతుంటారు. అనేక ఇతర అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజు వారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. 2024 మే 6వ తేదీ, సోమవారం నాటి దిన ఫలాలు ఏయే రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):బ్యాలెన్స్‌డ్‌ ఎన్విరాన్‌మెంట్‌, సామరస్యపూర్వక సంబంధాలు, రొమాంటిక్‌ మూమెంట్స్‌ పెంపొందించడానికి ఇంట్లో స్ట్రక్చర్‌, డిసిప్లైన్‌ మెయింటైన్‌ చేయండి. వృత్తిపరమైన స్థిరత్వం, పనుల్లో విజయాన్ని కొనసాగిస్తూ బంధువులతో ఆనందకరమైన సమావేశాలను ఆస్వాదించండి. అంకితభావంతో, ఏకాగ్రతతో ఉండండి. వర్క్‌లో మీకు మీరు పెట్టుకున్న పరిమితుల నుంచి విముక్తి పొందండి. కొత్త వ్యాపార అవకాశాలను స్వీకరించండి, పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. విభేదాలను నివారించడానికి, శారీరక, మానసిక స్థితిస్థాపకతను పెంపొందించడానికి దౌత్యాన్ని కొనసాగించండి. కుటుంబ ఒత్తిడులను ఎదుర్కొంటే పెద్దల నుంచి గైడెన్స్‌ పొందండి. అదృష్ట సంఖ్య: 9. అదృష్ట రంగు: ఎరుపు. అదృష్ట రత్నం: రూబీ. వృషభం (Taurus):ఇంట్లో సామరస్యం, సంతృప్తిని అనుభవించండి. లోతైన భావోద్వేగ బంధాలను పెంపొందించుకోండి. బంధువుల నుంచి సపోర్ట్‌ పొందండి. క్లియ్‌ కమ్యూనికేషన్, ఇన్నోవేటివ్‌ థింకింగ్‌ ద్వారా పనిలో గుర్తింపు పొందుతారు. సమీప భవిష్యత్తులో లాభాలను ఆశించవచ్చు, ఆర్థిక భద్రత కోసం కృషి చేయండి. స్నేహితుడు మంచి పెట్టుబడుల సలహాలు చేస్తాడు. మంచి ఆరోగ్యం, శక్తిని ఆస్వాదించండి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్న దాతృత్వాన్ని గౌరవించండి. అదృష్ట సంఖ్య: 4. అదృష్ట రంగు: ఆకుపచ్చ. అదృష్ట రత్నం: తెల్ల నీలమణి. మిథునం (Gemini):రొమాంటిక్‌ అడ్వెంచర్‌లు, కొత్త కనెక్షన్‌లను అన్వేషించేటప్పుడు మీ కుటుంబంలోని ఎమోషనల్‌ ఛాలెంజెస్‌ని పరిష్కరించండి. ముఖ్యంగా బంధువులతో అపార్థాలు రాకుండా సహృద్భావాన్ని కొనసాగించండి. కెరీర్‌లో వృద్ధి కోసం ఇంటలెక్చువల్‌ క్యూరియాసిటీ, శ్రద్ధను ప్రదర్శించండి. పెట్టుబడులకు సంబంధించి నిపుణుల సలహాలు కోరండి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఆఫీసు రాజకీయాల మధ్య న్యూట్రల్‌గా ఉండండి. హీలింగ్‌, ఫర్గివ్‌నెస్‌ కోసం సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 7. అదృష్ట రంగు: పసుపు. అదృష్ట రత్నం: సిట్రిన్. కర్కాటకం (Cancer):ఈ రోజు స్థిరమైన, కమిటెడ్‌ రిలేషన్‌ పెంపొందించుకోండి. ఆత్మపరిశీలనను స్వీకరించండి, ఇంట్లో సంతృప్తిని కనుగొనండి. బంధువులతో సరిహద్దులను ఏర్పరచుకోండి. మీ కెరీర్‌లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌, క్రియేటివిటీకి ప్రాధాన్యం ఇవ్వండి. వర్క్‌ ఎన్విరాన్‌మెంట్‌లో అభివృద్ధి, సంతృప్తి కోసం అవకాశాలను వెతకండి. ఊహించని ఆర్థిక లాభాలు అందుతాయి. ఇన్వెస్ట్‌మెంట్‌లో రిస్క్‌లు, రివార్డ్‌లను బ్యాలెన్స్‌ చేయండి. ముందుకు సాగడానికి మీ శక్తిని బలోపేతం చేయండి, సంఘర్షణలను పరిష్కరించుకోండి. అదృష్ట సంఖ్య: 3. అదృష్ట రంగు: వెండి. అదృష్ట రత్నం: ఒనిక్స్. సింహం (Leo):గృహ విషయాల్లో సహనం, పట్టుదల చూపుతారు. ఈ రోజు ప్రేమ, సంతానోత్పత్తి, రిలేషన్‌లు కూడా ఎదురవుతాయి. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వాల్సిన, రక్షించాల్సిన అవసరం ఉండవచ్చు. ఈ రోజు మీ నాయకత్వాన్ని ప్రదర్శించడానికి అవకాశం ఉంటుంది. బిజినెస్‌ వెంచర్ల కోసం వ్యూహాత్మక ప్రణాళికను ఉపయోగించండి. పెట్టుబడులపై ఆర్థిక లాభాలను ఆశించండి. ఔషధాలపై తక్కువ ఆధారపడండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. కోపాన్ని విడిచిపెట్టి, శాంతింపజేయడానికి క్షమాపణ కోరండి. అదృష్ట సంఖ్య: 8. అదృష్ట రంగు: బంగారం. అదృష్ట రత్నం: పచ్చ కన్య (Virgo):ఇంట్లో ప్రాక్టికాలిటీ, స్థిరత్వంపై దృష్టి పెట్టండి. సవాలు చేసే వ్యక్తుల నుంచి ఎమోషనల్ డిటాచ్‌మెంట్ కొనసాగిస్తూ, ఉద్వేగభరితమైన రిలేషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. కెరీర్ అభివృద్ధికి, సహోద్యోగులతో సంబంధాలను పెంపొందించడానికి మిమ్మల్ని మీరు అంకితం చేసుకోండి. వ్యాపారంలో అడ్డంకులను అధిగమించి, ఆర్థిక నిర్ణయాల కోసం నిపుణుల సలహాలను పొందండి. కుటుంబ విలువలను నిలబెట్టేటప్పుడు సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌, సెల్ఫ్‌ అభ్యసించండి. అదృష్ట సంఖ్య: 5. అదృష్ట రంగు: నీలం. అదృష్ట రత్నం: మూన్‌స్టోన్‌. తుల (Libra):ఇంటి విషయాల్లో బ్యాలెన్స్‌ కోసం కృషి చేయండి. కొత్త ప్రేమ, ఎమోషనల్ ఫుల్‌ఫిల్‌మెంట్‌ స్వీకరించండి. సహోద్యోగులతో సరిహద్దులను నిర్వహించండి. కెరీర్ విజయం కోసం శక్తిని, ఉత్సాహాన్ని పెంచుకోండి. వ్యాపార భాగస్వామ్యాలకు సహకరించండి. అనుకూలమైన ఆర్థిక ఫలితాలను ఆశించండి. కుటుంబంలో ఓపెన్‌ డిస్కషన్‌లకు ప్రాధాన్యం ఇవ్వండి. జీవితంలోని అన్ని అంశాలలో రాజీ, న్యాయాన్ని వెతకండి. అదృష్ట సంఖ్య: 2. అదృష్ట రంగు: పింక్. అదృష్ట రత్నం: పగడం. వృశ్చికం (Scorpio):భావోద్వేగ గాయాలను నయం చేయడం, క్షమాపణను కనుగొనడం అవసరం. ఎమోషనల్‌గా కనెక్ట్‌ అయిన రిలేషన్‌లో విషయాలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. మీ సన్నిహిత స్నేహితులకు మద్దతు ఇవ్వండి. కెరీర్‌లో వ్యూహాత్మక ప్రణాళిక, గోప్యతను సమర్థించే సమయం. ఆఫీసులో గుర్తింపు లభిస్తుంది, అదనపు బాధ్యతలు అందుకుంటారు. కొత్త, వినూత్న వ్యాపార అవకాశాలు పొందుతారు. ఉన్నతాధికారులు తీసుకునే నిర్ణయాల వల్ల ఆర్థిక కదలికలు మీకు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించండి. సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి మీ అంతర దృష్టి, శక్తిని ఉపయోగించండి. మీరు సెల్ఫ్‌ కేర్‌, ఎమోషనల్ హీలింగ్‌కి సమయాన్ని వెచ్చించాలి. అదృష్ట సంఖ్య: 6. అదృష్ట రంగు: నలుపు. అదృష్ట రత్నం: మణి ధనస్సు (Sagittarius):గత ఆగ్రహావేశాలను వీడాలి, ఇంట్లో కొత్త ప్రారంభాలను స్వీకరించాలి. కొత్త రొమాంటిక్‌ ఆపర్చునిటీలు పొందుతారు. బంధువుల నుంచి సపోర్ట్‌, సలహాలు అందుకోండి. కెరీర్‌లో మీ క్రియేటివిటీ, ప్యాషన్‌ చూపించే అవకాశం లభిస్తుంది. వర్క్‌లో సవాళ్లు ఎదురైనప్పుడు పట్టుదలతో ఉండాలి. తప్పనిసరిగా ప్రస్తుత వ్యాపార ఆలోచనలను పునఃపరిశీలించాలి. కొత్త అవకాశాలను అన్వేషించడం కొనసాగించాలి. నెమ్మదిగా కానీ స్థిరమైన ఆర్థిక పురోగతిని ఆశించండి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోండి. కుటుంబంలో సానుకూల మార్పులు, అవకాశాలు ఉంటాయి. అదృష్ట సంఖ్య: 11. అదృష్ట రంగు: ఊదా. అదృష్ట రత్నం: ముత్యం మకరం (Capricorn):అంకితభావంతో మీ ఇంటి వాతావరణాన్ని మెరుగుపరచడంపై దృష్టి పెట్టండి. ప్రియమైనవారితో విజయాలను జరుపుకోండి. కెరీర్ సవాళ్లకు వినూత్న పరిష్కారాలను వెతకండి. బిజినెస్‌ వెంచర్లలో విజయం సాధిస్తారు. ఆర్థిక స్థిరత్వం అందుకుంటారు. పనిలో కొత్త అవకాశాలను స్వీకరించండి. స్థిరమైన అవకాశాలలో పెట్టుబడి పెట్టండి. ఓర్పు, వ్యూహంతో ఆఫీసు కార్యాలయ రాజకీయాలను మేనేజ్‌ చేయండి. మొత్తం శ్రేయస్సు, కుటుంబ ఐక్యతకు ప్రాధాన్యత ఇవ్వండి. అదృష్ట సంఖ్య: 1. అదృష్ట రంగు: బ్రౌన్. అదృష్ట రత్నం: వజ్రం. కుంభం (Aquarius):ఇంటి విషయాల్లో ఎమోషనల్ ఎక్స్‌పెక్టేషన్‌లు మేనేజ్‌ చేయండి, ముందుకు సాగండి. గత బాధలను వదిలేసి, కొత్త ప్రేమ అవకాశాలను స్వీకరించండి. బంధువులతో వ్యవహరించేటప్పుడు స్పష్టత ముఖ్యం. ఈ రోజు మీ కెరీర్‌కు ఇంటెలిజెన్స్‌, లాజిక్‌ థింకింగ్‌ తెస్తుంది. మీరు బ్యాలెన్స్‌ని కనుగొనడానికి ప్రయత్నించవచ్చు. వర్క్‌లో న్యాయమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కొంత కాలం ఆర్థిక పరిస్థితులు స్తబ్ధుగా ఉంటాయి. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మీ తల్లిదండ్రుల సలహా తీసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. అదృష్ట సంఖ్య: 13. అదృష్ట రంగు: ఆక్వా. అదృష్ట రత్నం: నీలి నీలమణి. మీనం (Pisces):సామరస్యపూర్వక సంబంధాలతో ఇంట్లో ఉత్సాహం, సాహసం అనుభవించండి. సహాయక బంధువుల నుంచి గైడెన్స్‌ పొందండి. ఆఫీసులోకి సృజనాత్మక శక్తిని, తేజస్సును తీసుకురండి. విజయం కోసం కొలాబరేషన్‌, టీమ్‌వర్క్‌కి టుకృషిని నొక్కి చెప్పండి. కొత్త ఆలోచనలతో ఆర్థిక లాభాలు అంచనా వేయండి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. ఆఫీస్ వ్యవహారాలను డిప్లమేటిక్‌గా మేనేజ్‌ చేయండి. భావోద్వేగ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి కుటుంబాన్ని రక్షించడానికి సరిహద్దులను ఏర్పాటు చేయండి. అదృష్ట సంఖ్య: 12. అదృష్ట రంగు: సీ గ్రీన్. అదృష్ట రత్నం: ఒపాల్. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఈ పీడ వదల్లేదా: కరోనాలో కొత్త వైరస్ అంట..అమెరికాలో బాగా వ్యాపిస్తుంది..!

ఈ పీడ వదల్లేదా: కరోనాలో కొత్త వైరస్ అంట..అమెరికాలో బాగా వ్యాపిస్తుంది..! కోవిడ్ -19 ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో మనందరికి తెలుసు..ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని పొట్టన బెట్టుకుంది.. ఈ మహమ్మారి గ్లోబల్ ఎకనామినీ అస్తవ్యస్తం చేసింది. కోవిడ్ దెబ్బకు ఇప్పటి కొన్ని దేశాలు ఇంకా కోలుకోలేదు..అయితే కోవిడ్ వైరస్ పూర్తిగా నిర్మూలించబడలేదు అంటున్నారు శాస్త్రవేత...


ఇంట్లోని అద్దాలను ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

మన ఇంట్లో ఎన్నో చోట్ల అద్దాలు ఉంటాయి. ఇన్ని అన్నింటినీ క్లీన్ చేసినా.. రోజూ ముఖం చూసుకునే అద్దాలను మాత్రం క్లీన్ చేయడం మర్చిపోతుంటారు.అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో ఇంట్లోని అద్దాలన్నింటినీ తలతల మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? ఇంట్లో అద్దాలు ఉండటం చాలా కామన్. ఇంటి గోడలపై, బాత్రూమ్ లో లేదా డ్రెస్సింగ్ టేబుల్ ఇలా.. ఎన్నో చోట్ల అద్దాలను పెడుతుంటాం. అయితే చాలా మంది అద్దాలను క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. దీనివల్ల అద్దాలకు దుమ్ము, ధూళి పట్టి...


అరటి గెల ధర ఇంత తక్కువగా ఉంటుందా.. వావ్.. చవక చవక..

అరటిని పేదవారి ఆపిల్ అని పిలుస్తారు. అరటి పండు సరసమైన ధరలో లభించే పోషక విలువలు కలిగిన పండు. కాబట్టి ప్రతిరోజూ అరటిపండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటిపండులో చాలా విటమిన్లు ,మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వేసవికి అరటిపండు ధరలు చాలా తక్కువగా ఉంటాయి. అరటిపండ్లతో పెద్ద సమస్య ఏమిటంటే అవి త్వరగా కుళ్ళిపోతాయి. కాబట్టి మీరు డజన్ల కొద్దీ అరటిపండ్లను ఇంట్లో కొంటే వాటిని త్వరగా తినాలి. ఎందుకంటే అవి కుళ్ళిపోతాయి. కార్తీక మాసంలో తమకు ఎక్కువగా లాభాలు వస్తాయని అరటి వ్యాపారస్తులు అంటున్నారు. సీజన్లో అయితే అరటిపండు గెల 500 వరకు కూడా ధర ఉంటుందని అంటున్నారు. వేసవి వచ్చిందంటే అరటిపండు ధర చాలా తగ్గుముఖం పడుతుందని తెలిపారు. అధిక శాతం నష్టాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోవడం జరుగుతుందని తెలిపారు. ఉమ్మడి విశాఖపట్నం నర్సీపట్నం నియోజకవర్గంలో అంతటా కూడా వేల ఎకరాల్లో ఈ అరటి తోట వేయడం జరుగుతుంది. సీజన్లో రైతులు మంచి లాభాలు తీసుకుంటారు. కానీ ఎండాకాలం కావడంతో ధరలు బాగా తక్కువ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం అరటి గెల 100 నుండి 150 రూపాయలు మాత్రమే ఉందని అంటున్నారు. ఎవరికైనా కావాలనుకుంటే నర్సీపట్నంలోని మార్కెట్ కు వస్తే తక్కువ ధరకే అరటి గెలలు అమ్మకం చేయడం జరుగుతుందని తెలిపారు. వారానికి రెండుసార్లు మార్కెట్లో అమ్మకాలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. చేతికొచ్చిన పంట రెండు రోజులు లేట్ అయితే ఎండవేడికి పాడైపోవడం జరుగుతుందని అంటున్నారు. ఆరు నెలలపాటు గాలులకు తట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడి కష్టపడి పండించిన పంట మార్కెట్ కి తీసుకువెళ్తే ఎవరూ తీసుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు వ్యాపారస్తులకు కూడా అరటి గెల తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు రావడం లేదని అంటున్నారు. వేసవి కాలంలో పెళ్లి ముహూర్తాలు కూడా తక్కువగా ఉంటాయి. ఏప్రిల్ నెలలో కొంచెం ఉన్నప్పటికీ మే జూన్ నెల అంతా కూడా ఇంకా ధరలు తగ్గిపోయే అవకాశం ఉందని అంటున్నారు.


Shani Transit 2024: మే 12వ తేదీన శని నక్షత్ర సంచారం.. ఈ రాశుల వారికి ముట్టిందల్లా బంగారమే..

Shani Transit 2024: మే 12వ తేదీన శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది. దీంతో పని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి పరిష్కారం లభించడమే, కాకుండా కుటుంబ జీవితంలో ఆనందం కూడా పెరుగుతుంది.


ఈత పండ్లలోని ఎన్నో పోషక విలువలు.. తెలిస్తే అసలు తినకుండా ఉండలేరు..

నిజానికి చెప్పాలంటే పల్లెల్లో మనుషుల మధ్య ఉండే మర్యాద, ప్రేమతో పలకరింపులు ఆహ్లాదకరమైన వాతావరణం కలుషితం లేని పకృతి నుండి వచ్చే గాలి ఎలాగైతే ఉంటాయో, పల్లెల్లో పకృతి ఒడిలో పండే పండ్లు కూడా అంతే ఆరోగ్యకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ వేసవి సీజన్ లో చూసుకున్నట్లైతే ఈత పండ్లు సహజంగా ఎటువంటి మందులు లేకుండా ప్రతి సంవత్సరం ఈత చెట్లకి ఈత పండ్ల గెలలు కాస్తుంటాయి,ఈ పండ్లను పేదోడి పండ్లగా వీటిని పిలుస్తారు. ఈ పండ్లు తింటే పల్లెల్లో వేడి అని అంటారు. కానీ ఈ పండ్లు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకోలేక పోతున్నారు. ఇక దీనికి సంబంధించి జనరల్ ఫిజిక్స్ ఫిజీషియన్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ పూర్తి వివరాలు తెలిపారు. వేసవి కాలంలో వచ్చే ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఈత పండ్లు ఎలాంటి మందులు లేకుండా సహజంగానే ప్రతి ఏటా కాస్తుంటాయి. ఇవి ఎండాకాలంలో మాత్రమే దొరుకుతాయి. అయితే ఈ పండు తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వైద్యుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈత పండ్లను ఎల్లో బెర్రీస్ అని అంటారు. వీటిని చిన్న వయసు నుండి మొదలుకొని పెద్దవారు వరకు అందరు తినవచ్చు. వేసవిలో మాత్రమే లభించే ఈత పండ్లను అందరు తినాలని వైద్యులు రాజేంద్రప్రసాద్ సూచిస్తున్నారు ఈత పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు గురించి వివరించారు.ఈత పండ్లు పిల్లలకి తినిపించడం వల్ల కాల్షియం ఎక్కువగా అందుతుంది. దాని వల్ల ఎముకలు బలపడుతయాయి, ఆలోచన శక్తి కూడా పెరుగుతుంది. అంతే కాకుండా ఈత పండ్లలో ఉండే గ్లూకోజ్,సుక్రోజ్,ఫ్రక్రోజ్లు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి.ఇక ప్రతి రోజూ ఉదయం పూట తినడం వల్ల జీర్ణ శక్తి కూడా పెరుగుతుంది అని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ రాకుండా చేస్తుంది.ఈత పండ్లలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది దీని వల్ల రక్త వృద్ధి జరుగుతుంది. అలాగే శరీరం లో రోగ నిరోధక శక్తి పెరగటానికి ఉపయోగ పడుతుంది అని వైద్యులు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే మన దగ్గర్లో ఉన్న ఊర్లలోకి వెళ్లి గౌడ్ అన్నల వద్ద కొనుక్కొని తినండి.


ఇంట్లోనే తయారుచేసిన ఈ సీరమ్‌తో ఫేస్ కొరియన్స్‌లా మెరుస్తుంది..

కొరియన్ స్కిన్ అందంగా మెరిసిపోతుంది. దీంతో వారిని చూసి వారి స్కిన్ కూడా మెరవాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.


Zodiac Signs: ప్రేమకు అత్యంత ప్రాధాన్యమిచ్చే నాలుగు రాశులు ఇవే.. లిస్టులో మీరున్నారా..?

చాలా మంది ప్రేమలో పడతారు. కానీ అందరూ ఒకేలా ఉండరు. ప్రేమలో పడిన ప్రతి వ్యక్తి తమ రిలేషన్‌షిప్‌కి యూనిక్‌ ఫ్లేవర్‌ తీసుకొస్తారు. అయితే తమ పార్ట్‌నర్‌తో వార్మ్‌, సెంటిమెంటల్‌ బాండ్‌ని ఏర్పరచుకోవడానికి ప్రసిద్ధి చెందిన కొన్ని రాశిచక్ర గుర్తులు ఉన్నాయి. వీరు రిలేషన్‌కి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పార్ట్‌నర్‌ని డేట్‌, ఫేవరెట్‌ స్వీట్ ట్రీట్‌లతో సర్‌ప్రైజ్‌ చేస్తారు. జీవితంలో తోడుగా ఉన్నందుకు భాగస్వామికి గ్రాట్టిడ్యూడ్‌ ఎక్స్‌ప్రెస్‌ చేస్తారు. వారితో గడిపే ప్రతి క్షణంలో ప్రేమను నింపుతారు. రిలేషన్‌కి ఇంతంటి ప్రాధాన్యమిచ్చే రాశులు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మిథునం (Gemini)రిలేషన్‌షిప్‌లో సున్నితత్వం, స్పష్టత వ్యక్తం చేయడంలో మిథునరాశి వారు రాణిస్తారు. వారు తమ భాగస్వామి సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారి రిలేషన్‌కి వార్మ్త్‌ యాడ్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. మిథున రాశివారు సాధారణ డిన్నర్‌ డేట్‌లకు బదులుగా షేర్డ్‌ మూమెంట్స్‌ లేదా సర్‌ప్రైస్‌ అడ్వెంచర్‌లతో నిండిన మెమరీ జార్స్‌ వంటి మనోహరమైన ఆచారాలను ప్రారంభించవచ్చు. కాలక్రమేణా వారి బంధాన్ని బలపరిచే అర్ధవంతమైన అనుభవాల ద్వారా ఆప్యాయతను తెలియజేయడం మిథున రాశి వారి లక్ష్యం. కర్కాటకం (Cancer)కర్కాటక రాశివారు నేచురల్‌గా రొమాంటిక్‌గా ఉంటారు. రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ సెక్యూరిటీ, సాన్నిహిత్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వారు ఊహించని ప్రదేశాలలో లవ్‌ నోట్స్‌ పెట్టడం, ప్లేఫుల్ కమ్యూనికేషన్‌ కోసం పార్ట్‌నర్‌తో కలిసి సీక్రెట్‌ కోడ్స్‌ కనిపెట్టడం వంటి ఆలోచనలతో తమ ప్రేమను వ్యక్తపరుస్తారు. తమ భాగస్వాములు ఎంతో ప్రేమగా, అర్థం చేసుకున్నట్లుగా భావించే హాయిగా ఉండే వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కేరింగ్‌ వ్యక్తులు ప్రయత్నిస్తారు. సింహం (Leo)సింహరాశి వారు రిలేషన్‌షిప్‌ని ప్రేమ, ఉల్లాసభరితమైన స్ఫూర్తితో నింపుతుతారు. భావోద్వేగ సాన్నిహిత్యం వృద్ధి చెందే రొమాంటిక్ వాతావరణాన్ని సృష్టిస్తారు. కళ్లకు గంతలు కట్టుకుని వంట చేయడం లేదా మీల్స్‌ ఆర్డర్‌ మార్చడం వంటి ప్రత్యేకమైన డేట్‌ ఐడియాలతో సర్‌ప్రైజ్‌ చేసి ఆనందిస్తారు. కొత్త ఎక్స్‌పీరియన్స్‌ల కోసం డ్యాన్స్ లెసన్స్‌ వంటి లెర్నింగ్‌ యాక్టివిటీలు సూచిస్తారు. షేర్డ్‌ స్కిల్స్‌ తమ రిలేషన్‌కి ఎక్సైట్‌మెంట్‌ తీసుకొస్తుందని, బంధాన్ని బలపరుస్తాయని నమ్ముతారు. తుల (Libra)తుల రాశికి ప్రేమ గ్రహం వీనస్ అధిపతిగా ఉంటుంది. తుల రాశివారు సహజంగా సామరస్యపూర్వకమైన, ప్రేమపూర్వక భాగస్వామ్యాలను సృష్టించేందుకు మొగ్గు చూపుతారు. వారు తమ భాగస్వాములను ఆప్యాయత, ప్రశంసలతో నింపడానికి వారి ఆకర్షణ, తేజస్సును ఉపయోగిస్తారు. తులారాశి వారు తమ ప్రయాణంలోని ముఖ్యమైన అంశాలను, రోజులను గుర్తుంచుకుంటారు, సెలబ్రేట్‌ చేస్తారు. ఈ సెంటిమెంట్ శాశ్వత ప్రేమను పెంపొందించుకోవాలనే, ముఖ్యమైన జ్ఞాపకాలను పార్ట్‌నర్‌తో పంచుకోవాలనే కోరికను చూపుతుంది. ఈ రాశిచక్ర గుర్తులు రిలేషన్‌షిప్‌లను గ్రోత్‌కి, డీప్‌ కనెక్షన్‌కి అవకాశాలుగా చూస్తాయి. తమ బంధాలను పెంపొందించుకోవడానికి సమయం, శక్తి, సృజనాత్మకతను పెట్టుబడి పెడతాయి. పంచుకున్న అనుభవాలు, ఆలోచనాత్మకమైన సంజ్ఞలు సంతృప్తికరమైన, శాశ్వతమైన రిలేషన్‌షిప్‌కి దోహదపడతాయని నమ్ముతాయి. (Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


కొబ్బరి బోండం కొండెక్కింది!

కొబ్బరి బోండం కొండెక్కింది! నెలరోజుల్లో అమాంతం పెరిగిన బోండాల ధరలు   రూ.40 నుంచి రూ.60కుచేరిన ఒక్కో బోండం ధర  కొబ్బరినీళ్ల లీటర్​  బాటిల్  రూ.150  సమ్మర్ సీజన్​​ను క్యాష్ చేసుకుంటున్న వ్యాపారులు హైదరాబాద్, వెలుగు:  సీజన్​తో సంబంధం లేకుండా అందరూ ఎక్కువగా తాగేది కొబ్బరి బోండం నీళ్లు. డాక్టర్లు కూడా ఎండాకాలంలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు కొబ్బరి బ...


Kitchen Tips: మసాలా దినుసులకు ఎక్స్‌పైరీ డేట్ ఉందా ? ఎన్నాళ్లు వాడొచ్చు..!

ప్రతి ఇంటి వంటగదిలో వివిధ రకాల సుగంధ ద్రవ్యాలు , మూలికలు కనిపిస్తాయి. ఈ మసాలాలు , మూలికలు ఆహార రుచిని పెంచడమే కాకుండా అనేక విధాలుగా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. లవంగాలు, పసుపు, రోజ్మేరీ, దాల్చిన చెక్క, సేజ్, నల్ల మిరియాలు, జాపత్రి, పెద్ద మరియు చిన్న ఏలకులు, ఎండు మిరపకాయలు, బే ఆకు, ఆకుకూరలు, జీలకర్ర, మెంతులు మొదలైన వాటితో పాటు, పొడి సుగంధ ద్రవ్యాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడతాయి. వాటిలో చాలా పోషకాలు ఉన్నాయి, ముఖ్యంగా యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ...


నెయిల్ ఎక్స్ టెన్షన్ వాడితే ఏమౌతుందో తెలుసా

గోర్లు అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. అందుకే చాలా మంది నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను వాడుతుంటారు. కానీ వీటిని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. గోర్లు పొడవుగా, అందంగా కనిపించాలని చాలా మంది పెట్టుడు గోర్లను వాడుతుంటారు. సాధారణంగా నెయిల్ ఎక్స్ టెన్షన్స్ పై నెయిల్ పాలిష్ తో రకరకాల డిజైన్స్ వస్తుంటారు. కొన్నేండ్ల నుంచి ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది ఆడవారు ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను...


ఆహారం తినేటప్పుడు ఈ తప్పులు చేయకండి!

ఆహారం తినేటప్పుడు, తిన్న తర్వాత చేయకూడని కొన్ని పనుల గురించి వివరించాం. ఈ టిప్స్ ఫాలో అవ్వడంతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి.


పులిపిర్లను తొలగించే సింపుల్ చిట్కాలు ఇవే!

కొంతమంది ముఖం, శరీర భాగాలపై పులిపిర్లు ఏర్పడతాయి. వీటిని తొలగించడం కొద్దిగా కష్టమైన పని. అయితే కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కొద్దిరోజుల్లో పులిపిర్లు రాలేలా చేయవచ్చు. అదెలాగో చూద్దాం.


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!

బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది.ఈ నమ్మకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు.అందుకే బంగారాన్ని లక్ష్మీదేవిరూపంగా భావించేవారు.ఈ కారణంగా అక్షయ తృతీయ, ధన్తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం.


నిండు ఆరోగ్యాన్ని అందించే మసాలాలు ఇవే!

ఆరోగ్యంగా ఉండాలంటే రోజూవారీ ఆహారంలో కొన్ని మసాలాలు చేర్చుకోవడం మంచిది. అవేంటో తెలుసుకుందాం.


Lip Care Tips: పెదాలు నల్లబడిపోతున్నాయా, ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి

Lip Care Tips: పెదాలు నల్లబడిపోతున్నాయా, ఈ 5 చిట్కాలు పాటిస్తే చాలు గులాబీ రంగులో మెరిసిపోతాయి


Hair Growth Oil: మీ జుట్టుకు ఈ నేచురల్‌ ఆయిల్‌ పెట్టండి.. నమ్మలేని పెరుగుదలను చూస్తారు..

ప్రతిరోజూ జుట్టుకు నూనె పెట్టుకోవడం ఈరోజుల్లో సాధ్యం కాలేకపోతుంది. అయితే, జుట్టు కూడా తీవ్రం ఊడిపోతుంది. మన జుట్టు కుదుళ్ల నుంచి బలంగా మారాలంటే ఈ ఆయిల్స్‌ అప్లై చేయండి. మీ జుట్టు బలంగా మీరు నమ్మలేని విధంగా పెరుగుతుంది. సహజసిద్ధమైన ఆ ఆయిల్స్‌ ఏంటో తెలుసుకుందాం.


ఈ ఆహారాలు తినేముందు నానబెడితే రెట్టింపు మేలు!

కొన్ని ఆహారాలు నానబెట్టి తినడం ద్వారా రెట్టింపు ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో తెలుసుకుందాం.


Carrot Paratha: బ్రేక్‌ఫాస్ట్ కోసం క్యారెట్ పరాటా రెసిపీ, అరగంటలో దీన్ని వండేయచ్చు

Carrot Paratha: అల్పాహారంలో బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా పోషకాలు నిండిన ఆహారాన్ని తినడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. క్యారెట్ పరాటాలు ఒకసారి ప్రయత్నించి చూడండి.


Curd Facepack: పెరుగులో ఇది కలిపి ముఖానికి రాయండి..ఇక అందం మీ సొంతం

Summer skin care : ఎండాకాలంలో ఎప్పటికప్పుడు ముఖం పొడిబారిపోతూ ఉంటుంది. కానీ ఇంట్లోనే మంచి ఫేస్ ప్యాక్ వేసుకుంటే.. బయట వేడి నుంచి మాత్రమే కాక ఎన్నో చర్మ సమస్యల నుంచి కూడా.. మనల్ని మనం కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ వేసవికాలంలో పెరుగుతో వేసుకునే ఫేస్ ప్యాక్ ల వల్ల బోలెడంత ఉపయోగం కూడా ఉంటుంది. కానీ రొటీన్ గా కాకుండా పెరుగుతో ఫేస్ ప్యాక్ ఎన్నో విధాలుగా వేసుకోవచ్చు.


Astrology: కుజ సంచారంతో ఈ రాశుల వారికీ కుబేర ధన యోగం.. పట్టిందల్లా బంగారమే..

Astrology: గ్రహాలు నిరంతరం పరిభ్రమణం చేస్తుంటాయి. ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని రాశుల వారికీ అనుకోని లాభాలు కలిగితే.. మరికొందరికీ తీవ్ర పరిణామాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. తాజాగా కుజుడు రాశిమార్పు వల్ల రాబోయే నెల రోజుల్లో ఈ రాశుల వారికీ అనుకోని ధనలాభాలు కలగనున్నాయి.