Trending:


Mothers Day: అమ్మకు ప్రత్యేకమైన బహుమతి ప్లాన్ చేస్తున్నారా? ఈ 5 గిఫ్ట్స్ చాలా బెటర్..

మాతృ దినోత్సవం సమీపిస్తున్న సందర్భంగా, అమ్మకు ప్రత్యేకంగా ఏదైనా బహుమతి ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? కానీ, ఖరీదైన బహుమతులు కొనేంత బడ్జెట్ లేక నిరాశ పడిపోతున్నారా! చింతించాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే అమ్మకు నచ్చేలా, ఆమెకు ఉపయోగకరంగా ఉండే టెక్ గ్యాడ్జెట్లను తక్కువ ధరలకే కొనుగోలు చేసి బహుమతిగా ఇవ్వవచ్చు. మరి బడ్జెట్‌కు సరిపోయే ఆ అద్భుతమైన టెక్ గ్యాడ్జెట్స్‌ ఏవో తెలుసుకుందాం.హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్హానర్ X9b 5G స్మార్ట్‌ఫోన్ ధర 8GB RAM + 256GB ROM...


పూజ తర్వాతే ఇక్కడ మద్యం సేవిస్తారు.. ఆ భక్తులు ఎవరు ? ఆ ఆచారం ఎందుకు ?

మద్యం సీసాలను పూజకు సమర్పించే ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని స్వీకరిస్తారు ఆ భక్తులు. ఇంతకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో...మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రముఖ ఆలయాలలో ఒకటి. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది గాంచిది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల...


Horoscope Today: మే 4 రాశి ఫలాలు.. ఈ రాశులకు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..!

రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 4, 2024 శనివారం) రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం: వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో చిన్నా చితకా సమ స్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల తీరుతెన్నులు మార్చే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగు లకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ పరిస్థితులు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లలు సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృషభం: ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనం చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిథునం: ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాద లకు లోటుండదు. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కర్కాటకం: నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయకారిగా ఉంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి: వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులు మంచి అవకాశం అంది వస్తుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే ఆశించిన అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ కార్యా ల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఆరోగ్యం పరవాలేదు. కన్య రాశి: సోదరులతో ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి అన్ని విధాలు గానూ సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్య తలు చేపడతారు. వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తుల రాశి: అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అందరిలోనూ మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అను కున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు సానుకూలంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వృశ్చిక రాశి: వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి: రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో కొన్ని సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధు వుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలమవు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదను కున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెంచుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభం: పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందే అవకాశముంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీనం: వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరో గ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.


సమ్మర్‌లో ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గుతారట..

బరువు తగ్గడానికి బెస్ట్ టైమ్ ఏదైనా ఉందంటే అది సమ్మర్. ఈ టైమ్‌లో కొన్ని టిప్స్ ఫాలో అయితే బరువు తగ్గుతారు. అవేంటో తెలుసుకోండి.


మీలో ఈ లక్షణాలు ఉంటే ధనవంతులు అవ్వడం ఖాయం...

ప్రతిఒక్కరు ధనవంతులు కావాలని కోరుకుంటారు. కొందరు పుట్టుకతో మరికొందరు కష్టపడి వారి చేసే పనిని, ఆత్మ విశ్వాసాన్ని నమ్మికొని పైకి ఎదుగుతుంటారు. కానీ, ఈ 5 లక్షణాలు ఉన్నవారే ధనవంతులు అవుతారని ఆచార్య చాణక్యుడు చెప్పారు. మొదటిది సోమరితనాన్ని వీడండి. ప్రజలు మంచి పనులు, కృషి ఆధారంగా మాత్రమే డబ్బు సంపాదించాలి, తద్వారా సంపదను అనుభవిస్తారు. మీరు ధనవంతులు కావాలంటే, మీరు సోమరితనం వదిలేసి నిరంతరం పని చేయడానికి కట్టుబడి ఉండాలి. మీరు ఏ పనిలోనైనా సోమరితనం లేకుండా...


Ragi Pindi Puri: రాగి పిండి పూరీలు ఎంతో టేస్టీ.. తయారు చేసుకోండి ఇలా..!

Ragi Pindi Puri Recipe: రాగిపిండి ఆరోగ్యనికి ఎంతో మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీటిని తయారు చేయడం ఎంతో సులభం.


మంచి పుచ్చకాయను కొనడం కూడా ఓ ఆర్ట్ గురూ.. ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగుండదు!

సమ్మర్(Summer) అనగానే భరించలేని వేడి, ఉక్కపోత మాత్రమే కాదు, తియ్యటి పండ్లను ఆస్వాదించే కాలం కూడా ఇదే! వేసవిలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు, పుచ్చకాయలు అందరికీ నోరూరిస్తుంటాయి. ఈ పండ్లు అందరికీ ఇష్టమే అయినా, మంచి పండ్లు ఎంపిక చేసుకుని కొనే సామర్థ్యం కొందరికే ఉంటుంది. మార్కెట్లో తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి, కొనడం అంత ఈజీ కాదు. చాలాసార్లు కోసిన తరువాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తియ్యటి పుచ్చకాయను గుర్తించవచ్చు. బరువు, రంగు, సైజు, కాయ మీద తట్టినప్పుడు వచ్చే శబ్ధం ద్వారా మంచిది ఎంపిక చేసుకోవచ్చు. తొక్కను పరిశీలించాలిఒక మంచి పుచ్చకాయకు గట్టిగా, మృదువైన తొక్క ఉంటుంది. దానిని నొక్కినప్పుడు, అది కొద్దిగా లోపలికి పోతుంది. తొక్క చాలా గట్టిగా ఉంటే, పుచ్చకాయ పండలేదని అర్థం చేసుకోవచ్చు. చాలా మృదువుగా, మెత్తగా ఉంటే, అది బాగా పండిపోయింది కావచ్చు. వాసన చూడాలిపుచ్చకాయ పండితే దాని నుంచి స్వీట్, పండిన వాసన వస్తుంది. వాసన ఎక్కువగా వస్తుంటే, పుచ్చకాయ అతిగా పండింది కావచ్చు. వాసన కొంచెం తక్కువగా వస్తుంటే లేదా లేకపోతే, పుచ్చకాయ పూర్తిగా పండలేదు. ఫీల్డ్ మార్క్, రంగును తనిఖీ చేయాలిపుచ్చకాయ పాకాన పడితే, దాని కింద భాగంలో పసుపు లేదా తెల్లటి మచ్చ ఉంటుంది. పుచ్చకాయ పూర్తిగా పండకపోయినా లేదా అతిగా పండినా ఈ మచ్చ ఉండదు. ఈ పుచ్చకాయ దిగువ భాగం పసుపు రంగులో ఉంటే అది భూమిపై సరిగ్గా పండినట్లు సూచిస్తుంది. పుచ్చకాయను తట్టి పరిశీలించాలిపుచ్చకాయ అతిగా పండి ఉంటే, దాన్ని తట్టినప్పుడు ఖాళీ (Hollow) లేదా ఫ్లాట్‌ సౌండ్‌ వస్తుంది. మంచి పుచ్చకాయను తట్టినప్పుడు డీప్‌ సౌండ్‌ శబ్దం వస్తుంది. వేళ్లతో తడుతూ చెవిని పుచ్చకాయకు దగ్గరగా ఉంచడం ద్వారా సౌండ్‌ని స్పష్టంగా వినవచ్చు. బరువు చెక్ చేయాలిఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయల బరువును పోల్చడం ద్వారా పుచ్చకాయ ఎంత బాగా పండిందో తెలుసుకోవచ్చు. బరువైన పుచ్చకాయ సాధారణంగా పండి, జ్యూసీగా ఉంటుంది. అలానే పెద్ద సైజు పుచ్చకాయల కంటే చిన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయని అంటారు. ప్రయోజనాలుచల్లదనాన్ని అందించే పుచ్చకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలో 92% శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి తగినంత నీటిని అందించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుచ్చకాయ విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పుచ్చకాయలోని లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Ice-cream: ఐస్ క్రీం తిన్న తర్వాత ఏం చేయొద్దో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..

Foods To Avoid After Having Ice-cream: ఐస్‌ క్రీమ్‌ను ఇష్టంగా తింటున్నారా? వేసవిలో ఐస్‌ క్రీమ్‌ ఎక్కువగా తినేవారు ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోండి


Parenting Tips : పిల్లలకు తల్లిదండ్రులు తప్పక నేర్పాల్సిన విషయాలు ఇవి

Parenting Tips In Telugu : చిన్నప్పుడు పిల్లలకు తల్లిదండ్రులే రోల్ మోడల్. అలాంటివారు పిల్లలకు కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. ఎందుకంటే పేరెంట్స్ చెబితేనే పిల్లలు వింటారు.


శరీరంలో ఐరన్ లోపం ఉందా!.. ఈ రెండు తినండి చాలు..

శరీరం తన విధులను సక్రమంగా నిర్వహించాలంటే సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందాలి. అలాంటి వాటిలో ఐరన్ ఒకటి. శరీరానికి ఐరన్ అందితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. దీన్ని ఐరన్ ప్రొటీన్‌గా పేర్కొంటారు. ఇది రక్తం నుంచి శరీర కణజాలాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేస్తుంది. శరీరంలో ఐరన్ లోపం ఉంటే, హిమోగ్లోబిన్ లెవల్స్ పడిపోతాయి. ఇది రక్తహీనతకు దారితీస్తుంది. దీంతో అలసట, బలహీనత, మైకం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఐరన్ లోపాన్ని అధిగమించాలంటే ఎలాంటి ఆహారాలు...


Lemon Hot Water: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే... ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon And Hot Water Benefits: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.


Strawberry Pancake: స్ట్రాబెర్రీ పాన్ కేక్ ఇలా చేశారంటే పిల్లలకి తెగ నచ్చేస్తుంది

Strawberry Pancake: ఎప్పుడూ దోశలు, ఇడ్లీలు పెడితే పిల్లలు ఇష్టంగా తినరు. ఒకసారి స్ట్రాబెర్రీ పాన్ కేక్ తయారు చేసి చూడండి. దీన్ని తయారు చేయడం చాలా సులువు.


Washing Machine Offers: రూ.2 వేల లోపే 6.5 kg కొత్త వాషింగ్‌ మెషిన్‌ను పొందండి.. ఫీచర్స్‌, డిస్కౌంట్‌ వివరాలు!

MarQ by Flipkart 6.5 kg Washing Machine Price Cut: ఫ్లిఫ్‌కార్ట్‌ బిగ్‌ సేవింగ్ డేస్‌ సేల్స్‌లో భాగంగా MarQ by Flipkart 6.5 kg సామర్థ్యం కలిగిన వాషింగ్‌ మెషిన్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో పొందవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ వాషింగ్ మెషిన్‌పై ఉన్న డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.


ఉదయం లేదా సాయంత్రం.. ఫ్రూట్స్ ఎప్పుడు తినడం వల్ల ఎక్కువ లాభాలు పొందుతారు?

పండ్లు తినడం ఆరోగ్యానికి చాలా ముఖ్యం. పండ్ల నుండి శరీరానికి అవసరమైన ప్రతి విటమిన్, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు మొదలైనవి లభిస్తాయి. మన శరీరానికి ఎలాంటి పోషకాలు అవసరమో, వాటిని పండ్ల నుంచి సులభంగా పొందుతాం. అందుకే రోజూ కనీసం ఒక పండు తినాలని వైద్యులు సూచిస్తున్నారు.(ప్రతీకాత్మక చిత్రం) కానీ తరచుగా మనం పండ్లు తినేటప్పుడు మూడు పెద్ద తప్పులు చేస్తుంటాం. ఈ పొరపాట్లు పండ్ల నుండి మనకు లభించే పోషకాలను తగ్గించడమే కాకుండా, పండ్ల నుండి మనం పొందవలసిన ప్రయోజనాలను కూడా పొందలేము. ఆ 3 తప్పులు ఏమిటో పోషకాహార నిపుణుడి నుండి తెలుసుకుందాం.(ప్రతీకాత్మక చిత్రం) 1.ఆహారంతో కలపడం : ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్వేతా షా మాట్లాడుతూ.. మనం తరచుగా సలాడ్‌లో పండ్లను తయారు చేసి, వాటిని ఏదైనా భోజనంలో కలుపుకుని తింటుంటాం. చాలా సార్లు మనం లంచ్ లేదా డిన్నర్ తో పాటు పండ్లు తింటాము. కానీ ఇలా పండ్లు తినడం సరైన పద్ధతి కాదు. బదులుగా, మీరు ఎల్లప్పుడూ పండ్లను మాత్రమే తినాలి. ఆహారంతో కలిపి వాటిని తీసుకోకూడదంట. నిజానికి పండ్లు వాటికవే పూర్తి ఆహారం. అందుచేత వీటిని మరే ఇతర ఆహారంలో కలిపి తినకూడదు.(ప్రతీకాత్మక చిత్రం) 2.పండ్లు తినండి, వాటిని త్రాగవద్దు: పండ్లను నేరుగా తినడానికి బదులు దాని రసం తీసి తాగడం మీరు తరచుగా చూసి ఉంటారు. ఆరెంజ్ లేదా యాపిల్ జ్యూస్ తాగడం చాలామందికి ఇష్టం. కానీ ఈ పద్ధతి కూడా సరైనది కాదు. నిజానికి, మనం పండ్ల రసాన్ని తీసినప్పుడల్లా, రసాన్ని తీయడానికి మొదటిది ఎక్కువ పండ్లు అవసరమౌతాయి. కాబట్టి మీకు తెలియకుండానే ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. రెండవది, పండ్ల రసం నుండి మనకు పోషకాలు లభించినప్పటికీ, పండ్ల గుజ్జులో మిగిలి ఉన్న ఫైబర్ మనకు లభించదు.(ప్రతీకాత్మక చిత్రం) 3. సాయంత్రం 5 గంటలలోపు పండ్లు తినండి : పండ్లు తినడానికి ఇదే సరైన సమయం అని డాక్టర్ శ్వేతా షా చెప్పారు. సాయంత్రం 5 గంటలలోపు ఏదైనా పండు తినడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రతి పండులో చక్కెర కంటెంట్ ఉంటుంది, ఇది మీ ఇన్సులిన్‌ను పెంచుతుంది. మీరు ఇలా చేస్తే మీ కాలేయం ఆరోగ్యంగా ఉంటుందట.(ప్రతీకాత్మక చిత్రం)


చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోతుందా? ఇలా చేయండి!

తెల్ల జుట్టు అందాన్ని పాడు చేస్తుంది. అయితే మారిన ఆహారపు అలవాట్లు, కాలుష్యం కారణంగా జుట్టు తెల్లగా మారుతుంది. ఇక్కడ చెప్పిన సింపుల్‌ టిప్స్‌ ఫాలో అయితే జుట్టు నల్లగా నిగారిస్తుంది.


Eye Beauty: ఈ ఆయిల్ రాస్తే.. మీ కళ్ల వెంట్రుకలు నల్లగా అందంగా పెరుగుతాయి.. !

ప్రజలు ఇప్పుడు మందపాటి వెంట్రుకలను పొందడానికి చికిత్సల కోసం వెళతారు, కానీ మీరు వాటిని సహజంగా కూడా పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించాలి. వెంట్రుకలు గట్టిపడటానికి ఆముదం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కాస్టర్ ఆయిల్‌ను అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది అనుకోకుండా మీ కళ్ళలోకి రాకూడదు. లావెండర్ నూనెను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయండి. జుట్టు సంబంధిత సమస్యలకు ఇది బెస్ట్ హోం రెమెడీ. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ , కొబ్బరి నూనె మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత, 30 నిమిషాలు కళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. కనురెప్పలపై గొప్పగా పనిచేసే మరో నూనె విటమిన్ ఇ ఆయిల్. మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు మస్కరా బ్రష్‌తో మీ కనురెప్పలపై దీన్ని అప్లై చేయవచ్చు. నిద్ర లేవగానే ముఖం కడుక్కోవాలి.మందపాటి కను రెప్పలు పొందడానికి మీరు అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. మీరు దీన్ని సులభంగా పొందుతారు. దీన్ని అప్లై చేసిన తర్వాత 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. వెంట్రుకలు గట్టిపడటానికి సాంప్రదాయక గృహ నివారణలలో ఒకటి కొబ్బరి పాలు. మీరు తాజా కొబ్బరి పాలను ఉపయోగించాలి. కొబ్బరి పాలలో శుభ్రమైన కాటన్ ప్యాడ్‌ను నానబెట్టి మీ కళ్లపై ఉంచండి. సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచండి.


అక్షయ తృతీయ రోజున అస్సలు చేయకూడని పనులు ఇవే..!

వీటిని కొనుగోలు చేయడం వల్ల ఇంట్లోకి పేదరికం కలిగిస్తాయి. కాబట్టి.. ఈ పవిత్రమైన రోజున అలాంటి వస్తువులు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడదు. అక్షయ తృతీయ ని చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఆ రోజున బంగారం, వెండి కొనుగోలు చేసేవారు కూడా ఉంటారు. అక్షయ అంటే.. ఎప్పటికీ తరగనిది అని అర్థం. అందుకే ఆ రోజున ఇంటికి ఏం తీసుకువస్తే... సంవత్సరం మొత్తం ఇంట్లోకి అది అడుగుపెడుతుందని నమ్ముతారు. అయితే... ఆ రోజన చేయాల్సినవి మాత్రమే...


ఏం తింటే వెంటనే నిద్రపడుతుందో తెలుసా?

మనలో చాలా మంది రాత్రిపూట నిద్రకోసం ఎంతో తిప్పలు పడుతుంటారు. అయితే రాత్రిపూట కొన్ని ఆహారాలను తింటే రాత్రివెంటనే నిద్రలోకి జారుకుంటారు. అవేంటంటే? అరటిపండులో మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల శరీరంలోని కండరాలు రిలాక్స్ అయి నిద్ర బాగా పడుతుంది. కివి పండులో సెరోటోనిన్, ఫోలేట్ లు పుష్కలంగా ఉంటాయి. ఇది పండ్లను తిన్నా బాగా నిద్రపడుతుంది. చెర్రీ పండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ పండ్లలో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్...


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!!

హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయ చాలా మంచి రోజు. ఈ రోజున అన్ని రకాల శుభ కార్యాలు చేయవచ్చు. ఈరోజు పవిత్రమైన రోజుగా భావిస్తారు. కనుక ఈ రోజు ఏ పని చేయడానికైనా మంచి ఘడియ. అక్షయ తృతీయ రోజున బంగారు, వెండి ఆభరణాలు, గృహాలు, వాహన మొదలైనవి కొనుగోలు చేసే సంప్రదాయం ఆనాదిగా వస్తుంది. ఆ రోజున బంగారు ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు. కొన్ని కారణాల వల్ల బంగారం కొనలేకపోయిన చాలా మంది ఈ రోజున వెండి కొనుగోలు చేస్తారు.అక్షయ తృతీయ రోజున బంగారం లేదా వెండి కొనుగోలు...


చంకల్లో చెమట పట్టకుండా ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఒంట్లో నుంచి చెమటలు కారుతూనే ఉంటాయి. ముఖ్యంగా చంకల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల అక్కడ డ్రెస్ తడవడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చంకల్లో చెమటలు పట్టకుండా చేయొచ్చు. అదెలాగంటే.. స్నానం చేసిన తర్వాత.. కాలాలతో సంబంధం లేకుండా కొంతమంది వేడినీటితో స్నానం చేస్తుంటారు. ఎండకాలంలో కూడా వేడి నీటి స్నానం చేస్తుంటారు.చన్నీటి స్నానమైనా, వేడినీటి స్నానమైనా ఎండాకాలంలో చంకల్లో చెమట...


అరచేతులు, పాదాలపై జుట్టు ఎందుకు పెరగదు.? అసలు విషయం తెలిస్తే బిత్తరపోతారు..!

మనం నిత్యం చూస్తున్నా కొన్ని కొన్ని విషయాలను అస్సలు పట్టించుకోము. అసలు అలా ఎందుకు ఉంటుంది.. దానికి కారణం ఏంటి అన్నవి పంట్టించుకోము. అయితే పోటీ పరీక్షల్లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఎంతో ఉపయోగపడుతుంది. ఈరోజు అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ విషయం తెలుసుకుందాం. మన శరీరం గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు అలా ఎందుకు ఉంటుంది.. కారణం ఏంటో తెలిస్తే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. మన శరీరం యొక్క బయటి భాగం చర్మంతో కప్పబడి ఉంటుంది. ఇక శరీరమంతా వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది. అయితే మీ అరచేతులు, పాదాలను జాగ్రత్తగా చూసుకోండి. అయితే వాటిమీద వెంట్రుకలు కనిపించవు.. దీనికి కారణం మీకు తెలుసా.. ఇక్కడ సమాధానం ఉంది చూడండి. శాస్త్రీయ పరిశోధన ప్రకారం, శరీరంలో Wnt అనే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. ఈ ప్రోటీన్ శరీరంలో జుట్టు పెరుగుదలకు బాధ్యత వహిస్తుంది. కానీ అరచేతులు మరియు పాదాలకు జుట్టు పెరగదు. శరీరంలోని మరో ప్రత్యేక ప్రోటీన్ అరచేతులు మరియు అరికాళ్ళపై వెంట్రుకలు పెరగకుండా చేస్తుంది. జుట్టు పెరుగుదలను నిరోధించే ఈ నిర్దిష్ట నిరోధక ప్రోటీన్ డైకాఫ్ 2 (DKK2) అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నిరోధక ప్రోటీన్ Wnt అరికాళ్లు మరియు అరచేతులకు చేరకుండా నిరోధిస్తుంది. దీని వల్ల పాదాలు, అరచేతులపై వెంట్రుకలు పెరగవు. Wnt ప్రొటీన్ వల్ల మనుషులతోపాటు జంతువులలో జుట్టు పెరుగుతుంది. ఇది జంతువు యొక్క నిర్దిష్ట జీవనశైలి, పర్యావరణం మరియు కార్యాచరణపై ఆధారపడి ఉంటుందని సైన్స్ చెబుతుంది. ఉదాహరణకు, శీతల ప్రాంతాలలో కనిపించే జంతువులు సాధారణంగా ఎక్కువ జుట్టు కలిగి ఉంటాయి. ఈ జంతువుల శరీరం జుట్టు లేదా బొచ్చుతో కప్పబడి ఉంటుంది. ఈ రకమైన మందపాటి జుట్టు చలి నుండి జంతువులను రక్షిస్తుంది. శరీర జుట్టు సూర్యుడు, చలి నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఈరోజు తలపై జుట్టు అందాన్ని సూచిస్తుంది. జుట్టు రాలే సమస్య మనుషుల్లో కూడా వస్తుంది. ఈ సమస్య పురుషులు, స్త్రీలలో కనిపిస్తుంది.


రెండు నిమిషాల్లో గ్యాస్ స్టవ్ బర్నర్ క్లీన్ చేసేయండిలా..!

మంట సరిగా రాకపోతే వంట చేయడం కష్టంగా ఉంటుంది. ఈ బర్నర్ క్లీన్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కువ సమయం కూడా పడుతుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటోంది. ఈ గ్యాస్ స్టవ్స్ వచ్చిన తర్వాత వంట చేయడం సులభం అయ్యిందని చెప్పొచ్చు. అయితే..స్టవ్ మీద వంట త్వరగా అవ్వాలి అంటే.. బర్నర్ లో నుంచి మంట సరిగా రావాలి. అయితే.. మనం వంట చేసే సమయంలో పాలు పొంగినప్పుడో, పప్పు కుక్కర్ పొంగినప్పుడు ఆ బర్నర్ లో ఇరుక్కుపోయి మంట సరిగా రాదు. గ్యాస్ బర్నర్...


ఈ రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి భవితవ్యం వారి రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల ఆడవారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్లు ఎవరెవరంటే? హిందూ సంస్కృతిలో ఎన్నో ఏండ్లు జ్యోతిష్యాన్ని ఆచరిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది అనేది వారి రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల ఆడారు తమ జీవితంలో కోటీశ్వరులు అవుతారు. వాళ్లు ఎవరెవరంటే? వృషభ రాశి...


బూడిద గుమ్మడికాయతో అనేక ప్రయోజనాలు!

బూడిద గుమ్మడికాయతో కలిగే ప్రయోజనాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. బూడిద గుమ్మడికాయ తింటే పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి.


Room Cool Without AC : ఏసీ లేకుండా రూమ్ కూల్ చేయండి.. ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించండి

Room Cool Without AC : వేసవి మెుదలైంది. విపరీతమైన వేడితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏసీ లేకుండా కూడా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.


అత్తగారింట్లో గొడవలు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి..

పెళ్లయ్యాక ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ గొడవలు కాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.


తలుపులమ్మ లోవక్షేత్ర జాతర మహోత్సవాలు ప్రారంభం.. 14 రోజుల పాటు ఇలా..

ఆ ఉత్తరాంధ్ర ప్రజల కల్పవల్లి జగత్ జననీ లలిత స్వరూపిణిగా భావించే ఆ అమ్మవారికి ఏడాది అంతా నిర్వహించే ఉత్సవాలు ఒక ఎత్తు...ఒక్క గంద అమావాస్య తరుణంలో నిర్వహించే జాతర ఒక ప్రత్యేకమైన ఎత్తు అని చెప్పుకోవచ్చు. దాదాపు 14 రోజులు జరుగు ఈ గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఆ ఉమ్మడి జిల్లాలోనే కాదు.. ఆ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలంతా ఆ ఆలయం వైపు చూసే విధంగా అక్కడ దేవదాయ ధర్మదాయ శాఖ అత్యంత ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఆ దివ్య క్షేత్రం ఎక్కడుంది ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత కాకినాడ జిల్లా లోవకొత్తూరు కొండకోనల్లో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారు గంధఅమావాస్య జాతర మహోత్సవాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. దాదాపు 14 రోజులు ఈ దివ్య క్షేత్రంలో ప్రతి ఏటా అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఘనంగా దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉంటారు. క్షేత్ర ఆనవాయితీ ప్రకారం లోవ కొత్తూరు గ్రామంలో గల గరగలు శుభ ముహూర్తానికి తీసి అనంతరం ధారా తీగ కొండల మధ్యలో ఉన్న అమ్మవారి ఆలయానికి ఈ గరగలు తీసుకువచ్చి సర్వాంగ సుందరంగా అలంకరించి దేవస్థాన కార్య నిర్వహణ అధికారి కార్యాలయానికి ఎదురుగా తొలిరోజు ఈ గరగల సంబరం అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అనంతరం రోజుకు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తూ లోవకొత్తూరు గ్రామంలో విశేష పండగ నిర్వహిస్తారు. ఇక వచ్చేనెల అమావాస్య రోజు ఈ జాతర మహోత్సవం అనేది అత్యంత ఘనంగా అమ్మవారి పుట్టింటి గ్రామమైన లోవ కొత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటారు. నిజానికి రెండుకళ్ళు సరిపోవు అనేవిధంగా ప్రతియేటా ఈజాతర మహోత్సవం జరుగుతోంది ఈఏడాది సైతం అత్యంత ఘనంగా నిర్వహిస్తామని దేవస్థాన కార్యనిర్వహణ అధికారికి పి. విశ్వనాథ్ రాజ్ తెలియజేశారు. రైతులంతా బాగుండాలని పాడి పంట బాగా పండాలని సకల జీవరాసులు జీవరాసులు బాగుండాలని ప్రతియేటా ఈ ఉత్సవాల నిర్వహిస్తుంటారు దీనిలో భాగంగా తొలిరోజు అత్యంత ఆధ్యాత్మిక పరంగా ఈ గరగల సంబరం అనేది దేవస్థానంలో జరిగింది. వేలాదిభక్త జనులు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు. సాధారణ రోజుల కన్నా విశేషమైన పర్వదినాలు అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన ఇటువంటి గంధ అమావాస్య జాతర పర్వదినాల్లో అమ్మవారిని దర్శించిన అమ్మవారి కార్యక్రమాలు కనులారా తిలకించిన ఆ జగత్ జ్జనని లలిత స్వరూపిణీన శ్రీతలుపులమ్మ అమ్మవారి ఆశీస్సులు నిండుగా ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు త్రినాధ్ రావు తెలియజేశారు.


Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలు పురుషులకు ఓ వరం.. కచ్చితంగా తినండి

Pumpkin Seeds Benefits In Telugu : గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వాటితో పురుషులకు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.


డబ్బు ఆదా చేయాలంటే ఆడవాళ్లు చేయాల్సింది ఇదే..!

ఆడవాళ్లు డబ్బును ఆదా చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూనే ఉంటారు. నిజానికి డబ్బు ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆడవాళ్లు చాలా సులువుగా డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇంట్లో ఆడవాళ్లే అన్నింటినీ చూసుకుంటారు. కుటుంబ అవసరాల నుంచి పిల్లల ఖర్చులు, నిత్యావసరాల కొనుగోళ్ల నుంచి అప్పుల వరకు అన్నీ.. ఆడవాళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. నిజానికి ఆడవాళ్లకుండే బాధ్యతలు అన్నీ ఇన్నీ...


బ్లాక్ డ్రెస్సులో టాప్ లేపేస్తున్న టాలీవుడ్ బ్యూటీ.. శ్రియ శరణ్ స్కిన్ షో అదుర్స్

టాలీవుడ్ బ్యూటీ శ్రియ శరణ్ అందం రోజు రోజుకు పెరుగుతోంది. అందుకే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ కూడా పెరుగుతోంది. రీసెంట్ గా బ్లాక్ డ్రెస్సులో బోల్డ్ ఫోటోషూట్ తో కుర్రాళ్లకు మతిపోగొడుతోంది. అమ్మడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలడం లేదు నెటిజన్లుకు.(Photo:Instagram) ఫార్టీ ఫ్లస్ ఏజ్ లో కూడా స్వీట్ సిక్స్ టీన్ లా తన జీరో సైజ్ ఫిజిక్ చూపిస్తూ కుర్రాళ్ల ను కట్టిపడేస్తోంది. అంగాంగ ప్రదర్శన చేస్తూ అందాలు ఆరబోస్తున్న ఈ హాట్ లేడీ బోల్డ్ లుక్స్ చూసి నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.(Photo:Instagram) ఇండియన్ సినిమా ఫీల్డ్ లో ఇప్పటికీ నువ్వే హాటెస్ట్ యాక్టరస్ అంటూ నెటిజన్లు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. థైస్ కనిపించేలా హాఫ్ కట్ బ్లాక్ డ్రెస్సులో టాప్ కవర్ చేస్తూ డౌన్ చూపిస్తూ టెంపరేచర్ పెంచుతోంది ముద్దుగుమ్మ. (Photo:Instagram) ఈసుందరాంగి సొగసులు, సౌందర్యం చూసి కుర్రాళ్లు కళ్లు తేలేస్తున్నారు. తనతో పాటు హీరోయిన్‌గా పరిచయమైన ముద్దుగుమ్మలు వదిన, అక్క పాత్రలు చేస్తుంటే శ్రియ మాత్రం చెక్కు చెదరని తన గ్లామర్‌తో ఇంకా హీరోయిన్‌గానే కొనసాగుతోంది. సీనియర్ హీరోలకు సరిసమానమైన జోడిగా శ్రియను సెలక్ట్ చేస్తున్నారు దర్శకులు. (Photo:Instagram) శ్రియ పైట చాటున ఉన్న పరువాలు చూపిస్తూ కుర్రాళ్లనే కాదు నెటిజన్ల చూపుల్ని కూడా తనవైపు తిప్పుకుంటోంది. తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మూమెంట్స్ ని షేర్ చేసుకుంటున్న శ్రియ అన్నీ విషయాల్లో బోల్డ్ గా ఉంటుంది. (Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెటిజన్లను చూపులు తిప్పుకోనివ్వడం లేదు. స్లిమ్ ఫిజిక్ తో బాలీవుడ్ నటి శిల్పాశెట్టి స్టైల్లో అందాలు ఆరబోస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా శ్రియ బిజీగా మారిపోయింది..(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ట్రెడిషనల్ డ్రెస్సులో టెంప్ట్ చేసే విధంగా ఫోటోషూట్ చేసింది. ఈఫోటోలకు నెటిజన్లు ఐ లవ్ యు శ్రియ అంటూ ప్రపోజల్స్ పెడుతున్నారు నెటిజన్లు.అయితే నిజంగా అజంత శిల్పంగా కనిపిస్తోంది శ్రియ శరణ్ .(Photo:Instagram) శ్రియ లేటెస్ట్ ఫోటోలు నెట్టింట్లో సునామీ సృష్టిస్తున్నాయి. ఈ అమ్మడి సోకులు, సొగసులు వర్ణించలేక నెటిజన్లు దేవత, గార్జియస్, క్వీన్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఇంకా విచిత్రం ఏమిటంటే వయసు దాచుకోని ఈముద్దుగుమ్మ తన కూతురిని ఎత్తుకొని కూడా కొన్ని ఫోటోషూట్ లు చేసింది. (Photo:Instagram)


Rhododendron: ఉత్తరాఖండ్లో ఒక పువ్వు వికసించగానే కలవర పడుతున్న శాస్త్రవేత్తలు, ఎందుకో తెలుసుకోండి

Rhododendron: కొన్ని పువ్వులు, మొక్కలు వాతావరణంతో సంబంధాన్ని పెట్టుకుని ఉంటాయి. వాటిని పరిశీలించడం ద్వారా వాతావరణంలోని మార్పులను కూడా కనిపెట్టవచ్చు. అలాంటి పువ్వుల్లో ఒకటి రోడోడెండ్రాన్.


స్లీప్ డివోర్స్ అంటే ఏంటి? భార్యాభర్తలు ఎందుకిలా చేస్తున్నారు?

సాధారణంగా భార్యాభర్తలు ఒకే చోట నిద్రిస్తారు. ప్రత్యేక సందర్భాలు, అవసరాలు వస్తే తప్ప వేర్వేరు గదుల్లో పడుకోరు. కానీ ఈ రోజుల్లో చాలా మంది జంటలు స్లీప్ డివోర్స్ (Sleep Divorce) లేదా "నిద్ర విడాకులు" అని పిలిచే ఒక కొత్త ధోరణిని అనుసరిస్తున్నారు. దీనర్థం ఏమిటంటే, ఆలుమగలు నాణ్యమైన నిద్ర కోసం లేదా వేర్వేరు వర్క్ షెడ్యూల్స్‌ కారణంగా వేర్వేరు గదుల్లో పడుకుంటున్నారు. అమెరికాలో మూడింట ఒక వంతు జంటలు మంచి నిద్ర కోసం స్లీప్‌ డివోర్స్‌ ఫాలో అవుతున్నారని...


వేసవిలో మూగజీవాలకు వడదెబ్బ తగలకుండా ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!

రోజు రోజుకు మండిపోతున్న ఎండలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. మనుషుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక పశువులు, పక్షుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సాధారణంగా వేసవిలో వడదెబ్బ, ఢీహైడ్రేషన్ సమస్యల బారిన పడుతున్నారు. మరీ మండుతున్న ఎండల వల్ల పశువులు కూడా వడదెబ్బ కు గురవుతాయా అంటే అవుననే అంటున్నారు పశువైద్యులు. ఎండా కాలంలో వడదెబ్బతోపాటు ఇంకా ఎలాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే...


అన్నం వండినప్పుడు మాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక పలుకుగా మారడమో, మాడిపోవడమో జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలన్నా.. మీకు వంట చెయ్యడం కొత్త అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి. అన్నం వండటం కూడా ఒక పని ఆ... చిన్న పిల్లలు కూడా వండేస్తారు అని అందులో ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా నీరు ఎక్కువై అన్నం మెత్తగా అయినప్పుడో... నీరు తక్కువై.. మాడిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక...


మహిళల ఆరోగ్యానికి ఇవి రక్షణ కవచం.. ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావు

Women Health: మనకు లభించే వివిధ రకాల మూలికలు, దినుసులు, సుగంధ ద్రవ్యాలతో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. కానీ వీటి గురించి చాలా మందికి తెలియదు. ముఖ్యంగా అతి పురాతన మూలికగా పేరున్న మెంతులతో మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని ఆయుర్వేదం(Ayurveda) చెబుతోంది. ఐరన్(Iron), మెగ్నీషియం(Magnesium), మాంగనీస్‌(Manganese), ఫైబర్(Fiber), విటమిన్లకు ఇవి నిలయం. వీటితో మహిళల పీరియడ్ ప్రాబ్లమ్స్ దూరమై, మెన్‌స్ట్రువల్ హెల్త్ మెరుగుపడుతుంది. PCOS వంటి అనారోగ్యాలకు సైతం...


నెలల వయసున్న పిల్లల్ని ఏసీ రూమ్‌లో పడుకోబెట్టొచ్చా..

ఎండాకాలంలో చాలా మంది ఏసీ వాడతారు. మరి, నెలల వ్యవధిలో ఉన్న పిల్లల్ని ఏసీ గదుల్లో పడుకోబెట్టొచ్చా.. తెలుసుకోండి.


ఇవి తింటే మెదడు పనితీరు 100 రెట్లు పెరుగుతుంది!

కొన్ని ఆహారాలు తినడం ద్వారా మెదడు పనితీరు రెట్టింపు అవుతుంది. అలాగే జ్ఞాపకశక్తి కూడా పెరుగుతుంది. అవేంటో చూద్దాం.


Lucky Zodiac Sign: మే రెండవ వారంలో ఈ రాశువారికి విపరీతమైన లాభాలే లాభాలు!

Lucky Zodiac Sign 6 to 12 May 2024: మే రెండవ వారంలో అనేక గ్రహాలతో పాటు నక్షత్రాలు సంచారం చేయబోతున్నాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకోండి.


కర్పూరం వాసన చూస్తే ఏమౌతుందో తెలుసా?

కర్పూరాన్ని ఎక్కువగా దేవుడి పూజలో వెలిగిస్తుంటారు. కానీ ఇది మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నిజానికి కర్పూరాన్ని వాసన చూడటం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? కర్పూరం మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. కర్పూరంలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ప్రమాదకరమైన సూక్ష్మక్రిములను చంపుతాయి. అందుకే కర్పూరం ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెప్తారు. నిపుణుల ప్రకారం.. కర్పూరం వాసన చూస్తే...


White Sauce Pasta: రుచికరమైన వైట్‌ సాస్ పాస్తా తయారీ విధానం

White Sauce Pasta Recipe: వైట్ సాస్ పాస్తా ఒక రుచికరమైన సులభమైన వంటకం, ఇది ఏ సందర్భానికి సరిపోతుంది. ఇది తయారు చేయడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని ఇష్టపడతారు.


పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్

పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్ స్కూల్ కు వెళ్లేటప్పుడు పిల్లలకు పేరెంట్స్ ఇష్టం వచ్చిన వంటలు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెడుతారు.   గుడ్డు, చికెన్, మటన్ ఇలా ఫిష్ రకరకాల వంటు చేసి  టిఫిన్ బాక్సుల్లో పెట్టి పంపిస్తారు. అయితే  రాజస్థాన్ లో లేటెస్ట్ గా  స్కూల్ పిల్లలకు  గుడ్లు, నాన్ వెజ్ టిఫిన్ బాక్సుల్లో  ప...


సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు ఇవే!

కొన్ని ఆహారాలు సులువుగా జీర్ణమై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.


మిరియాల గురించి ఆసక్తికర విషయాలు!

రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే మసాలా దినుసుల్లో మిరియాలు ఒకటి. వీటి గురించి ఆసక్తికర విషయాలు చూద్దాం.


Money Astrology: మే 4 ధన జ్యోతిష్యం.. వారిపై పనిభారం పెరుగుతుంది

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. మే 4వ తేదీ, శనివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషరాశి : వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాలి. అయితే ఉద్యోగుల సహకారంతో సిస్టమ్ పరితీరు పరిపూర్ణంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కోరుకున్న బాధ్యతలను స్వీకరించడం ద్వారా ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. పరిహారం :- వినాయకుడిని పూజించండి. వృషభం : వ్యాపారంలో సమస్యలు ఉంటాయి, కానీ అవగాహనతో వాటిని పరిష్కరించుకోవచ్చు. దీని వల్ల ఆర్థిక పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుంటుంది. పెట్టుబడికి సమయం అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా సవాలుగా ఉంటుంది. పరిహారం:- హనుమంతుని గుడిలో బజరంగ్ బాన్ పఠించండి. మిధున రాశి : మిధున రాశి ఆర్థిక మాంద్యం ఉన్న సమయంలో వ్యాపార కార్యకలాపాలపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. కొత్త పనులపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అధికారులతో సరైన సమన్వయం అవసరం. ఒక ముఖ్యమైన అసైన్‌మెంట్ వస్తుంది. పరిహారం:- సూర్య భగవానుని ఆరాధించండి. కర్కాటకం: ఉద్యోగుల కార్యకలాపాలను నిర్లక్ష్యం చేయవద్దు. లేకుంటే మీ వ్యాపార పద్ధతులు ఏవైనా లీక్ కావచ్చు. ప్రభుత్వపరంగా ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఒకరకమైన పరువు నష్టం జరిగే అవకాశం ఉంది. పరిహారం:- వినాయకునికి సింధూరం సమర్పించండి. సింహ రాశి: ప్రస్తుత వ్యాపారంపై మాత్రమే దృష్టి పెట్టండి. విస్తరణ ప్రణాళికలు అమలు చేయడం సరికాదు. ఏదైనా కొత్త టెక్నాలజీని ఉపయోగించడం, మొదలైన వాటికి సంబంధించిన పని విధానంపై చర్చ ఉంటుంది. ఆఫీస్‌లో మీ ఫైల్స్, డాక్యుమెంట్స్‌ అన్నీ భద్రంగా ఉంచండి. పరిహారం:- గోశాలకు దానం చేయండి. కన్య రాశి: ఆస్తి కొనుగోలు, అమ్మకానికి సంబంధించిన పనిలో డాక్యుమెంట్ పూర్తిగా పరిశోధించండి. నెట్‌వర్కింగ్, సేల్స్ సంబంధిత వ్యాపారంలో మంచి అవకాశాలు ఉంటాయి. అకౌంట్స్ విషయంలో కూడా పారదర్శకత పాటించాలి. పరిహారం:- బుధ గ్రహానికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. తులారాశి: వ్యాపారంలో అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. కానీ సిబ్బందికి సంబంధించిన సమస్య ఉంటుంది. అన్ని నిర్ణయాలు మీరే తీసుకోండి. మీడియా, ఇతర సోర్సులను ఎక్కువగా ఉపయోగించండి. ఆర్థిక సమస్యలు అలాగే ఉంటాయి. పరిహారం:- చీమలకు పిండి ఆహారంగా వేయాలి. వృశ్చికం: వ్యాపారంలో రిస్క్ తీసుకోకండి. ఎవరినీ సులభంగా నమ్మవద్దు, మోసపోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఆఫీస్ పనులలో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పరిహారం:- జంతువులకు సేవ చేయండి. ధనుస్సు రాశి: ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించిన వ్యాపారంలో నష్టపోయే పరిస్థితి ఏర్పడుతోంది, జాగ్రత్త. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అపార్థాలు రిలేషన్‌షిప్‌లో చీలికను సృష్టిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. పరిహారం:- సరస్వతి మాతను ఆరాధించండి మకరరాశి: వ్యాపారంలో ఎక్కువ శ్రమ ఉంటుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, మీ సూత్రాలతో కొంత రాజీ పడే అవకాశం ఉంది. ఉద్యోగంలో అదనపు పనిభారం మీపై పడవచ్చు. పరిహారం:- శివలింగానికి అభిషేకం చేయండి కుంభ రాశి: ఏదైనా వ్యాపార నిర్ణయం జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంట్లోని సీనియర్ వ్యక్తి సలహాలు, మార్గదర్శకాలను అనుసరించండి. ఈ సమయంలో షేర్ల వంటి రిస్క్ ఉండే మార్గాల్లో డబ్బును పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. ఉద్యోగంలో వాతావరణం, పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పరిహారం:- భైరవ దేవాలయంలో జెండా సమర్పించండి. మీన రాశి: ప్రస్తుతం పరిస్థితులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి, వ్యాపార సంబంధిత కార్యకలాపాలలో చాలా తెలివిగా, జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ఏదైనా ముఖ్యమైన, ఉద్యోగానికి సంబంధించిన అఫీషియల్ ట్రిప్ రద్దు కావడం వల్ల కొంత నిరాశ ఉంటుంది. పరిహారం:- శ్రీసూక్తం పఠించండి.


ఏ రాశివారు ఏం చేస్తే వారికి ఉన్న సమస్యలు తీరుతాయో తెలుసా?

ఆసమస్యలు తీరే మార్గం తెలీక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం చేస్తే.. వారి సమస్యలు తీరతాయో ఓసారిచూద్దాం.. మనిషి అన్నాక ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలేని జీవి ఎవరూ ఉండరు. అయితే... ఆసమస్యలు తీరే మార్గం తెలీక ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే.. జోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశివారు ఏం చేస్తే.. వారి సమస్యలు తీరతాయో ఓసారిచూద్దాం.. 1.మేష రాశి.. మేష రాశివారు దాదాపు మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు....


వేసవిలో సోరకాయ తింటే ఎన్ని లాభాలో తెలుసా?

సోరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వేసవిలో దీనిని తినమని చెబుతారు. ఇలాంటి సోరకాయతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయో చూద్దాం.


ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు కలిపి తినొద్దు!

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు అస్సలు కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.


Oats Soup: ఆరోగ్యకరమైన ఓట్స్ సూప్ తయారీ విధానం

Oats Soup Recipe: ఓట్స్ సూప్ అనేది పోషకమైన సూప్. ఇది శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది తయారు చేయడానికి సులభమైనది. బరువు తగ్గించడం, గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం రోగనిరోధక శక్తిని పెంచడం వంటి లక్ష్యాలకు సరిపోతుంది.


4 cooling Herbs in Summer: వేసవి వేడి నుంచి ఈ 4 మూలికలు మీ పిల్లల్ని కాపాడతాయి.. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి..

4 cooling Herbs in Summer: మండే ఎండలు శరీరం అంతా వేడిగా మారిపోతుంది. పిల్లలు, పెద్దలు అంతా స్కిన్‌ అలర్జీ, ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎండ వల్ల శరీరం ట్యాన్ అయిపోతుంది. శరీరాన్ని లోపలి నుంచి చల్లదనాన్ని అందించే కొన్ని రకాల మూలికలు ఉన్నాయి.


ఈ ఇమేజ్‌లోని అరటిపండును 10 సెకన్లలో కనిపెడితే.. మీ కంటి చూపు సూపర్ !..

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో బ్రెయిన్ టీజర్లు (Brain teasers), పజిల్స్ (Puzzles) వైరల్ అవుతున్నాయి. బ్రెయిన్‌కి బోలెడంత ఎక్సర్‌సైజ్‌ అందిస్తున్నాయి. వివిధ రకాల పజిల్స్ వివిధ కోణాల్లో మెదడుకు సవాలు విసురుతున్నాయి. ఈ పజిల్స్‌లో ఆప్టికల్ ఇల్యూషన్స్‌ (Optical illusion puzzles) పజిల్స్ పాపులర్ అయ్యాయి. అవి మెదడును కొత్త మార్గాల్లో ఆలోచించేలా చేస్తాయి. సమస్యలను పరిష్కరించడానికి కొత్త వ్యూహాలను కనిపెట్టేలా మెదడును ప్రేరేపిస్తాయి. వీటిని తరచుగా సాల్వ్...