లైఫ్‌స్టైల్

Trending:


సమ్మర్‌లో ఈ టిప్స్ ఫాలో అయితే ఈజీగా బరువు తగ్గుతారట..

బరువు తగ్గడానికి బెస్ట్ టైమ్ ఏదైనా ఉందంటే అది సమ్మర్. ఈ టైమ్‌లో కొన్ని టిప్స్ ఫాలో అయితే బరువు తగ్గుతారు. అవేంటో తెలుసుకోండి.


Health Tips: గోధుమపిండి కాకుండా ఈసారి ఈ పిండి ట్రై చేయండి.. రుచి ఆకాశంలో.. బరువు అదుపులో..

Healthy Flour : ఇంట్లో స్నాక్స్ అని ఏదో ఒక పిండి పదార్థాలు వాడుతూ ఉంటాం. కానీ ఎప్పుడూ అదే గోధుమపిండి కాకుండా.. కొత్తగా వెరైటీగా ఏమైనా కూడా ట్రై చెయ్యొచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం పాడు చేసుకోకుండా.. ఆరోగ్యానికి మంచివైన పిండి పదార్థాలు వాడొచ్చు.


ఆయుర్వేదం ప్రకారం ఈ ఆహారాలు కలిపి తినొద్దు!

ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహారాలు అస్సలు కలిపి తినకూడదు. అవేంటో తెలుసుకుందాం.


నెలల వయసున్న పిల్లల్ని ఏసీ రూమ్‌లో పడుకోబెట్టొచ్చా..

ఎండాకాలంలో చాలా మంది ఏసీ వాడతారు. మరి, నెలల వ్యవధిలో ఉన్న పిల్లల్ని ఏసీ గదుల్లో పడుకోబెట్టొచ్చా.. తెలుసుకోండి.


చంకల్లో చెమట పట్టకుండా ఏం చేయాలో తెలుసా?

ఎండాకాలం వచ్చిందంటే చాలు ఒంట్లో నుంచి చెమటలు కారుతూనే ఉంటాయి. ముఖ్యంగా చంకల్లో చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. దీనివల్ల అక్కడ డ్రెస్ తడవడమే కాకుండా దుర్వాసన కూడా వస్తుంటుంది. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే చంకల్లో చెమటలు పట్టకుండా చేయొచ్చు. అదెలాగంటే.. స్నానం చేసిన తర్వాత.. కాలాలతో సంబంధం లేకుండా కొంతమంది వేడినీటితో స్నానం చేస్తుంటారు. ఎండకాలంలో కూడా వేడి నీటి స్నానం చేస్తుంటారు.చన్నీటి స్నానమైనా, వేడినీటి స్నానమైనా ఎండాకాలంలో చంకల్లో చెమట...


మంచి పుచ్చకాయను కొనడం కూడా ఓ ఆర్ట్ గురూ.. ఈ టిప్స్ పాటిస్తే మీకు తిరుగుండదు!

సమ్మర్(Summer) అనగానే భరించలేని వేడి, ఉక్కపోత మాత్రమే కాదు, తియ్యటి పండ్లను ఆస్వాదించే కాలం కూడా ఇదే! వేసవిలో ప్రత్యేకంగా లభించే మామిడి పండ్లు, పుచ్చకాయలు అందరికీ నోరూరిస్తుంటాయి. ఈ పండ్లు అందరికీ ఇష్టమే అయినా, మంచి పండ్లు ఎంపిక చేసుకుని కొనే సామర్థ్యం కొందరికే ఉంటుంది. మార్కెట్లో తియ్యగా, జ్యూసీగా ఉండే పుచ్చకాయను గుర్తించి, కొనడం అంత ఈజీ కాదు. చాలాసార్లు కోసిన తరువాత పండు పుల్లగా లేదా రుచి లేకుండా ఉంటుంది. మీకూ ఇలాంటి అనుభవాలు ఎదురయ్యే ఉంటాయి. అయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే తియ్యటి పుచ్చకాయను గుర్తించవచ్చు. బరువు, రంగు, సైజు, కాయ మీద తట్టినప్పుడు వచ్చే శబ్ధం ద్వారా మంచిది ఎంపిక చేసుకోవచ్చు. తొక్కను పరిశీలించాలిఒక మంచి పుచ్చకాయకు గట్టిగా, మృదువైన తొక్క ఉంటుంది. దానిని నొక్కినప్పుడు, అది కొద్దిగా లోపలికి పోతుంది. తొక్క చాలా గట్టిగా ఉంటే, పుచ్చకాయ పండలేదని అర్థం చేసుకోవచ్చు. చాలా మృదువుగా, మెత్తగా ఉంటే, అది బాగా పండిపోయింది కావచ్చు. వాసన చూడాలిపుచ్చకాయ పండితే దాని నుంచి స్వీట్, పండిన వాసన వస్తుంది. వాసన ఎక్కువగా వస్తుంటే, పుచ్చకాయ అతిగా పండింది కావచ్చు. వాసన కొంచెం తక్కువగా వస్తుంటే లేదా లేకపోతే, పుచ్చకాయ పూర్తిగా పండలేదు. ఫీల్డ్ మార్క్, రంగును తనిఖీ చేయాలిపుచ్చకాయ పాకాన పడితే, దాని కింద భాగంలో పసుపు లేదా తెల్లటి మచ్చ ఉంటుంది. పుచ్చకాయ పూర్తిగా పండకపోయినా లేదా అతిగా పండినా ఈ మచ్చ ఉండదు. ఈ పుచ్చకాయ దిగువ భాగం పసుపు రంగులో ఉంటే అది భూమిపై సరిగ్గా పండినట్లు సూచిస్తుంది. పుచ్చకాయను తట్టి పరిశీలించాలిపుచ్చకాయ అతిగా పండి ఉంటే, దాన్ని తట్టినప్పుడు ఖాళీ (Hollow) లేదా ఫ్లాట్‌ సౌండ్‌ వస్తుంది. మంచి పుచ్చకాయను తట్టినప్పుడు డీప్‌ సౌండ్‌ శబ్దం వస్తుంది. వేళ్లతో తడుతూ చెవిని పుచ్చకాయకు దగ్గరగా ఉంచడం ద్వారా సౌండ్‌ని స్పష్టంగా వినవచ్చు. బరువు చెక్ చేయాలిఒకే పరిమాణంలో ఉన్న రెండు పుచ్చకాయల బరువును పోల్చడం ద్వారా పుచ్చకాయ ఎంత బాగా పండిందో తెలుసుకోవచ్చు. బరువైన పుచ్చకాయ సాధారణంగా పండి, జ్యూసీగా ఉంటుంది. అలానే పెద్ద సైజు పుచ్చకాయల కంటే చిన్న పుచ్చకాయలు సాధారణంగా తీపిగా ఉంటాయని అంటారు. ప్రయోజనాలుచల్లదనాన్ని అందించే పుచ్చకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పుచ్చకాయలో 92% శాతం నీరు ఉంటుంది. వేసవిలో శరీరానికి తగినంత నీటిని అందించి, హైడ్రేట్‌గా ఉంచుతుంది. పుచ్చకాయ విటమిన్ ఎ, సి, బి6, పొటాషియం, మెగ్నీషియం వంటి అనేక ముఖ్యమైన పోషకాలకు నిలయం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి, శరీరాన్ని వ్యాధుల నుంచి రక్షిస్తాయి. పుచ్చకాయలోని లైకోపిన్ (Lycopene) అనే యాంటీఆక్సిడెంట్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.


Chanakya Niti Telugu : ఈ 6 రహస్యాలు ఎవరితోనూ అస్సలు చెప్పకూడదు

Chanakya Niti On Secrets : ఎవరితోనూ చెప్పకూడని రహస్యాలు కొన్ని ఉన్నాయని చాణక్య నీతిలో ఆచార్య చాణక్యుడు చెప్పాడు. అవి ఏంటో ప్రతి ఒక్కరూ ఫాలో కావాలి.


Curd VS Butter milk: పెరుగు లేదా మజ్జిగ, ఈ రెండింటిలో వేసవిలో ఏది అధికంగా తీసుకుంటే చలువ?

Curd VS Butter milk: పెరుగు, మజ్జిగ.. రెండూ పాల ఆధారిత ఉత్పత్తులే. ఈ రెండింటిలో వేసవిలో ఏది ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుందో వివరిస్తున్నారు పోషక ఆహారం నిపుణులు.


డబ్బు ఆదా చేయాలంటే ఆడవాళ్లు చేయాల్సింది ఇదే..!

ఆడవాళ్లు డబ్బును ఆదా చేయడానికి ఎంతో కష్టపడుతుంటారు. కానీ ఏదో ఒక దానికి ఖర్చు పెడుతూనే ఉంటారు. నిజానికి డబ్బు ఆదా చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వాటిని ఫాలో అయితే ఆడవాళ్లు చాలా సులువుగా డబ్బును ఆదా చేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ఇంట్లో ఆడవాళ్లే అన్నింటినీ చూసుకుంటారు. కుటుంబ అవసరాల నుంచి పిల్లల ఖర్చులు, నిత్యావసరాల కొనుగోళ్ల నుంచి అప్పుల వరకు అన్నీ.. ఆడవాళ్ల చేతుల మీదుగానే జరుగుతాయి. నిజానికి ఆడవాళ్లకుండే బాధ్యతలు అన్నీ ఇన్నీ...


సమ్మర్ లో రోజుకు ఎన్ని సార్లు ముఖం కడగాలో తెలుసా?

మండే ఎండల వల్ల రోజుకు ఏడెనిమిది సార్లైనా ముఖాన్ని కడుగుతుంటారు చాలా మంది. కానీ రోజుకు ఎన్ని సార్లు పడితే అన్ని సార్లు ముఖం కడిగితే ముఖ చర్మం దెబ్బతింటుంది. అందుకే ఎండాకాలంలో రోజుకు ఎన్ని సార్లు ముఖం కడగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చలికాలం లేదా ఎండాకాలంలో చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా చర్మాన్ని బాగా శుభ్రంగా ఉంచుకోవాలి. అందంగా ఉండాలని, జిడ్డును పోగొట్టాలని చాలా మంది రోజుకు ఏడెనిమిది సార్లైనా...


Zero Oil Soya Biryani: జీరో ఆయిల్ సోయా బిర్యానీ.. రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి?

Zero Oil Soya Biryani: ఎప్పుడూ ఒకేరకమైన బిర్యానీ చేసుకుని బోర్‌ కొడుతోందా? ఈసారి సోయాతో ఆయిల్‌ లేకుండా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలి? తెలుసుకుందాం. అధిక బరువు ఉన్నవాళ్లు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు ఈ జీరో ఆయిల్ సోయా బిర్యానీని టేస్టీగా తయారు చేసుకోవచ్చు.


Golden Shower: ఎండాకాలంలో మాత్రమే వచ్చే చెట్టు.. దీని ఔషధ గుణాలు తెలిస్తే అసలు వదలరు

Golden Shower Benefits: ఇండియాలో చాలా తక్కువగా దొరికే రైలా చెట్టుకి బయట భారీ డిమాండ్ ఉంది. దానికి కారణం అందులో ఉన్న బోలెడు ఔషధ గుణాలు. గోల్డెన్ షవర్ కి ఉన్న ప్రయోజనాల గురించి ఒక పుస్తకమే రాయచ్చు. ఈసారి గోల్డెన్ షవర్ చెట్టు కనిపిస్తే ఎలా వాడాలో తెలుసుకోండి..


చిట్టి.. చిట్టి రోబోలు తయారు చేస్తున్న చిట్టి.. చిట్టి చేతులు.. టాలెంట్ అదుర్స్..

రోబోట్ అనేది ఒక స్వయంచాలక యంత్రం. ఇది కంప్యూటర్ ద్వారా ప్రోగ్రామ్ చేయదగినది. ఇది తక్కువ .. మానవ జోక్యం లేకుండా వేగం.. ఖచ్చితత్వంతో నిర్దిష్ట పనులను అమలు చేయగలదు. రోబోలు మానవుల కంటే మెరుగ్గా కొన్ని పనులు చేయగలవు. రోబోలలో పలు రకాల ఉంటాయి. ఆటానమస్ మొబైల్ రోబోట్లు, ఆటోమేటెడ్ గైడెడ్ వెహికిల్స్, ఆర్టిక్యూలేటెడ్ రోబోలు, హ్యూమనయిడ్స్ ఇలా పలు రకాల ఉంటాయి. ఇవి అనేక పరిశ్రమలలో సామర్థ్యాన్ని పెంచడానికి ప్రక్రియలను వేగవంతం చేయడానికి భద్రతను మెరుగుపరచడానికి ఈ...


మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి

మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి మండుతున్న ఎండలను తట్టుకోలేక రంగారెడ్డి జిల్లా మంచాల మండలం చిత్తాపూర్ గ్రామంలోని కామచెరువులో సుమారు రెండు టన్నుల చేపలు వడదెబ్బతో మృతి చెందాయి.  దీంతో మత్స్యకారులు రోడ్డున పడి తీవ్రంగా నష్టపోయమని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిగిలిన చేపలను రక్షిచుకునేందుకు బోరు మోటారు సహాయంతో  చెరువులోకి నీటి వదుల...


ఎండాకాలంలో గుడ్లు తినొచ్చా?

ఎండాకాలంలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలంటారు పెద్దలు. ఎందుకంటే ఇవి ఒంట్లో వేడిని బాగా పెంచుతాయి. అయితే చాలా మంది ఎండాకాలంలో గుడ్లను అస్సలు తినరు. ఎందుకంటే ఇవి కూడా శరీర వేడిని పెంచుతాయని. అసలు ఎండాకాలంలో గుడ్లను తినాలా? వద్దా? తెలుసుకుందాం పదండి. మన వంటగదిలో సాధారణంగా కనిపించే ఆహార పదార్థాల్లో గుడ్లు ఒకటి. గుడ్లను రోజూ తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్లలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.అలాగే ఇవి బరువు తగ్గడానికి...


రాశిఫలాలు 05 మే 2024:ఈరోజు మీనంలో చతుర్గ్రాహి యోగం వల్ల ఏ రాశులకు లాభమంటే...!

horoscope today 05 May 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు చతుర్గ్రాహి యోగం వల్ల కన్య, తులా రాశులతో ఈ రాశుల వారికి సూర్య దేవుని అనుగ్రహం లభించనుంది. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Ice-cream: ఐస్ క్రీం తిన్న తర్వాత ఏం చేయొద్దో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..

Foods To Avoid After Having Ice-cream: ఐస్‌ క్రీమ్‌ను ఇష్టంగా తింటున్నారా? వేసవిలో ఐస్‌ క్రీమ్‌ ఎక్కువగా తినేవారు ఈ విషయాలను మీరు తప్పకుండా తెలుసుకోండి


అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు

అయ్యో బిడ్డా! .. ఆడ శిశువును బతికుండగానే పాతిపెట్టారు అరగంట పాటు మట్టిలో తల్లడిల్లిన పసిప్రాణం     కదలికలు గమనించి స్థానికులకు సమాచారం ఇచ్చిన ట్యాంకర్  డ్రైవర్     మట్టిని తోడి చిన్నారిని బయటకు తీసిన ఉపాధి కూలీలు     హనుమకొండ జిల్లా ఊరుగొండ శివారులో దారుణం     ఎంజీఎం ఆసుపత్రికి తరలించడంతో దక్కిన ప్రాణం ఆత్మకూరు(దామెర), వెలుగు:  పుట్టిన బిడ్డను ...


Mushroom Health Benefits: మష్రూమ్స్‌తో 6 ఆరోగ్య ప్రయోజనాలు.. బీపీ, అల్జీమర్స్‌ కూడా మీ దరిచేరవు..

Mushroom Health Benefits: కొంతమందికి మష్రూమ్స్ అంటే ఇష్టం వారి డైట్లో చేర్చుకుంటారు. మరికొందరికి మష్రూమ్స్ అంటే ఇష్టం ఉండదు. కానీ మన రెగ్యులర్ గా మన డైట్ లో మష్రూమ్ చేర్చుకోవడం వల్ల అయిదు ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.


వేసవిలో చల్లగా ఉంచే మసాలా దినుసులు!

వేసవిలో తినాల్సిన బెస్ట్‌ సుగంధద్రవ్యాల గురించి ఇక్కడ వివరిస్తున్నాం. ఇవి శరీరాన్ని కూల్‌ చేస్తాయి. వేసవిలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి.


స్కూలులో పిల్లల ముందే తన్నుకున్న మహిళా ప్రిన్సిపల్, టీచర్.. కారణం ఏంటో తెలుసా?

వారిద్దరూ పాఠశాలలో టీచర్లు. ఒకరు ప్రిన్సిపల్ కాగా.. మరొకరు ఉపాధ్యాయురాలు. అయితే స్కూల్‌లో అంతా చూస్తుండగానే వారిద్దరు కొట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకరినొకరు జుట్టు పట్టుకుని మరీ తన్నుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోలను అక్కడే ఉన్నవారు చూసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ వారిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది. అసలు వారు ఎందుకు తన్నుకున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.


Lucky Zodiac signs: గురువు సంచారంలో మార్పు వల్ల మహర్జాతకం పట్టబోతున్న రాశులు ఇవే..

Lucky Zodiac signs: 2024 మే నెల ఒకటో తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి మేష రాశిలో నుంచి వృషభ రాశిలో ప్రవేశిస్తాడు. ఈ మార్పు మంచి ఫలితాలను ఇస్తుంది. ఏ రాశులకు ఎలా కలిసివస్తుందో తెలుసుకుందాం.


Eye Beauty: ఈ ఆయిల్ రాస్తే.. మీ కళ్ల వెంట్రుకలు నల్లగా అందంగా పెరుగుతాయి.. !

ప్రజలు ఇప్పుడు మందపాటి వెంట్రుకలను పొందడానికి చికిత్సల కోసం వెళతారు, కానీ మీరు వాటిని సహజంగా కూడా పొందవచ్చు. దీని కోసం మీరు కొన్ని ఇంటి నివారణలను ప్రయత్నించాలి. వెంట్రుకలు గట్టిపడటానికి ఆముదం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది. కాస్టర్ ఆయిల్‌ను అప్లై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే అది అనుకోకుండా మీ కళ్ళలోకి రాకూడదు. లావెండర్ నూనెను కొబ్బరి నూనెతో కలిపి అప్లై చేయండి. జుట్టు సంబంధిత సమస్యలకు ఇది బెస్ట్ హోం రెమెడీ. లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ , కొబ్బరి నూనె మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత, 30 నిమిషాలు కళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి. కనురెప్పలపై గొప్పగా పనిచేసే మరో నూనె విటమిన్ ఇ ఆయిల్. మీరు రాత్రి నిద్రిస్తున్నప్పుడు మస్కరా బ్రష్‌తో మీ కనురెప్పలపై దీన్ని అప్లై చేయవచ్చు. నిద్ర లేవగానే ముఖం కడుక్కోవాలి.మందపాటి కను రెప్పలు పొందడానికి మీరు అలోవెరా జెల్‌ను కూడా ఉపయోగించవచ్చు. మీరు దీన్ని సులభంగా పొందుతారు. దీన్ని అప్లై చేసిన తర్వాత 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీని తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. వెంట్రుకలు గట్టిపడటానికి సాంప్రదాయక గృహ నివారణలలో ఒకటి కొబ్బరి పాలు. మీరు తాజా కొబ్బరి పాలను ఉపయోగించాలి. కొబ్బరి పాలలో శుభ్రమైన కాటన్ ప్యాడ్‌ను నానబెట్టి మీ కళ్లపై ఉంచండి. సుమారు 15 నిమిషాలు అలాగే ఉంచండి.


Marriage: అక్కడ ప్రతి పురుషుడికీ ఇద్దరు భార్యలు తప్పనిసరి.. చేసుకోము అంటే గ్రామ బహిష్కరణ.!

భారతదేశంలోని ఓ గ్రామంలో పురుషులు తప్పకుండా రెండు పెళ్లిళ్లు చేసుకోవాలి. చాలా కాలంగా ఈ సాంప్రదాయం ఆ గ్రామంలో కొనసాగుతుంది. అక్కడ ఉన్న మహిళలు కూడా తన భర్త రెండో పెళ్లి చేసుకోడానికి అడ్డు చెప్పురు... దీని వెనుక గల కారణం తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో వింత ఆచారాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు. అలాంటి కోవలోకే వస్తుంది ఈ గ్రామం కూడా. ఎన్నో ఆసక్తికరమైన కథలు, ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ఇక్కడ దాగి ఉన్నాయి. అనేక అలవాట్లు మనుషులను ఆలోచింపజేస్తాయి. ఇక్కడ అలాంటి గ్రామం గురించి తెలుసుకోవడం మొదటి ఆశ్చర్యంగా అనిపించవచ్చు... అయితే ఇది నిజం. మనం ఇప్పుడు చెప్పుకోబోయే గ్రామం భారత్ -పాకిస్థాన్ సరిహద్దులోని ఉంది. ఇది రాజస్థాన్ లోని బర్మార్ జిల్లాలోని గ్రామం. స్థానిక ఆచారం ప్రకారం ప్రతి పురుషుడికి ఇద్దరు భార్యలు ఉండాలి.. అలా కాదు నేను శ్రీరామ చంద్రుడిని.. నాకు ఒకరే భార్య చాలు అంటే ఊరి నుంచి వెళ్లగొడతారు. ఈ చిన్న గ్రామం పేరు తెరాసర్. ఇక్కడ సుమారు 600 మంది నివసిస్తున్నారు. ప్రతి తెరాస పురుషుడికి కనీసం ఇద్దరు భార్యలు ఉంటారు. ఇది ఎంత వింతగా అనిపించినా, ఈ ఆచారం వెనుక ఉన్న కారణం మరింత ఆశ్చర్యపరుస్తుంది. మొదటి భార్య పిల్లలు పుట్టదని ఈ థెరసర్ గ్రామ నివాసితులు నమ్ముతారు. సంతానం కావాలంటే రెండో పెళ్లి చేసుకోవాలి. ఈ వింత నమ్మకం కారణంగా, ఈ గ్రామంలోని పురుషులు వారి మొదటి వివాహం తర్వాత రెండవ వివాహం చేసుకోవాలి. దీని వెనుక ఓ కథ ఉందని అంటున్నారు. చాలా సంవత్సరాల క్రితం, ఈ గ్రామంలో ఒక వ్యక్తికి సంతానం లేదు. తరువాత అతను తన రెండవ వివాహం నుండి ఒక బిడ్డ కలిగింది.. ఆ తర్వాత ఆ గ్రామంలో చాలా మందికి ఇలాంటి ఘటనే ఎదురైంది. అప్పటి నుంచి గ్రామంలో రెండో పెళ్లి ఆచారం మొదలైందని చెబుతున్నారు.


Watermelon Juice : రోజూ పుచ్చకాయ జ్యూస్ బోర్ కొట్టిందా.. అయితే ఇవి కలుపుకుని తాగండి.

Watermelon drinks : వేసవికాలంలో పుచ్చకాయ జ్యూస్.. ఎంత తాగితే అంత మంచిది. ముఖ్యంగా అందులో ఉండే నీటిశాతం.. ఈ వేడి నుండి మనల్ని కాపాడడానికి బాగా ఉపయోగపడుతుంది. కానీ రోజు పుచ్చకాయ జ్యూస్ ఒకేలాకాకుండా.. వెరైటీ గా చేస్తే ఇంకా టేస్టీగా బావుంటుంది.


జ్యూస్ ఎక్కువగా ఉండే నిమ్మకాయల్ని గుర్తించడం ఎలా.. ఇదిగో ఇలా

Juicy Lemon: వేసవి ఎండలు దేశవ్యాప్తంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ సమయంలో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే జనం ఎక్కువ చెల్లించి జ్యూస్ కొని తాగుతున్నారు. అయితే నిమ్మకాయలు జ్యూస్ లేని కారణంగా చాలా మంది చాలా మంది ఖరీదైన డబ్బు చెల్లించి మోసపోతున్నారు. దీనికి చాలా కారణాలున్నాయి. జ్యుసి నిమ్మకాయలు ఏమిటో తెలిస్తే కొనుక్కోవచ్చు. అందుకే మార్కెట్‌కి వెళ్లే ముందు మనం ఎలాంటి నిమ్మకాయ కొనుక్కోవాలో ముందుగా తెలుసుకుని మోసం నెట్‌వర్క్‌లో పడకుండా జాగ్రత్తపడండి. వేసవిలో నిమ్మకాయ లేకుండా చాలా మందికి ఆహారం గొంతులోకి వెళ్ళదు. రైస్ ఐటమ్ అయినా లేదా సూప్ అయినా వేసవిలో నిమ్మరసం పిండడం తప్పనిసరి. మార్కెట్‌లో నిమ్మకాయ ధర పెరిగింది. సంక్షోభం ఉన్నంత కాలం నిమ్మకాయల ధర తగ్గదు. అయితే నిమ్మకాయను ఎక్కువ ధర పెట్టి కొనుగోలు చేసినా అందులో రసం ఉండదని మీరు చాలాసార్లు గమనించి ఉంటారు. దీని కోసం మీరు చేయవలసిన మొదటి పని నిమ్మకాయ బరువును తనిఖీ చేయడం. నిమ్మకాయ ఎంత బరువైతే అంత జ్యూసీగా ఉంటుంది. ఎక్కువ బరువున్న నిమ్మకాయలను కొనండి. రెండవది నిమ్మ పై తొక్క చాలా గట్టిగా ఉండకూడదు. దీన్ని సున్నితంగా నొక్కితే నిమ్మతొక్క కాస్త మెత్తగా ఉంటే నిమ్మరసం జ్యుసిగా ఉంటుందని తెలుస్తుంది. నిమ్మకాయలు అసమానంగా, చాలా గరుకుగా (గట్టిగా) ఉంటే తీసుకోకండి. బదులుగా మృదువైన చర్మంతో నిమ్మకాయలను ఎంచుకుని కొనండి. ప్రకాశవంతమైన పసుపు నిమ్మకాయలను కొనండి. ప్రకాశవంతమైన పసుపు జ్యుసి నిమ్మకాయను ఎంచుకోండి. ఎందుకంటే నిమ్మకాయ కాస్త పచ్చగా ఉంటే ఇంకా పండలేదని అర్థం. నిమ్మకాయలపై పసుపు లేదా గోధుమ రంగు మచ్చలు ఉంటే వాటిని కొనకండి. అలాంటి నిమ్మకాయలు తరువాత చెడిపోతాయి. నిమ్మకాయలు ఎండిపోకుండా నిల్వ చేయండి: వేసవిలో నిమ్మకాయలను ఎక్కువ కాలం తాజాగా ఉంచడం చాలా కష్టం. ఎందుకంటే ఈ సీజన్‌లో నిమ్మకాయలు కొద్ది రోజుల్లోనే ఎండిపోతాయి. ఫలితంగా వాటి రసం తగ్గిపోయి గట్టిపడతాయి. కాబట్టి వేసవిలో నిమ్మకాయలను ఎలా ఉత్తమంగా నిల్వ చేయాలో మేము మీకు చెప్పబోతున్నాం. ఈ విధంగా మీరు చాలా రోజులు నిమ్మకాయలను తాజాగా మరియు జ్యుసిగా ఉంచవచ్చు. నిమ్మకాయలను ఫ్రిజ్‌లో ఎలా నిల్వ చేయాలి: నిమ్మకాయలను ఎక్కువసేపు తాజాగా ఉంచేందుకు వాటిని ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. అయితే నిమ్మకాయలను ఫ్రిజ్‌లో తెరిచి ఉంచితే ఎండిపోవడం మొదలవుతుందని గుర్తుంచుకోండి. కాబట్టి ఎల్లప్పుడు నిమ్మకాయలను గాలి చొరబడని డబ్బాలో లేదా జిప్ లాక్ బ్యాగ్ లో భద్రపరుచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు 1 వారం నిమ్మకాయను ఉపయోగించవచ్చు. నిమ్మకాయను టవల్‌లో చుట్టండి: మీరు నిమ్మకాయను టవల్‌లో చుట్టవచ్చు. ఇంట్లో ఫ్రిజ్ లేకపోతే ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు మొదట నిమ్మకాయను బాగా కడగాలి. తర్వాత శుభ్రంగా మరియు పొడిగా ఉన్న కాటన్ టవల్ తీసుకుని ఈ టవల్ లో నిమ్మకాయ పండ్లను విడిగా చుట్టాలి. ఇప్పుడు కట్టిన నిమ్మకాయ బుట్టను చల్లని మరియు చీకటి ప్రదేశంలో ఉంచండి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల నిమ్మకాయలు వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి.


అన్నం వండినప్పుడు మాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక పలుకుగా మారడమో, మాడిపోవడమో జరుగుతుంది. అలా అవ్వకుండా ఉండాలన్నా.. మీకు వంట చెయ్యడం కొత్త అయితే... ఈ కింది ట్రిక్స్ ఫాలో అవ్వండి. అన్నం వండటం కూడా ఒక పని ఆ... చిన్న పిల్లలు కూడా వండేస్తారు అని అందులో ఏముంది అనుకుంటూ ఉంటారు. కానీ... ఎప్పుడైనా నీరు ఎక్కువై అన్నం మెత్తగా అయినప్పుడో... నీరు తక్కువై.. మాడిపోయినప్పుడు దాని వాల్యూ తెలుస్తుంది. ఎక్కువ మందికి అన్నం వండి ప్రతిసారీ మెత్తగా అవ్వడమో..లేక...


Nail cutting: సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కట్ చేయకూడదు! ఎందుకో తెలుసా?

Nail cutting: భారతదేశంలో సంప్రదాయాలు, ఆచారాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే తరతరాల నుంచి మన పూర్వీకులు పాటించడంతో అవి మన జీవనవిధానంలో భాగమయ్యాయి. నేటికీ ఈ అవాట్లను, పద్ధతులను పాటిస్తున్నారు. ఉదాహరణకు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించరు. పురాతనకాలం నుంచి ఈ ఆచారం ఉంది. కొందరు దీన్ని మూఢనమ్మకంగా భావించినప్పటికీ చాలా మంది ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. సూర్యాస్తమయం తర్వాత గోళ్లను కత్తిరించకపోవడానికి ఉన్న కారణాలేంటో ఇప్పుడు పరిశీలిద్దాం.*...


Your Weekly Horoscopes: ఈ వారం ఓ రాశివారికి ఆకస్మిక ధనలాభం

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం వార ఫలాలు : 05-5-24 నుండి 11-5-24 వరకు మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9 స్థిరాస్తులు విషయంలో తగాదాలు ఏర్పడును. చిన్నపాటి గాయాలు జబ్బులు చేయును. వివాహ విషయములో చిన్నపాటి...


Pumpkin Seeds Benefits : గుమ్మడి గింజలు పురుషులకు ఓ వరం.. కచ్చితంగా తినండి

Pumpkin Seeds Benefits In Telugu : గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వాటితో పురుషులకు మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో కచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే.


టూల్స్ గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్

టూల్స్  గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్ టూల్స్  గాడ్జెట్స్ : ట్రయాంగిల్ మాప్ ఇల్లు క్లీన్‌‌ చేయడానికి రకరకాల మాప్‌‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఇది మాత్రం మల్టీఫంక్షనల్ డిజైన్ క్లీనింగ్ మాప్. చూడడానికి త్రిభుజాకారంలో ఉంటుంది. దీన్ని వ్యోక్స్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. దీని హెడ్‌‌ని 360 డిగ్రీల వరకూ రొటేట్ చేసుకోవచ్చు.  సోఫా, బెడ్, వాల్ కార...


సులువుగా జీర్ణమయ్యే ఆహారాలు ఇవే!

కొన్ని ఆహారాలు సులువుగా జీర్ణమై ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలాంటి ఆహారాల గురించి తెలుసుకుందాం.


వరి గడ్డి చుట్టే యంత్రాన్ని ఎప్పుడైనా చూశారా..?ఇక్కడ చూసేయండి..

ఒకప్పుడు వరి కోత దశకు వస్తే చాలు.. కోత కొయ్యాలి అంటే పెద్ద సంఖ్యలో కూలీలు కావాల్సిందే, పగలు కొయ్యాలి అంటే వాతావరణం అనుకూలించేది కాదు. కాబట్టి విద్యుత్ దీపాలు పెట్టుకొని మరీ కోత కోసేవారు. కోసిన వరిని కట్టలు కట్టి రాతి బండ ఉండే చోటకు మోసేవారు లేదంటే బండి లేదా ట్రాక్టర్ సాయంతో పల్లపు ప్రాంతంకు చేర్చే వారు. దాన్ని వొబ్బిడి చెయ్యాలి అంటే వారాలు పట్టేది. ధ్యానం ఇల్లు చేరే వరకు ఇబ్బందులు పడే వారు. కానీ వీటిని చెక్ పెట్టడానికి వరిని, కోత కోసి, వోబ్బిడి...


నెయిల్ ఎక్స్ టెన్షన్ వాడితే ఏమౌతుందో తెలుసా

గోర్లు అందంగా కనిపించాలని చాలా మంది అమ్మాయిలు అనుకుంటారు. అందుకే చాలా మంది నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను వాడుతుంటారు. కానీ వీటిని పెట్టుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు. గోర్లు పొడవుగా, అందంగా కనిపించాలని చాలా మంది పెట్టుడు గోర్లను వాడుతుంటారు. సాధారణంగా నెయిల్ ఎక్స్ టెన్షన్స్ పై నెయిల్ పాలిష్ తో రకరకాల డిజైన్స్ వస్తుంటారు. కొన్నేండ్ల నుంచి ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. కొంతమంది ఆడవారు ఈ నెయిల్ ఎక్స్ టెన్షన్స్ ను...


Horoscope Today: మే 4 రాశి ఫలాలు.. ఈ రాశులకు ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు..!

రాశి ఫలాలు ప్రతి రోజూ మారిపోతూ ఉంటాయి. ఒక్కో రోజు.. ఒక్కో రాశి వారికి కలిసొస్తుంది. మరికొందరికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఏ రాశి వారికి ఇవాళ ఎలా ఉందో ముందే తెలుసుకుంటే.. ఏవైనా సమస్యలు ఉన్నట్లు అనిపిస్తే.. జాగ్రత్త పడవచ్చు. మరి ఈ రోజు (మే 4, 2024 శనివారం) రాశిఫలాలు ఎలా ఉన్నాయో.. జ్యోతిష పండితులు ఏం సూచించారో తెలుసుకుందాం. మేషం: వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా, సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో చిన్నా చితకా సమ స్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాల తీరుతెన్నులు మార్చే ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగు లకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ పరిస్థితులు ఉత్సాహంగా సాగిపోతాయి. వ్యక్తిగత సమస్య పరిష్కారం అవుతుంది. పిల్లలు సత్ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వృషభం: ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరు గుతాయి. కొందరు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనం చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. మిథునం: ఆర్థిక పరిస్థితి చాలావరకు మెరుగ్గా ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తవుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండవు. సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగంలో గౌరవ మర్యాద లకు లోటుండదు. వృత్తి జీవితంలో బాగా బిజీ అవుతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. కర్కాటకం: నిరుద్యోగులకు సమయం బాగా అనుకూలంగా ఉంది. కొత్త ఉద్యోగావకాశాలు అంది వస్తాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రులకు సహాయకారిగా ఉంటారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వ్యాపా రాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. సింహ రాశి: వృత్తి, ఉద్యోగాల్లో లక్ష్యాలు పెరుగుతాయి. వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులు మంచి అవకాశం అంది వస్తుంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే ఆశించిన అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ కార్యా ల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ కీలక పాత్ర పోషించే అవకాశముంది. ఆరోగ్యం పరవాలేదు. కన్య రాశి: సోదరులతో ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి అన్ని విధాలు గానూ సహాయ సహకారాలు లభిస్తాయి. కొందరు బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో కొత్త బాధ్య తలు చేపడతారు. వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. జీవిత భాగస్వామితో వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. తుల రాశి: అన్ని రంగాల వారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అందరిలోనూ మీ మాటకు బాగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అను కున్న పనులను అనుకున్నట్టు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు సానుకూలంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితికి లోటుండదు. వృశ్చిక రాశి: వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగిపోతాయి. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులు, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు. ధనస్సు రాశి: రోజంతా బాగా అనుకూలంగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లో మీ మాటకు తిరుగుండదు. ఉద్యోగంలో కొన్ని సానుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధు వుల విషయాల్లో తలదూర్చవద్దు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి. మకరం: వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితి బాగా అనుకూలమవు తుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదను కున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెంచుతారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. జీవిత భాగస్వామి కెరీర్ పరంగా పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కుంభం: పెళ్లి ప్రయత్నాలకు బంధువుల నుంచి శుభవార్త అందుతుంది. నిరుద్యోగులకు ఆశించిన సమా చారం అందే అవకాశముంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. నష్టదాయక వ్యవహారాలకు దూరంగా ఉండండి. మీనం: వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. కొందరు బంధుమిత్రులు ఇబ్బందులకు గురి చేస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. ఆరో గ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. జీవిత భాగస్వామికి ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు.


Tips For Milk Spoiling In Summer:వేసవిలో పాలు విరిగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

Tips For Milk Spoiling In Summer: వేసవిలో ఎండ ఎక్కువగా ఉండడం వల్ల పాలు త్వరగా పాడైపోతాయి. ఒక్కరోజు మర్చిపోయినా కూడా పాలు పులిసిపోయి, పెరుగులా మారిపోతాయి. ఈ సమస్యను నివారించడానికి కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటో మీరు తెలుసుకోండి


ఈ రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ఒక వ్యక్తి భవితవ్యం వారి రాశిచక్రం ఆధారంగా నిర్ణయించబడుతుంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల ఆడవారు కోట్ల రూపాయలు సంపాదిస్తారు. వాళ్లు ఎవరెవరంటే? హిందూ సంస్కృతిలో ఎన్నో ఏండ్లు జ్యోతిష్యాన్ని ఆచరిస్తున్నారు. ఒక వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తి స్వభావం ఎలాంటిది అనేది వారి రాశిచక్రంపై ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని రాశుల ఆడారు తమ జీవితంలో కోటీశ్వరులు అవుతారు. వాళ్లు ఎవరెవరంటే? వృషభ రాశి...


పిల్లలను చురుకుగా మార్చే యోగాసనాలు ఇవి..!

ఆటల్లో మాత్రమే కాదు.. కొందరు పిల్లలు చదువుల్లోనూ పెద్దగా ఆసక్తి చూపించరు. చదువుల్లో వెకపడిపోతూ ఉంటారు. మీ పిల్లల్లోనూ ఆ సమస్య ఉంటే.. వారు చదువుల్లో, ఆటల్లో వెకనపడుతున్నారని మీకు అనిపిస్తే.. వారిని వెంటనే యోగాలో చేర్పించాలి. తమ పిల్లలు అన్నింట్లోనూ ముందుండాలని, వారి తెలివి తేటలు పెరగాలని , చాలా చురుకుగా ఉండాలి అని ప్రతి పేరెంట్స్ కోరుకుంటారు. అయితే.. అందరు పిల్లలు అలా అన్నింట్లోనూ ముందు ఉండాలని రూల్ లేదు. దీంతో.. పేరెంట్స్ తమ పిల్లలు...


సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో...

సమ్మర్ స్పెషల్ ప్రూట్.. తాటిముంజలు.. ఇవి ఎన్ని లాభాలో... ఎండాకాలంలో మాత్రమే దొరికే స్పెషల్ ఫ్రూట్స్ తాటిముంజలు. వీటిని ఐస్ ఆపిల్స్ అని కూడా అంటారు. తెలంగాణ, ఏపీ లాంటి రాష్ట్రాల్లో ఎక్కువగా పల్లెటూర్లలో దొరికే ఈ పండ్లు ఆరోగ్యానికి ఎంతో మంచిది. గత కొంత కాలంగా పట్టణాల్లో కూడా ఈ తాటిముంజలను విక్రయిస్తున్నారు. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఈ పండ్లను ప్రజలు...


Onion Dosa: ఉల్లి దోస ఈజీగా తయారు చేసుకోవడం ఎలా?

Onion Dosa Recipe: ఉల్లి దోస ఎంతో రుచికరమైన డిష్‌. దీని ఎక్కువగా బ్రేక్‌ ఫాస్ట్‌లో తయారు చేస్తారు. అయితే దీని ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేస్తారంటే..!

బంగారం లక్ష్మీదేవి రూపంగా కూడా పరిగణించబడుతుంది.ఈ నమ్మకం వెనుక ఉన్న చరిత్ర ఏమిటంటే దేవతలు, రాక్షసుల మధ్య సాగర మథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు.అందుకే బంగారాన్ని లక్ష్మీదేవిరూపంగా భావించేవారు.ఈ కారణంగా అక్షయ తృతీయ, ధన్తేరస్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది.బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలను కొనుగోలు చేసి ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం.


నెల రోజులు చక్కెర తినకపోతే ఏం జరుగుతుంది?

చక్కెరతో చేసిన ఎలాంటి ఆహారాలైనా టేస్టీ టేస్టీగా ఉంటాయి. అందుకే చాలా మంది తీపిని బాగా ఇష్టపడతారు. కానీ చక్కెర మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. రెగ్యులర్ గా చక్కెరను తినేవారు ఒక నెల పాటు తినకపోతే ఏం జరుగుతుందో తెలుసా? చక్కెరను ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే దీనిలో ఉండే ఇన్ఫ్లమేటరీ గుణాలు శరీరంలో నీటి నిలుపుదలకి కారణమవుతాయి. దీనివల్ల పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి వస్తుంది. అలాగే చక్కెర మన బరువును కూడా పెంచుతుంది. అసలు...


Pulagam Recipe: రుచికరమైన, ఆరోగ్యకరమైన పులగం తయారీ విధానం

Pulagam Recipe: పులగం అనేది ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక ప్రసిద్ధమైన వంటకం. ఇది బియ్యం, పెసరపప్పు తో తయారు చేయబడుతుంది. పులగం చాలా సులభమైన వంటకం దీనిని తయారు చేయడానికి చాలా ఎక్కువ సమయం పట్టదు.


Lemon Hot Water: వేడి నీళ్లలో నిమ్మకాయ కలిపి తాగితే... ఏం జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon And Hot Water Benefits: ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ రసం, గోరువెచ్చని నీటిలో కలుపుకొని తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి.


Fenugreek Leaves: సమ్మర్‌లో తప్పకుండా తీసుకోవాల్సిన ఆకుకూర..ఆరోగ్య సమస్యలకు చెక్!

Fenugreek Leaves Benefits: మెంతికూర ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన ఆకుకూర, ఇది భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందింది. దీనిని పప్పు, కూరలు, సలాడ్‌లలో ఉపయోగించవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యలాభాలు ఏంటో మనం తెలుసుకుందాం.


వారికి అనవసర ఖర్చులు బాగా పెరిగి ఇబ్బంది పడతారు

Horoscope today:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశిఫలాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. మరి నేడు మే 5 ఆదివారం నాడు, మేషం నుంచి మీనం వరకు ఏయే రాశులకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో పరిశీలిద్దాం. మేష రాశి (Aries): (అశ్విని, భరణి, కృత్తిక 1)ఈ వారమంతా చాలావరకు హ్యాపీగా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగాల్లోప్రాధాన్యం, ప్రాభవం బాగా పెరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి.ఆర్థిక సమస్యలు కొంత మేరకు పరిష్కార మవుతాయి. ఉద్యోగం మారడానికిచేస్తున్న ప్రయత్నాలను విరమించే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూలస్పందన లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో కొందరి నుంచి చేయూత లభిస్తుంది.ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయం అవుతారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలనుస్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంనుంచి మంచి ఆఫర్ వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. వృషభ రాశి (Taurus): (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)ఈ రాశివారికి శుభ గ్రహాల అనుకూలత కాస్తంత తక్కువగా ఉన్నందువల్ల అటుఉద్యోగాల్లోనూ, ఇటు కుటుంబంలోనూ చిన్నా చితకా సమస్యలు ఉండే అవకాశం ఉంది.సుఖ సంతోషాలు, మన శ్శాంతి కొద్దిగా తగ్గుతాయి. ఆర్థిక వ్యవహారాలు కాస్తంతఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. శని, బుధులు కొద్దిగా అనుకూలంగా ఉన్నందువల్లశుభ వార్తలు వినడం, అనుకోకుండా ఒక శుభ పరిణామం కూడా చోటు చేసుకోవడంవంటివి జరుగుతాయి. ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. కానీ ఖర్చులు కూడా పెరిగేఅవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. వృత్తి జీవితంబాగా బిజీ అవుతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆరోగ్యం ఆశించినస్థాయిలో మెరుగ్గా ఉంటుంది. వ్యక్తిగత సమస్యలు టెన్షన్లు పెడతాయి. కుటుంబపరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మిథున రాశి (Gemini):(మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)వారమంతా ప్రశాంతంగా గడిచిపోతుంది. గ్రహ బలం చాలావరకు అనుకూలంగా ఉంది.ఫలితంగా వృత్తి, ఉద్యోగాల్లో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లోలాభాలకు లోటుండదు. కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశముంది. ముఖ్యమైనవ్యవహారాల్లో మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి.దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సానుకూల సమాచారం అందుతుంది.వ్యక్తిగత సమస్యలు పరిష్కారమయ్యే అవకాశముంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.మంచి ఉద్యోగంలోకి మారే సూచనలు కనిపిస్తున్నాయి. మధ్య మధ్య స్నేహితులతోవిభేదాలు తలెత్తుతుంటాయి. కొందరు సన్నిహితులు తప్పుదోవ పట్టించే అవకాశంఉంది. ఎవరికీ హామీలు ఉండకపోవడం మంచిది. పెళ్లి ప్రయత్నం సఫలం అవుతుంది. కర్కాటక రాశి (Cancer):(పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)ఈ వారమంతా చాలావరకు అనుకూలంగానే గడిచిపోతుంది. లాభస్థానంలో గురువు, దశమస్థానంలో రవి, శుక్రుల సంచారం కారణంగా ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు.అయితే, ఆదాయానికి మించి అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తలపెట్టినపనులు, వ్యవహారాలు వ్యయ ప్రయాసలతో పూర్తవుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణలభిస్తుంది. వృత్తి, వ్యాపా రాల్లో రాబడి ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశంఉంది. ఉద్యోగ ప్రయత్నాలకు, పెళ్లి ప్రయత్నా లకు ఆటంకాలు తొలగుతాయి.కుటుంబ పరిస్థితులకు, ఆర్థిక పరిస్థితులకు ఢోకా ఉండదు. వ్యక్తిగత సమస్యలవిషయంలో కొద్దిగా చికాకులు తలెత్తే సూచనలున్నాయి. ఒక శుభ కార్యంలో బాగాఇష్టమైన బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. పిల్లల నుంచి శుభవార్తలువింటారు. సింహ రాశి (Leo): (మఖ, పుబ్బ, ఉత్తర 1)ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల చోటు చేసుకుంటుంది. నవమ స్థానంలో రాశ్యధిపతిరవి ఉచ్ఛలో ఉండడం, దశమ స్థానంలో గురువు సంచారం వల్ల వృత్తి, వ్యాపారాల్లోఒక వెలుగు వెలుగుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడతారు. బంధువులతోఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. సప్తమ స్థానంలో శనితో పాటు, అష్టమ స్థానంలోరాహువు సంచారం వల్ల కుటుంబంలో టెన్షన్లు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగాపిల్లల విషయంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన వ్యవహారాలుసమస్యాత్మకంగా మారతాయి. సొంత పనుల మీద దృష్టి పెట్టడం మంచిది. ఉద్యోగ,వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో తల దూర్చడంమంచిది కాదు. దైవ కార్యాల్లోనూ, సహాయ కార్యక్రమాల్లోనూ ఎక్కువగాపాల్గొంటారు.. కన్య రాశి (Virgo):(ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)గురువు భాగ్య స్థానంలో, శని ఆరవ స్థానంలో సంచారం చేయడం వల్ల వృత్తి,వ్యాపారాల్లో లాభా లతో సాగిపోతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం బాగాపెరుగుతుంది. ఆదాయానికి లోటుండకపోవచ్చు అనవసర ఖర్చులు బాగా పెరిగిఇబ్బంది పడతారు. కొద్దిపాటి ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు పరిష్కారంఅవుతాయి. ఇంటా బయటా గౌరవమర్యాదలు వృద్ధి చెందుతాయి. మంచి పరిచ యాలుఏర్పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు, పెండింగ్ పనులను చాలావరకు పూర్తిచేస్తారు. అనవసర పరి చయాలకు దూరంగా ఉండడం మంచిది. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆహార, విహారాల్లో తప్పనిసరిగాజాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు కూడా కలిసివస్తాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందివస్తాయి. తుల రాశి (Libra):(చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)సప్తమంలో రవి, శుక్రుల బలం వల్ల వారమంతా చాలావరకు ప్రయోజనకరంగాగడిచిపోతుంది. అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ప్రయత్నాలన్నీనెరవేరుతాయి. ఆర్థిక విషయాల్లో సమయం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.ముఖ్యమైన ప్రయత్నాలు, నిర్ణయాలు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లోఆశించిన స్థాయిలో సంపాదన పెరుగుతుంది. మిత్రుల మీదా, విలాసాల మీదాఎక్కువగా ఖర్చు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లోమీ మాట చెలామణీ అవుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి.ఆరోగ్యం పరవాలేదనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. దాంపత్యజీవితంలో సానుకూలత ఏర్పడుతుంది. ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం, హామీలుఉండకపోవడం ఎంతో శ్రేయస్కరం. వృశ్చిక రాశి (Scorpio): (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)ఒక్క శనీశ్వరుడు తప్ప మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నందువల్లఉద్యోగంలోనూ, ఆర్థి కంగానూ ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఎటువంటిప్రయత్నం తలపెట్టినా, ఎటువంటి పని ప్రారం భించినా తప్పకుండా విజయవంతంఅవుతుంది. అయితే, ప్రస్తుతానికి ఆర్థిక లావాదేవీలు, స్పెక్యు లేషన్ వంటివిషయాలకు దూరంగా ఉండడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో శత్రువులు,పోటీదార్ల ఒత్తిడి బాగా తగ్గుతుంది. అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు అదుపులోఉంటాయి. సమాజంలో కొందరు ప్రముఖులతో లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి.ఉద్యోగంలో అధికారులతో సమా నంగా బాధ్యతలను నిర్వర్తిస్తారు. వృత్తి,వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో రాబడి పెరుగు తుంది. ఉద్యోగ, పెళ్లిప్రయత్నాలు చాలావరకు సఫలమవుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.. ధనస్సు రాశి (Sagittarius):(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)శుభ గ్రహాల సంచారం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటేబాగా మెరు గుపడుతుంది. ఆర్థిక సమస్యల నుంచి, ఒత్తిళ్ల నుంచి క్రమంగావిముక్తి లభిస్తుంది. ఆదాయం బాగా పెరగడం, ఆర్థిక ప్రయత్నాలు కలిసి రావడం,ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనివ్వడం వంటివి జరిగే అవకాశం ఉంది.రాదనుకున్న డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఆస్తి వివాదంలోతోబుట్టువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఉద్యోగం బాగా సానుకూలంగాసాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి.ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. దైవకార్యాల్లో పాల్గొంటారు. మిత్రుల వివా దాల్లో మధ్యవర్తిగా వ్యవహరించేఅవకాశం ఉంది. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.. మకర రాశి (Capricorn): (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. గ్రహ బలం బాగా అనుకూలంగాఉంది. ఏలి న్నాటి శని ప్రభావం వల్ల ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉండేఅవకాశం ఉన్నప్పటికీ ముఖ్య మైన వ్యవహారాలను, పెండింగ్ పనులను పట్టుదలగాపూర్తి చేస్తారు. కుటుంబం మీద ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది.అనుకోకుండా ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలను పరిష్కరించు కుంటారు. వృత్తి,వ్యాపారాల్లో లాభదాయక పరిస్థితులు నెలకొంటాయి. ఉద్యోగంలో అధికారుల సహకారంఉంటుంది. ఆహార, విహారాల్లో తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్ననాటిమిత్రులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. జీవిత భాగస్వామి వృత్తి,ఉద్యోగాలకు సంబంధించి శుభ వార్తలు వింటారు. కుటుంబపరంగా ఒకటి రెండు శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. కుంభ రాశి (Aquarius): (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)వృత్తి, ఉద్యోగాలపరంగా ఆశించిన శుభవార్తలు వింటారు. సాధారణంగా ఏ ప్రయత్నంతలపెట్టినా విజయవంతం అవుతుంది. గ్రహ బలం మిశ్రమంగా ఉన్నందువల్ల కొద్దిగాఆరోగ్య సమస్యలు, ఇంటా బయటా ఒత్తిడి, వ్యయ ప్రయాసలు ఉండే అవకాశముంది.అయితే, ఏ రంగానికి చెందిన వారైనప్పటికీ ఎక్కువగా సానుకూల ఫలితాలుఅనుభవానికి వస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ బాగా పెరుగుతుంది.ఉద్యోగంలో పదోన్నతికి లేదా హోదా పెరగడానికి అవకాశముంది. కుటుంబవ్యవహారాలను సంతృప్తికరంగా పూర్తి చేయడం జరుగుతుంది. వ్యక్తిగత సమస్యలపరి ష్కారం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ,వివాహ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభించవచ్చు. పిల్లల నుంచి ఆశించినసమాచారం అందుతుంది.. మీన రాశి (Pisces): (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)వారమంతా చాలావరకు బాగానే గడిచిపోతుంది. పనులన్నీ నిదానంగా పూర్తవుతాయి.గ్రహబలం కాస్తంత మిశ్రమంగా ఉంది. కొన్ని ఒడిదుడుకులు తప్పకపోవచ్చు.ముఖ్యమైన వ్యక్తిగత వ్యవహారాలు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలనుంచి చాలావరకు బయటపడ తారు. ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యలుఅనుకోకుండా పరిష్కారం అవుతాయి. అతి తక్కువ ప్రయత్నంతో అతి ఎక్కువ ఫలితంపొందుతారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వృత్తి,వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. దూరపు బంధువులలో పెళ్లిసంబంధం కుదిరే అవకాశం ఉంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ప్రయాణాలలో కొద్దిగాఇబ్బంది పడతారు. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


పూజ తర్వాతే ఇక్కడ మద్యం సేవిస్తారు.. ఆ భక్తులు ఎవరు ? ఆ ఆచారం ఎందుకు ?

మద్యం సీసాలను పూజకు సమర్పించే ఆలయం ఒకటి ఉంది. ఇక్కడ మద్యం సీసాలను ఉంచి పూజలు నిర్వహించిన తర్వాతే మద్యాన్ని స్వీకరిస్తారు ఆ భక్తులు. ఇంతకు ఆలయం ఎక్కడ ఉందో తెలుసా? మన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో...మెదక్ జిల్లా అల్లాదుర్గం గ్రామ శివారులో వెలిసిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆలయం ప్రముఖ ఆలయాలలో ఒకటి. భక్తులు కోరుకున్న కోరికలు తీర్చే ఆలయంగా ఈ ఆలయం ప్రసిద్ది గాంచిది. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల...


Astrology: వృషభ రాశిలో 3 గ్రహాల కలయిక.. ఈ రాశులవారికి లాభాలే లాభాలు!

Venus, Sun and Jupiter Conjunction Horoscope In Telugu: త్వరలోనే వృషభ రాశిలో మూడు గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశువారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.


Snake Fruit: పాము చర్మంలాంటి పండును చూశారా? దీన్ని ఎప్పుడైనా మీరు తిన్నారా?

Snake Fruit: ఎన్నో పండ్లను మీరు చూసుంటారు, తినుంటారు.కానీ ఈ వెరైటీ పండును తిని ఉండరు. చూడగానే పామును గుర్తు చేస్తుంది ఈ పండు. దీని పేరు స్నేక్ ఫ్రూట్.


Room Cool Without AC : ఏసీ లేకుండా రూమ్ కూల్ చేయండి.. ఈ సింపుల్ చిట్కాలను ప్రయత్నించండి

Room Cool Without AC : వేసవి మెుదలైంది. విపరీతమైన వేడితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఏసీ లేకుండా కూడా ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.