Trending:


రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను దిండు కింద పెట్టుకుంటే ఏమౌతుందో తెలుసా?

ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను రెండింటిని తుంచి.. ఆ ఆకులను దిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే ఊహించని ప్రయోజనాలు లభిస్తాయి. హిందూ మతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. తులసి మొక్కను పూజించడం వల్ల మంచి జరుగుతుందని భావిస్తుంటారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో, పెరట్లో లేదంటే ఇంటి ముందు కచ్చితంగా తులసి మొక్కను పెంచుకుంటారు. ప్రతిరోజూ ఆ తులసి ముక్కకు నీరు సమర్పించి ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. అయితే... ఈ తులసి...


తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న

తనకంటే ముందే పెండ్లి చేసుకున్నాడని.. ఇల్లు తగలబెట్టిన అన్న నిజామాబాద్​, వెలుగు : తనకు పెండ్లి కాకుండానే తమ్ముడు చేసుకున్నాడనే కోపంతో తమ్ముడుతో పాటు అతడి భార్యపై దాడి చేయబోయిన అన్న వారు దొరక్కపోవడంతో చివరకు వారుంటున్న ఇం టిని పెట్రోల్​పోసి కాలబెట్టాడు. నిజామాబాద్​కు చెందిన మజ్​హర్, అమర్ అన్నదమ్ములు. అన్న మజ్​హర్​కు పెండ్లి కాలేదు. తమ్ముడు అమర్​ హైదర...


Your Weekly Horoscopes: ఓ రాశివారికి సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి

Your Weekly Horoscopes: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ వారం రాశి ఫలాలు లో తెలుసుకుందాం వార ఫలాలు : 28-4-2024 నుండి 04-5-2024 వరకు మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1): నామ నక్షత్రాలు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య॥ 9 శారీరక మానసిక అనారోగ్యం సమస్యలు ఏర్పడగలవు. చెడు దారులు తొక్కే అవకాశం...


హనుమాన్ స్ఫూర్తితో పిల్లలకు ఈ పేర్లు పెట్టొచ్చు!

హనుమంతుడి పేరుమీద చాలా పిల్లల పేర్లు ఉన్నాయి. అందులో ట్రెండింగ్ పేర్లపై ఓ లుక్కేయండి.


Trigrahi Yog : త్రిగ్రాహి యోగం ఈ రాశులవారికి లాభం!

Trigrahi Yog 2024 మేష రాశి త్రి గ్రాహి యోగం వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీలో సృజనాత్మకత ఉంటుంది. చేసే పనిలో మంచి ఫలితాలు పొందుతారు. కొన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్యలు తీరిపోతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృషభ రాశి విద్య, వృత్తి, సంపద, వ్యాపారం, వైవాహిక జీవితానికి ఇది గొప్ప సమయం. భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పోటీ పరీక్షలలో విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. మిథున రాశి ఉన్నతాధికారుల నుంచి మద్దతు పొందుతారు. శత్రువులు మీ...


Gajkesari Raj Yog 2024 గజకేసరి రాజ యోగం వేళ ఈ 5 రాశులకు తిరుగనేదే ఉండదట..!

Gajkesari Raj Yog 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గజకేసరి రాజ యోగం వల్ల ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమయ్యే అవకాశాలు రానున్నాయి. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి...


Good Intimate Life: మీ లైంగిక జీవితాన్ని ఆనందంగా మార్చే అద్భుతమైన యోగా ఆసనాలు..

Exercises For Good Intimate Life : చాలామంది అనేక సమస్యల కారణంగా పడకగదిలో భాగస్వామితో కలిసే క్రమంలో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. అయితే ఇకనుంచి ఈ క్రింది ఆసనాలు వేయడం వల్ల మీరేంటో నిరూపించుకోవచ్చు. అంతేకాకుండా పడక గదిలో మంచి సమయాన్ని కూడా గడపగలుగుతారు.


ఏళ్ళకు ఏళ్లుగా పెళ్లి కావట్లేదా.. ఇక్కడ అభిషేకం నిర్వహిస్తే మీ ఇంట బాజాభజంత్రీలు మోగుతాయట

వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి సైతం శ్రీ కేదారేశ్వర స్వామి వారి ఆలయాన్ని పోలినట్లు ఉండడం గమనించవచ్చు..చెంబుడు నీళ్లు పోస్తే చాలు కోరిన కోర్కేలు తీర్చే భోళాశంకరుడు… ఇక్కడ కొన్ని వందల సంవత్సరాలుగా పూజలందుకుంటున్నారు. ముఖ్యంగా పెళ్లికాని వారు ఇక్కడకు వచ్చి..భక్తి శ్రద్ధలతో ఆ కేదారేశ్వరుని పూజిస్తే వారికి వెంటనే మంచి జరుగుతుందని ప్రతీతి. అందుకే పెళ్లికాని యువతీ, యువకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఈ ఈశ్వరుడిని దర్శించుకుంటారట . కేదారేశ్వరస్వామి (కుమ్మరి గుడి) దేవాలయం..ఈ స్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామి వారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని, భక్తుల ప్రగాఢ విశ్వాసమని ఆలయ అర్చకులు అప్పాల భీమా శంకర శర్మ తెలిపారు. ఆలయ పూర్తి వివరాల లోకి వెళితే ... మన దేశం ఎన్నో సంస్కృతి సంప్రదాయాలకు నెలవు. మన దేశంలో ఉన్న ప్రతి ప్రసిద్ధ దేవాలయానికి ఓ చరిత్ర, ప్రాముఖ్యత, విశిష్ఠత ఉంటాయి. అలాగే, ఈ కేదారేశ్వరస్వామి వారికి మహిమాన్వితమైన శక్తులు ఉన్నాయని, ఇక్కడ పెళ్లి కాని వారు స్వామివారికి భక్తిశ్రద్ధలతో అభిషేకాలు చేస్తే పుణ్య ఫలంతో పాటు గండాలు తొలగి వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరి ఈ ఆలయం ఎక్కడ ఉందో చూద్దాం…రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఈ దేవాలయం కొలువై ఉంది. ఈ ఆలయం జైనుల కాలం నాటిదని…ఆ దేవాలయంపై దర్శనమిస్తున్న రాతి శిల్ప కళ చెప్పకనే చెబుతోంది. చాళుక్య రాజులు దీనిని కట్టించారు. ఈ ఆలయంలో లింగరూపేడైన కేదారేశ్వర స్వామి వారి లింగంపై బ్రహ్మ సూక్తం ఉంటుందని, అతి ప్రాచీన శివలింగాలపై మాత్రమే ఈ బ్రహ్మ సూక్తం ఉంటుందని అర్చక స్వాములు చెబుతున్నారు. కేదారేశ్వర ఆలయ మతి పురాతనమైన ఆలయమని, ఆలయ రాతి గోడలపై అనేక రకాల దివ్యమూర్తుల ప్రతిమలు చెక్కారు. ఈ ప్రతిమలు కళానైపుణ్యం చూస్తుంటే అబ్బురపడాల్సిందే. ఆలయం మొత్తం వివిధ దేవతామూర్తులతో కనివిందు చేస్తుంది. ఆలయానికి ఆనుకుని ఉన్న అతి పురాతన విగ్రహాలు చూస్తే జైనుల శిల్ప కళ మనకు దర్శనమిస్తోంది. స్వామివారి ఆలయ ప్రధాన ద్వారం వద్ద రాతితో చెక్కబడిన శిలాశాసనం కనువిందు చేస్తుంది. ఈ శాసనంపై శివలింగం, నంది, గోమాతలతో కలిగిన శాసనం ఉంది. స్వామివారి ఆలయానికి ఉత్తరాన విష్ణుమూర్తి, దక్షిణాన బ్రహ్మదేవుని విగ్రహాలు అత్యంత శోభాయమానంగా దర్శనమిస్తున్నాయి. ఆలయం మొత్తం రాతితో నిర్మించారు. ఆలయ గోపురంపై దేవ దేవుళ్ళ విగ్రహాలు, రథ చక్రాలు, నటరాజ విగ్రహం, నంది, అమ్మవార్ల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆలయ ఆవరణంలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది. ముందుగా ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం విశేషం. స్వామివారిని ప్రతిరోజు అధిక సంఖ్యలో స్థానిక భక్తులు దర్శించుకుంటారు. ప్రస్తుతం ఈ దేవాలయం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి అనుబంధంగా ఉంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు గతంలో ఈ ఆలయం తెలియకపోవడంతో భక్తుల తాకిడి తక్కువగానే ఉండేది. కానీ ప్రస్తుతం భక్తులకు తెలిసేలా స్థానిక ప్రజలు హిందూ సంఘాలు ఆలయ విశిష్టతను తెలియజేస్తున్నారు. మహా శివరాత్రి రోజు స్థానిక భక్తులు కేదారేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో దర్శించుకొని అభిషేక పూజలు నిర్వహిస్తున్నారని ఆలయ అర్చకులు తెలిపారు.


ముఖంపై ముడతలు నివారించే బెస్ట్ ఫేస్ ప్యాక్..!

ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వయసు పెరుగుతుంటే ముఖం పై ముడతలు రావడం మొదలౌతాయి. మన వయసు పెరుగుతోంది అనడానికి సంకేతం ఇది. అయితే దీనికి ప్రధాన కారణం సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలు. ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. గుడ్డు , నిమ్మకాయ: గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ చర్మం...


రామయ్య తండ్రి భద్రాద్రి లో వెలిసినట్లు మొదటగా చెప్పిన మహా భక్తురాలు ఎవరంటే ?

ఆలయాలలో భగవంతుడికి నిత్యం చేసే ఆరాధన సమయంలో ఐదు పాత్రలు వినియోగిస్తారు. వాటికి పంచపాత్రలని పేరు. ఇందులో తీర్థంతోనే స్వామికి పరిపూర్ణమైన ఆరాధన చేస్తారు. అర్ఘ్యపాత్ర, పాద్యపాత్ర. ఆచమనీయపాత్ర. స్నానపాత్ర. శుద్దోకపాత్రతో ఎలాగైతే ఆరాధన సమగ్రంగా ఉంటుందో అలాగే భద్రాద్రి రాముని ఆరాధనలో కూడా ఇంత పరిపుష్టం కావడానికి ఆ ఐదుగురు మహాభక్తుల పాత్రలు పంచపాత్రలుగా ఈ క్షేత్రంలో ప్రకాశిస్తున్నాయి. ఆ ఐదుగురే భద్రమహర్షి, పోకల దమ్మక్క భక్త రామదాసు, తానీషా, తూము...


Marriages: ఇవాళ్టి నుంచి మూఢం, పెళ్లిళ్లకు మూడు నెలలు ఆగాల్సిందే ఇక

Marriages: పెళ్లికాని అబ్బాయిలు లేదా అమ్మాయిలకు ఇది బ్యాడ్‌న్యూస్ ఇప్పటికే పెళ్లి ఆలస్యమైందని బాధపడుతుంటే మరో మూడు నెలలు ఆగక తప్పదు. మూఢం వచ్చేయడంతో పెళ్లిళ్లకు బ్రెక్ పడిపోయింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


Sunday Special Chicken Salna: రుచికరమైన చికెన్ సాల్నా ఇంట్లోనే సులభంగా తయారు చేయడం ఎలా.?

Sunday Special Chicken Salna: సండే వచ్చిందంటే చాలు అందరి ఇళ్లలో చికెన్, మటన్, చేపలు వండుకుంటారు. ఇది ఎన్నో రోజులుగా వస్తోన్న ఆనవాయితీ. ఎందుకంటే ఆరోజు ఎక్కువ శాతం మందికి సెలవు కావడం.


Almonds: బాదంపప్పు అసలైనదా..?.. నకిలీదా..? ఈ సింపుల్ టిప్స్ తో తెలుసుకోవచ్చు..

Almonds: చాలా మంది బాదంపప్పులను ఎంతో ఇష్టంతో తింటారు. కొందరు బాదాంను రాత్రిపూట నీళ్లలో నానబెట్టుకుని మరీ ఉదయంపూట తింటు ఉంటారు.


అచ్చం సింహం లాగానే గర్జిస్తున్న ఐదేళ్ల చిన్నారి.. వీడియో వైరల్

సాధారణంగా చిన్న పిల్లలు చాలా అల్లరి చేస్తూ జీవితాన్ని సంతోషంగా గడిపేస్తుంటారు. ఎప్పుడూ కుతూహలంగా ఉండే వీళ్లు వారి చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు. వివిధ శబ్దాలను వింటూ వాటిని ఇమిటేట్ చేయడానికి ట్రై చేయడం మీరు చూసే ఉంటారు. పిల్లలు జంతువుల శబ్దాలను కూడా ఇమిటేట్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అయితే ఒక చిన్నారి జంతువుల శబ్దాలను అనుకరించడంలో నైపుణ్యం సాధించింది. చూసేందుకు చాలా క్యూట్‌గా ఉన్న బాలిక అచ్చం సింహం (Lion) లానే గర్జించి...


5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..

5 Cooling Face masks: మండే ఎండలకు చల్లదనాన్నిచ్చే 5 కూలింగ్‌ ఫేస్ మాస్క్స్‌.. ముఖానికి రెట్టింపు మెరుపు..


పసుపుతో హెయిర్ కేర్.. జుట్టును బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి!

అందరి వంటిట్లో లభించే పసుపు (Turmeric) కేవలం వంటల్లో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విశేషమైన ఔషధ గుణాలు ఉన్న పసుపును ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది, చర్మానికి మెరుపును అందిస్తుంది. అంతేకాదు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. పసుపు జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును దూరంగా ఉంచుతుంది. హెయిర్...


మేలో తిరుమల వెళ్తున్నారా.. ఈ 7 ముఖ్యమైన తేదీలు గుర్తుపెట్టుకోండి, ఏ రోజున ఏం జరుగుతుందంటే

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వెంకటశ్వరుడి దర్శనానికి వెళ్లాలని చూస్తున్నారా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. ఏంటని అనుకుంటున్నారా? మే నెలలో అంటే వచ్చే నెలలో తిరుమలపై ముఖ్యమైన తేదీలు ఏంటివి? ఏ ఏ రోజున ఏం ప్రత్యేకత ఉంటుంది? మే నెలలో తిరుమలలో విశేష ఉత్సవాలు ఏంటివి? అనే అంశాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల వెళ్లే ప్లానింగ్‌లో ఉన్న వారు ⁠మే 3న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం ఉంటుందని గర్తించుకోవాలి. అలాగే ⁠మే 4న‌ సర్వ ఏకాదశి. చాలా మంది సర్వ ఏకాదశిని పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందువల్ల మీరు కూడా ఈ రోజున తిరుమల వెళ్లే ఆలోచనలో ఉంటే ముందుగానే అందుకు తగినట్లుగా ప్రణాళికలు వేసుకోవడం ఉత్తమం. ఇక ⁠మే 10న అక్షయ తృతీయ వచ్చింది. అందువల్ల ఈ రోజు కూడా చాలా పవిత్రమైనదని చాలా మంది అనుకుంటారు. అందువల్ల అక్షయ తృతీయ రోజున చాలా మంది తిరుమలకు వెళ్లే వారు ఉండొచ్చు. ఇంకా ఈ రోజున బంగారం కొంటే మంచిదని కొందరు భావిస్తారు. ⁠మే 12న శ్రీ భాష్యకారుల శాత్తుమొర, శ్రీ రామానుజ జయంతి, శ్రీ శంకర జయంతి వంటి ముఖ్యమైనవి ఉన్నాయి. అందువల్ల తిరుమల వెళ్లే వారు ఈ విషయాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. ⁠ఇక మే 17 నుంచి 19వ తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు నిర్వహిస్తారు. అందువల్ల మీరు ఈ అంశాన్ని కూడా గుర్తు పెట్టుకోవడం ఉత్తమం. మే 22న నృసింహ జ‌యంతి, త‌రిగొండ వెంగ‌మాంబ జ‌యంతి ఉంటుంది. అలాగే మే 23న శ్రీ అన్న‌మాచార్య జ‌యంతి, కూర్మ జ‌యంతి వచ్చాయి. కాగా ఏప్రిల్ 27న తిరుమలకు మొత్తంగా 81,212 మంది భక్తులు వచ్చారు. హుండీ ఆదాయం రూ. 2.88 కోట్లుగా ఉంది. వేసవి కాలం సెలవులు నేపథ్యంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే అంచనాకు రావొచ్చు. మరో వైపు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 16 నుండి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 15వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 7 నుండి 9 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి. కాగా నేడు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది, అంటే అది ఎటువంటి టోకెన్లు లేకుండా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్లి కంపార్ట్ మెంట్ లో వెయిట్ చేస్తున్న వారికి 12 గంటలు అని. ప్రస్తుతం కొత్తగా క్యూ లైన్లో కి వెళ్లేవారికి 15 నుంచి 18 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీ ని బట్టి సమయాలు మారుతాయి.


Today Horoscope: ఓ రాశివారికి వ్యాపారంలో అనుకోని నష్టాలు..

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. 28-4-2024, ఆదివారం మీ రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..) మేషం (అశ్విని భరణి కృత్తిక 1) నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) తారాధిపతి అశ్విని నక్షత్రం వారికి (జన్మతార)(జన్మతారాధిపతి రవి) అకారణంగా వచ్చే కోపాన్ని...


సాక్సులు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?

పౌడర్ రాసి సాక్సులు వేసుకోవడం వల్ల.. తొందరగా దుర్వాసన రాకుండా ఉంటుంది. చెమట కూడా పట్టకుండా ఉంటుంది. అప్పుడు ఆటోమెటిక్ గా వాసన రాదు. కాళ్లకు షూ వేసుకున్నప్పుడు తప్పకుండా మనం సాక్సులు వేసుకుంటాం. కానీ ఆ సాక్సులు ఉతికినా సరే కాసేపటికే చెమట కారణంగా దుర్వాసన వచ్చేస్తాయి. ఒక్కోసారి ఆ వాసన చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నలుగురిలో వెళ్లాలి అంటే పరువు కూడా పోతుంది. మేం శుభ్రంగానే ఉతుకుతున్నాం అయినా.. అలానే వాసన వస్తుంది అని చాలా మంది అంటూ ఉంటారు. అయితే.......


Red Garlic Chutney: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్‌ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.


Rice Powder Face Pack : ఈ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్.. మూడు రాత్రులు వాడండి.. చంద్రుడిలా చర్మం మెరిసిపోతుంది!

Rice Powder Face Pack : ముఖం అందంగా మెరిసిపోవాని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలి. అందుబో బియ్యం ఒకటి.


Non Veg: నాన్ వెజ్ అతిగా తింటున్నారా.. అయితే భారీ మూల్యం తప్పదంటున్న వైద్యులు..!

ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. అయితే కొంత మంది ఆహార ప్రియులు.. తమకు ఇష్టమైన మాంసాన్ని ఆరగిస్తారు.. అయితే తక్కువగా తినడం మంచిదే.. ఇష్టం కదా అని లాగిస్తే ఇక చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధిక మొత్తంలో ప్రాసెస్ చేసిన మాంసం, రెడ్ మీట్ తినడం పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. సాదారణంగా చికెన్, ఫిష్ వంటి ఇతర ప్రోటీన్ వనరులను తీసుకోవడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించదని అధ్యయనం చెపుతోంది. అయితే రెడ్ మీట్ తీసుకోవడం పరిమితం చేయడం మంచిది.. ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. అయితే ఎక్కువగా ప్రాసెస్ చేసిన మాంసాన్ని తినే వ్యక్తులకు పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం 20శాతం వరకు ఉంటుందంటున్నారు. అదే సమయంలో, రెడ్ మీట్ ఎక్కువగా తినే వారిలో, ఈ ప్రమాదం 9 శాతం పెరిగినట్లు వెల్లడించింది. అందుకే వీటికి బదులుగా తాజా కూరగాయలు, తృణ దాన్యాలు పండ్లు వంటి వాటిని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ఇవి డైట్ కంట్రోల్ గా కూడా ఉపయోగ పడతాయి. అలాగే ఎక్కువగా ఫ్రైడ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ను కూడా తీసుకోవద్దని చెబుతున్నారు. వీటిని ఒకే ఆయిల్ తో ఎక్కువ సార్లు తయారు చేస్తారు.. అలాగే వీటిని తయారు చెయ్యడానికి అనేక రకాల రంగులను కూడా వాడుతారు. దానివల్ల మన శరీరంలో కొవ్వు ఎక్కువగా పేరుకుపోతుంది.. మాంసాన్ని కూడా సమ్మర్ లో వీలైనంత తక్కువ తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. (గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం మరియు సూచనలు సాధారణ పరిజ్ఞానంపై ఆధారపడి ఉన్నాయి. స్థానిక 18 దానిని ఆమోదించదు. అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణులను సంప్రదించండి.)


Ullipaya Nilva Pachadi: ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఇలా చేసుకుంటే... ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ ,దోశ, అన్నంతో తినవచ్చు

Ullipaya Nilava Pachadi: నిల్వ పచ్చడి అనగానే మామిడికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలతో చేసేవే కాదు... ఉల్లిపాయతో కూడా చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీ చాలా సులువు.


'పిల్లల్ని కనకూడదని నిర్ణయించుకుంటే నన్ను పిచ్చిదానిలా చూశారు'

పిల్లలు వద్దనుకుంటున్న మహిళల సంఖ్య పెరుగుతోంది. అలాంటి మహిళలతో బీబీసీ మాట్లాడింది. వారు పిల్లలను కనకూడదని ఎందుకు నిర్ణయించుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసింది.


Venus Transit 2024: మే 19 నుంచి ఈ 3 రాశుల వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో జరగబోయేది ఇదే..

Venus Transit 2024: శుభగ్రహంగా పరిగణించే శుక్రుడు మేషరాశిలోకి మే 19వ తేదీన సంచారం చేయబోతున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది అలాగే కోరుకున్న కోరికలు సులభంగా నెరవేరేందుకు లక్ష్మీ అనుగ్రహం కూడా పొందుతారు.


మామిడి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే అదుర్స్ అంతే!

ఇది మామిడికాయల సీజన్. పుల్లటి మామిడితో చికెన్ ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు. దాని తయారీ విధానం చూద్దాం.


కాఫీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే...

కాఫీ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలివే...


Samantha: వెడ్డింగ్ గౌన్‌ రూపురేఖలు మార్చేసిన సమంత - ఆ విలువ తెలిసిందంటూ కామెంట్స్

Samantha Recycles Wedding Gown: ఎవరికైనా పెళ్లి డ్రెస్ అనేది చాలా స్పెషల్‌గా నిలిచిపోతుంది. సినీ సెలబ్రిటీలకు కూడా అంతే. అదే విధంగా తన పెళ్లికి వేసుకున్న గౌన్.. తనకు చాలా స్పెషల్ అని చెప్పకనే చెప్తోంది సమంత. హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా తనతో నాలుగేళ్లు కలిసి ఉన్న తర్వాత విడాకులు తీసుకుంది ఈ భామ. కానీ ఇప్పటికీ వారి పెళ్లిలో ధరించిన గౌన్ తనకు చాలా స్పెషల్ అనే ఉద్దేశ్యంతో దానిని రీసైకిల్ చేయించింది. దీంతో ఒకప్పుడు తన...


పేలు ఎక్కువగా ఉన్నాయా.. వీటిని రాయండి..

తలలో పేను ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. భరించలేనంతగా దురద ఉంటుంది. వీటిని దూరం చేసే కొన్ని ఇంటి చిట్కాల గురించి తెలుసుకోండి.


Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు

Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.


వేసవిలో పెదవుల పగుళ్లను నివారించే చిట్కాలు!

వేసవికాలంలో పెదవుల పగుళ్లు ఇబ్బంది పెడుతుంటాయి. దీనిని నివారించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.


సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు

సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు వేసవికాలంలో ఎండ తీవ్రత కారణంగా ఎక్కువమంది ఇంటికే పరిమితం అవుతారు. నోటికి రుచిగా ఎదో ఒకటి చేసుకొని తింటుంటారు. ఈ టైంలో ఫంక్షన్లు కూడా బానే జరుగుతుంటాయి. మాంసం ప్రియులు నాన్ వెజ్ వైపు చూసే పరిస్థితులు లేవు. కేజీ కోడి కూర ధర రోజురోజుకు ఆకాశానికి ఎగబాకుతుంది.  అందరూ ఇష్టపడే, ఎక్కువగా తి...


Money Astrology: ఏప్రిల్ 28 ధన జ్యోతిష్యం. వారికి కెరీర్ అవకాశాలు పెరుగుతాయి

(Bhoomika Kalam: భూమిక కలాం, అంతర్జాతీయ జ్యోతిష, టారో కార్డ్ నిపుణులు, ఆస్ట్రోభూమి ఫౌండర్, గ్లోబల్ పీస్ అవార్డు గ్రహీత) Money Astrology (ధన జ్యోతిషం): జ్యోతిష్యులు వివిధ అంశాల ఆధారంగా ఒక వ్యక్తికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనం ఆధారంగా వ్యక్తుల ఆర్థిక భవిష్యత్తును విశ్లేషిస్తుంటారు. జ్యోతిష్యం ప్రకారం.. ఏప్రిల్ 28వ తేదీ, ఆదివారం నాడు అన్ని రాశుల ధన జ్యోతిష్యం ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):ఫీల్డ్‌లో ఆశించిన రీతిలో పనితీరు మెయింటైన్ చేస్తారు. ఆర్థిక, వాణిజ్యపరమైన పనులు చేస్తారు. పూర్వీకులు, సంప్రదాయ వ్యాపారాలు ఊపందుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో సానుకూలత ఉంటుంది. అందరినీ కలుపుకొని వెళ్తారు. సంపద వృద్ధి చెందుతుంది. ఆర్థిక రంగం మెరుగుపడుతుంది. పరిహారం: రామాలయంలో జెండా సమర్పించండి. వృషభం (Taurus):అన్ని రంగాల్లోనూ ఎఫెక్టివ్‌గా పని చేస్తారు. ధైర్యం చురుకుదనాన్ని, అవగాహనను పెంచుతుంది. ఆర్థిక, వాణిజ్య రంగంలో విశిష్టమైన పనులు చేయాలనే ఆలోచన ఉంటుంది. ఫలితాలు ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటాయి. మంచి ఆఫర్లను అందుకుంటారు. సామరస్య వాతావరణం ఉంటుంది. మీ ప్లాన్లకు బలం చేకూరుతుంది. పరిహారం- సరస్వతి అమ్మవారికి తెల్లటి పూల మాల సమర్పించండి. మిథునం (Gemini):ఓర్పు, నమ్మకంతో ముందుకు సాగుతారు. పనిలో అత్యాశ, ప్రలోభాలకు గురికావద్దు. ఆర్థిక ప్రయత్నాలలో జాగ్రత్త పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారంపై దృష్టి సారిస్తారు. దేంట్లోనూ తొందరపాటు చూపరు. రిస్క్ ఉండే పనులకు దూరంగా ఉంటారు. ప్లాన్ల అమలును పెంచుతారు. పరిహారం: ఎర్రటి ఆవుకు బెల్లం తినిపించండి. కర్కాటకం (Cancer):లక్ష్య సాధనలో విజయం సాధిస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. సంపద వృద్ధి చెందుతుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు పెరుగుతాయి. ఆఫీసర్ క్లాస్ వ్యక్తులు సంతోషంగా ఉంటారు. ఆశించిన ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు మెరుగుపడతాయి. మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. పరిహారం: సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనె దీపం వెలిగించండి. సింహం (Leo):కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసి, పనులు మేనేజ్ చేయండి. కమర్షియల్ పనుల్లో వేగం ప్రదర్శిస్తారు. యాక్షన్ ప్లాన్స్ ఊపందుకుంటాయి. మీ ప్రతిభ, పనితీరు మెరుగుపడుతుంది. పనిలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యక్తిగత విషయాలపై దృష్టి సారిస్తారు. సహోద్యోగులతో సమన్వయం పెరుగుతుంది. పరిహారం: శివునికి నీటిని సమర్పించండి. కన్య (Virgo):వృత్తి, వ్యాపారాల్లో సుఖంగా ఉంటారు. వృత్తి నిపుణులకు మంచి ఆఫర్లు లభిస్తాయి. లాభం, విస్తరణపై దృష్టి పెడతారు. పరిశ్రమ ఉత్పత్తులు మెరుగుపడటం కొనసాగుతుంది. ప్రతి ఒక్కరూ మీ యాక్టివిటీతో ప్రభావితమవుతారు. వివిధ రంగాల్లో శుభం ఉంటుంది. పరిహారం: హనుమంతోని గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. తుల (Libra):ఆఫీస్‌లో అవగాహన, వినయంతో పని పూర్తి చేస్తారు. పరిస్థితులపై నియంత్రణ కొనసాగిస్తారు. ఉద్యోగ వ్యాపారం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరించే ప్రణాళికలపై దృష్టి సారిస్తారు. రిసెర్చ్ పనులపై ఆసక్తి చూపుతారు. అనుభవజ్ఞులతో సహవాసాన్ని పెంచుకోండి. సలహాదారులతో సన్నిహితంగా ఉండండి. పరిహారం: నల్ల కుక్కకు ఏదైనా తీపి పదార్థం ఇవ్వండి. వృశ్చికం (Scorpio):యాక్షన్ ప్లాన్స్ ముందుకు తీసుకెళ్తారు. టైమ్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారిస్తారు. దురాశ, ప్రలోభాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఆర్థిక విషయాలపై నియంత్రణ పెరుగుతుంది. పనిలో అవగాహన పెరుగుతుంది. వర్క్‌లో ఓర్పు ప్రదర్శిస్తారు, అప్రమత్తంగా ఉంటారు. అతిగా ఉత్సాహం చూపకూడదు. పరిహారం: పేదవారికి తెల్లటి వస్తువులు దానం చేయండి. ధనస్సు (Sagittarius):పనుల్లో వేగం ఉంటుంది. కొత్త ప్లాన్లు రూపుదిద్దుకుంటాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. వ్యాపారం బలంగా ఉంటుంది. మెరుగైన వేగంతో ముందుకు సాగుతారు. మీరు అన్నింట్లోనూ విజయాన్ని పొందుతారు. చాలా కేసులు అనుకూలంగా ఉంటాయి. మీ ప్రభావం పెరుగుతూనే ఉంటుంది. పరిహారం- పిండి, పంచదార కలిపి చీమలకు ఆహారంగా వేయండి. మకరం (Capricorn):ప్రొడక్టివ్ పనుల పట్ల మొగ్గు పెరుగుతుంది. ఉమ్మడి పనుల్లో ముందుంటారు. సమయం అనుకూలంగా ఉంటుంది. తీవ్రమైన విషయాలపై ఆసక్తి ఉంటుంది. స్థిరత్వానికి ప్రాధాన్యత ఇస్తారు. విజయ స్ఫూర్తితో పనులు చేస్తారు. వృత్తిపరమైన పనుల్లో మంచి పనితీరు కనబరుస్తారు. పరిహారం: పక్షికి ఆహారం ఇవ్వండి. కుంభం (Aquarius):ఆర్థిక విషయాల్లో వేగాన్ని కొనసాగిస్తారు. సానుకూల సమయంలో మంచి ప్రయోజనాన్ని పొందుతారు. వృత్తిపరమైన ప్రయత్నాలను కొనసాగిస్తారు. ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి లాభం పొందే మార్గం తెరచుకుంటుంది. కాంటాక్ట్ కమ్యూనికేషన్ మెరుగ్గా ఉంటుంది. ధైర్యం, బలం పెరుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో పనులను వేగవంతం చేస్తారు. పరిహారం: శారీరక వికలాంగులకు సేవ చేయండి. మీనం (Pisces):ఆఫీస్‌లో లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేస్తారు. ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. కెరీర్ అవకాశాలు పెరుగుతాయి, తప్పకుండా ముందుకు వెళ్తారు. విజయ భావం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారంలో మెరుగ్గా రాణిస్తారు. ప్రతిచోటా శుభ ఫలితాలతో మంచి కమ్యూనికేషన్ ఉంటుంది. పోటీ భావం పెరుగుతుంది. పరిహారం: దుర్గ గుడిలో నెయ్యి దీపం వెలిగించండి. Disclaimer:ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఈ రాశుల వారు వెన్నుపోటు పొడుస్తారు.. వీరితో జర జాగ్రత్త..

జ్యోతిషశాస్త్రం ప్రకారం.. మన రాశి చక్రానికి, వ్యక్తిత్వానికి మధ్య సంబంధం ఉంది. జ్యోతిష్యం ప్రకారం.. కొన్ని రాశుల వారిని నమ్మడానికి లేదు. వీరిని నమ్మితే వెనుపోటు పొడిచేసి వెళ్లిపోతారు. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరంటే? జ్యోతిషశాస్త్రం మనకు సంబంధించిన ఎన్నో విషయాలను చెబుతుంది. జ్యోతిష్య శాస్త్రం మన భవిష్యత్తులో ఏం జరగబోతోందో అంచనా వేయడానికి ఎంతగానో సహాయపడుతుంది. అందుకే హిందువులు జ్యోతిష్య శాస్త్రాన్ని బాగా నమ్ముతారు. ఇది ప్రతి రాశి స్వభావం, వ్యక్తిత్వం...


Gajakesari Yoga 2024: గజకేసరి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది.. ధన లాభాలే లాభాలు!

Gajakesari Yoga 2024 In Telugu: మే మొదటి వారంలో ఎంతో శక్తివంతమైన గజకేసరి యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఈ క్రింది రాశుల వారికి విపరీతమైన ధన లాభాలతో పాటు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి విముక్తి లభించే అవకాశాలు కూడా ఉన్నాయి.


వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ...

వడదెబ్బ ముప్పు!.. తీసుకోవాల్సిన జాగ్రత్తలివీ... రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది ఇండ్లకే పరిమితమవుతున్నారు. అయితే ఇంట్లో ఉన్నప్పటికీ, తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సి...


Grah Gochar 2024: మే నెలలో ఈ రాశులకు లాటరీ తగులుతుంది.. పట్టిందల్లా బంగారం..!

మే 2024 ప్రారంభం కావడానికి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉన్నందున, గురు , శుక్రుడు సహా 4 ప్రధాన గ్రహాల సంకేతాలు మారబోతున్నాయి. బృహస్పతి వృషభరాశిలో, బుధుడు మేషరాశిలో, సూర్యుడు వృషభరాశిలో, శుక్రుడు వృషభరాశిలో సంచరిస్తారు. ఈ 4 ప్రధాన గ్రహాల సంచారం కారణంగా, తులారాశితో సహా 5 రాశిచక్రాల వ్యక్తులు లాటరీని గెలుచుకోవచ్చు . వారి సంవృత అదృష్టాలు తెరవబడతాయి. ఈ ప్రధాన గ్రహాల శుభ ప్రభావం కారణంగా, ఈ రాశిచక్రం యొక్క స్థానికుల జీవితంలో ఆహ్లాదకరమైన మరియు సానుకూల మార్పులు ఉంటాయి. తిరుపతి జ్యోతిష్య పండితులు డా. కృష్ణ కుమార్ భార్గవ ప్రకారం, మే 1 మధ్యాహ్నం 01:50 గంటలకు బృహస్పతి వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. మే 10, 07:03 (సాయంత్రం) బుధుడు మేషరాశిలోకి మారతాడు. మే 14 సాయంత్రం 06:04 గంటలకు గ్రహాల పాలకుడు సూర్యుడు వృషభ రాశిలోకి సంచరిస్తాడు. మే 19 ఉదయం 08:51 గంటలకు శుక్రుడు వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహ సంచారం వల్ల ఏ 5 రాశుల వారు ప్రయోజనం పొందగలరో తెలుసుకోండి. మేషం: మేలో 4 ప్రధాన గ్రహాల సంచారం కారణంగా, మీ రాశి స్థానికులు వారి జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులను చూస్తారు. ఉద్యోగాలు , వ్యాపారాలలో పని చేసే వ్యక్తులు విజయం సాధిస్తారు. మీరు ఏ పనిని ఎంచుకున్నా, అందులో విజయం సాధించవచ్చు. మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి కొత్త వనరులను అభివృద్ధి చేస్తారు, తద్వారా మీరు విజయం సాధించగలరు. ఉద్యోగులు ర్యాంక్ మరియు హోదాలో ప్రమోషన్ పొందవచ్చు లేదా వారు కొత్త ఉద్యోగ ప్రతిపాదనను పొందవచ్చు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఈ నెల మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుందని అనిపిస్తుంది. వృషభం: శుక్ర, గురు, బుధ, సూర్య రాశుల మార్పులు మిమ్మల్ని ధనవంతులను చేస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఆర్థిక స్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. మీరు గతంలో కంటే ఎక్కువ ఆదా చేయవచ్చు. ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా ఉండవచ్చు. వర్కింగ్ వ్యక్తులు కొత్త ఉద్యోగాల కోసం ఆఫర్‌లను పొందవచ్చు, ఎందుకంటే కెరీర్ కోణం నుండి సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వారు కొత్త భాగస్వామిని పొందవచ్చు లేదా మీరు కొన్ని కొత్త ఆలోచనలపై పని చేయవచ్చు, ఇది మీ ముందుకు వెళ్లే మార్గాన్ని సులభతరం చేస్తుంది. సింహం: మీ రాశికి బంగారు కాలం రాబోతున్నందున ఈ 4 ప్రధాన గ్రహ మార్పులు మీకు లాటరీ లాగా ఉంటాయి. మీ కెరీర్ కొత్త శిఖరాలకు చేరుకుంటుంది, ఎందుకంటే మీరు కొన్ని బంగారు అవకాశాలను పొందుతారు, వీటిని మీరు మిస్ చేయకూడదు. పనిలో మీ ప్రభావం , కీర్తి కూడా పెరుగుతుంది. ఈ సమయంలో, మీరు ఆస్తిలో పెట్టుబడి పెట్టవచ్చు లేదా పాత పెట్టుబడుల నుండి గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. మకరం: శుక్రుడు, గురు, బుధుడు మరియు సూర్యుని యొక్క మంచి ప్రభావాలు మీ జీవితంలో చూడవచ్చు. ఈ గ్రహ రాశి మార్పు వృత్తికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో ఉన్న వారికి కొన్ని శుభవార్తలు అందుతాయి. చాలా కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి విజయం లభిస్తుంది. ఈ నెల మీకు విజయాన్ని అందించబోతోంది. మీ ప్రయత్నాలను సడలించవద్దు. మీరు డబ్బు సంపాదించడానికి కొన్ని కొత్త పనిని ప్రారంభించవచ్చు.


ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్

ముసలావిడే కానీ మహానుభావురాలు.. 60ఏళ్ల వయసులో ఇంత అందంతో.. మిస్ యూనివర్సస్ ఏజ్ ఈస్ ఏ జస్ట్ నెంబర్ అనే మాటని నిజం చేశారు ఓ అరవై ఏళ్ల మహిళ. అర్జెంటీనాకి చెందిన అలెజండ్రా మరిసా రోడ్రిగ్వెజ్ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలో పాల్గొనడమే కాకుండా ఆ టైటిల్‌నీ గెలుచుకుంది. అర్జెంటీనాలోని బ్యునెస్ ఎయిర్స్ లో జరిగిన ఈ అందాల ప...


Pee Stain Denim: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. మూత్రం పోసుకున్నట్లుగా ఉండే ఈ ప్యాంట్ ధర రూ.67,600

Pee Stain Denim: రోజురోజుకూ ట్రెండ్ మారిపోతూ ఉంటోంది. ప్రస్తుతం ఉన్న ట్రెండీ, ఫ్యాషన్ దుస్తులు కొన్ని రోజుల్లోనే పాతవి అయిపోతాయి. మార్కెట్లో రోజుకో ఫ్యాషన్ దర్శనమిస్తోంది. అయితే ఈ ప్యాంటును చూస్తే మాత్రం ఇదేం ఫ్యాషన్‌ రా బాబు అంటూ తలలు పట్టుకుంటారు. ఎందుకంటే మనం మూత్రం పోసుకుంటే ఎలా ఉంటుందో ఈ ప్యాంటు డిజైన్ కూడా అదే రకంగా ఉంటుంది. దాని ధర అక్షరాలా రూ.67,600. ఇంతకీ అది ఏ ప్యాంటో.. ఎలా ఉందో మీరు కూడా చూసేయండి.


పొట్టి బట్టల్లో ఊపేసిన వితిక

వితిక షెరు సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తుంటుంది. యూట్యూబ్ చానెల్, ఇన్ స్టాగ్రాంలో వితిక ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.


కొబ్బరి నీళ్లు ఎప్పుడు తాగొద్దో తెలుసా?

సాధారణంగా కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి మన దాహాన్ని తీర్చడమే కాకుండా.. మనల్ని ఆరోగ్యంగా కూడా ఉంచుతాయి. కానీ కొన్ని సమయాల్లో కొబ్బరి నీళ్లను అస్సలు తాగకూడదు. చాలా మందికి కొబ్బరి నీళ్లను రెగ్యులర్ గా తాగే అలవాటు ఉంటుంది. ఇక కొంతమంది ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఉదయాన్నే కొబ్బరి నీళ్లను తాగుతుంటారు. ఈ అలవాటు మీ శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తుంది. అయితే అందరికీ కొబ్బరి నీళ్లు ప్రయోజనకరంగా ఉండవు తెలుసా? ఆరోగ్య...


మూత్రంలో మంట ఎందుకొస్తుంది?

చాలా మందికి మూత్రంలో విపరీతమైన మంట వస్తుంటుంది. ముఖ్యంగా ఆడవాళ్లకే ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అసలు మూత్రంలో మంట ఎందుకొస్తుందో తెలుసా? మూత్ర విసర్జన చేసే సమయంలో మంట వచ్చే సమస్యను డైసూరియా అంటారు. ఈ సమస్య ఎక్కువగా పేలవమైన జీవనశైలి, చెడు ఆహారాల వల్ల వస్తుంది. దీనివల్ల మూత్ర విసర్జన చేసేటప్పుడు భరించలేని మంట కలుగుతుంది. మీకు చాలా కాలంగా ఈ సమస్య ఉన్నట్టైతే దానిని అస్సలు లైట్ తీసుకోకండి. అసలు మూత్రంలో మంట ఎందుకు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి....


ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు

ఇంట్లో ఉన్నా వడదెబ్బ ముప్పు!.. ఎండలతో పెరుగుతున్న రూమ్ టెంపరేచర్లు సాధారణంగా 26–28 డిగ్రీలు ఉండాల్సింది.. 38–40 డిగ్రీలు నమోదు ఇంట్లో ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్ల సూచన హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరువయ్యాయి. ఎండల భయంతో బయట అడుగుపెట్టాలంటేనే జనం జంకుతున్నారు. దీంతో చాలామంది...


Today Panchangam 28 April 2024 ఈరోజు మూలా నక్షత్రం వేళ శుభ ముహుర్తం, రాహుకాలం ఎప్పుడొచ్చాయంటే...

today telugu panchangam తెలుగు పంచాంగం ప్రకారం, ఛైత్ర మాసంలోని చతుర్థి తిథి నాడు, ఆదివారం ఈరోజున రాహుకాలం, దుర్ముహుర్తం, సూర్యోదయం, సూర్యాస్తమయంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాల గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...


ఇంటిని చల్లగా ఉంచే ఇండోర్ ప్లాంట్స్‌!

ఎండలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఉక్కబోతతో ప్రతి ఒక్కరూ సతమతమవుతున్నారు. ఇటువంటి టైంలో ఇంటి టెంపరేచర్‌ను తగ్గించే ఇండోర్ ప్లాంట్స్‌ ఇవే.


ఎండాకాలంలో రోజూ పుచ్చకాయను తింటే ఏమౌతుందో తెలుసా?

ఈ సమ్మర్ సీజన్ లో పుచ్చకాయలు పుష్కలంగా లభిస్తాయి. ఈ పండు టేస్టీగా ఉండటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మరి ఈ పండును రోజూ తింటే ఏమౌతుందో తెలుసా? పుచ్చకాయలో 95% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. అందుకే ఎండాకాలంలో పుచ్చకాయను తింటే శరీరం డీహైడ్రేట్ అయ్యే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. పుచ్చకాయలో అమైనో యాసిడ్ 'సిట్రులిన్' పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పుచ్చకాయలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ...


మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి

మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి మీరు ఏ విషయాన్నీగుర్తుంచుకోలేకపోతున్నారా..ఏకాగ్రత కుదరడం లేదా..? చిరాకుగా ఉంటుందా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారా? మీరు తార్కికంగా ఆలోచించే, నిర్ణయాలు తీసుకోలేక పోతున్నారా.. అయితే ఇవన్నీ మీకై మీరు కొని తెచ్చుకున్నవే..అదెలా అంటే..మనకున్న కొన్ని అలవాట్లే ఈ దుష్ఫలితాలను పెం చి పోషిస్తాయి. ఈ దుష్...


చేతులపై ట్యాన్ తొలగించే సింపుల్ చిట్కాలు!

ఎండ, దుమ్ము, ధూళి వల్ల చర్మంపై ట్యాన్ ఏర్పడుతుంది. దీనివల్ల ఆ ప్రాంతం నల్లగా మారుతుంది. దీనిని నివారించేందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.


Summer tips : ఎండల వల్ల పిల్లల్లో అనారోగ్యం.. వారిని రక్షించడానికి తల్లిదండ్రులు ఏం చేయాలంటే..

Summer care for children : వేసవికాలం వచ్చేసింది. రోజురోజుకీ ఎండలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఒకపక్క పెద్దలే ఎండ వేడికి తట్టుకోలేకపోతుంటే.. చిన్నపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటోంది. వేసవికాలంలో కూడా వారు అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. కానీ మనం కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల.. చిన్న పిల్లలను వేసవికాలంలో ఈ ఎండల నుంచి సురక్షితంగా ఉంచొచ్చు.


Steaming Vegetables: పొరపాటున కూడా ఈ కూరగాయలను ఉడికించి తినకండి లేకుంటే..

Disadvantages Of Steaming Vegetables: ఆకుకూరలు, కూరగాయలు , పండ్లు ఆరోగ్యానికి ఏంతో మేలు చేస్తాయి. కానీ కొన్ని చాలా మంది ఉడికించ ఆహారపదార్థాలను తీసుకుంటారు. దీనిని వల్ల బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.