Trending:


Urine In Night : రాత్రిపూట ఎక్కువగా మూత్రవిసర్జన చేయడం తేలికగా తీసుకోవద్దు

Urination In Night Time : రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేయడం అనే విషయాన్ని ఈజీగా తీసుకోవద్దు. కొన్ని రకాల సమస్యలు ఉంటేనే ఇలా అవుతుంది.


ఈ మామిడి చెట్టుకు ఆకులు కన్నా కాయలు ఎక్కువ

ఆ ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది మామిడి పంట ఆలస్యం పేరుతో ఎక్కడ మామిడి పండ్లు అనేవి కనిపించడం లేదు. కొన్నిచోట్ల మాత్రం మామిడి పండ్లు గదిలో మగ్గవేసి జాతీయ రహదారుల పక్కన అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్నిచోట్ల మామిడి మొక్కలకు తెగులు వచ్చిన పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా ఒకే ఒక్కడు అన్నట్టుగా ఒకే ఒక్కమొక్క మామిడి కాయలు ఆ ఉమ్మడి జిల్లాలో విరగాస్తోంది. చెట్టుకు ఆకులు తక్కువ మామిడికాయలు ఎక్కువనే విధంగా ఆ చెట్టు కనిపిస్తుంది. ఇంతకీ ఆ మామిడి చెట్టు ఎక్కడుంది ఆ విశేషాలు ఏంటి ఒకసారి చూద్దాం.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు అంటేనే మామిడి పంటలకు ప్రసిద్ధిని చెప్పుకోవచ్చు. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా రైతులు మామిడి పంటను పండిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉంటారు. ఇందులో రైతులు కౌలు రైతులు రెండు రకాలుగా ఉంటారు. దాదాపు కొన్ని ఎకరాలు కౌలుకు తీసుకుని ఏడాది పోడుగునా ఆ మామిడి కాయలు పండిస్తూ వాటిలో వచ్చే రూపాయి పాపాయితో జీవనం కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ చివరకు వస్తున్నప్పటికీ మామిడిపండ్ల జాడలేదు. కొన్ని చెట్లకు కాయలు ఉండడం మరికొన్ని చెట్లకు ఇప్పుడే పూత వస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు భిన్నంగా కాకినాడ జిల్లా రౌతులపూడి కోటనందూరు రహదారిలో ఒకే ఒక్కడన్న విధంగా ఒకే ఒక చెట్టుకు వేలాదిగా మామిడికాయలు దర్శనమిస్తున్నాయి. అయితే అవి పంచదార కంచి మామిడిగా స్థానికులు పేర్కొంటున్నారు. రోడ్డుపై వెళ్తున్న ప్రతి ఒక్కరికి ఈ మామిడి చెట్టు ప్రత్యేక అట్రాక్షన్ గా కనిపిస్తుంది. చెట్టు నిండా అధికంగా కాయలు ఉండడంతో ప్రతి ఒక్కరు ఆ ప్రాంతంలో ఒకసారి ఆగి ఆ చెట్టు కింద ఉన్న చల్లదనంలో సేద తీరుతూ ఆ మామిడి కాయలను కనులారా చూస్తూ ఉత్సాహంగా గడుపుతున్నారు. చుట్టుపక్కల అనేక చెట్లు ఉన్నప్పటికీ ఈ ఒక్క చెట్టుకే అన్నివేళల్లో కాయలు ఎందుకు కాస్తున్నాయన్నది రైతు కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏదిఏమైనా ఈ కాయలు పళ్ళు అయ్యే వరకు ఉంటే ఫరవాలేదు. మధ్యలో ఈ వేసవి వేడికి ఉడికిపోయి రాలిపోయాయి. మరి ఏమి చేయలేమంటూ రైతులు పేర్కొంటున్నారు. మామిడికాయ జాతులనే పంచదార కంచె అనేది అరుదుగా ఉంటుంది. కొన్ని కొన్ని కాయలు తీపి మరికొన్ని మాత్రం తీపి పులుపు మిక్స్ అయి ఉంటుంది. దీని రేటు కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం పచ్చిగా రౌండ్ గా ఉన్న ఈ కాయలు ఏ మేరకు రైతుకు ఉపయోగపడతాయో చూడాల్సిందే.


Benefits Of Raw Banana: పచ్చి అరటిపండ్లతో కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..!

Raw Banana Nutrition: పచ్చి అరటిపండ్లు భారతదేశంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆహారం. వీటిని వేయించి, ఉడికించి, కూరగా, స్నాక్స్ గా, డెజర్ట్ గా అనేక రకాలుగా తింటారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆరోగ్యానికి ఇవి ఎలా సహయపడుతాయి అనేది మనం తెలుసుకుందాం.


Smartphone: ఇలా చేస్తే మీ పిల్లలు అస్సలు ఫోన్ ముట్టుకోరు..

ప్రతి నివాసంలో చిన్నారులు సెల్ ఫోన్ పట్టుకుని గేములు ఆడటం చూస్తుంటాం. ఈ తరహా అనేది నివాసాల్లో ఎక్కువ అవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏదో ఒక అలవాటు చేస్తే తప్ప ఆ సెల్‌ఫోన్ గేమ్స్ వదలరని తెలుసు. అయితే ఆ ఉమ్మడి జిల్లాలో ఒక మ్యూజిక్ సంస్థ ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పబ్లిక్ ప్రాంతాలలో ఈ విషయాన్ని పూర్తిస్థాయిలో తీసుకు వెళ్తూ విద్యార్థులను ఆహా మనం కూడా ఈ కీబోర్డ్ నేర్చుకుంటే బాగుండేది అని ఆలోచింప చేసేలా ఒక చక్కని మ్యూజికల్...


పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?

పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి? వేసవి కాలంలో వచ్చిందంటే సమృద్ధిగా దొరికేవి పుచ్చకాయలు.ఎండ వేడిమి సీజన్ లో చల్లదనాన్ని ఇస్తాయి. రీఫ్రెషింగ్, రుచికోసం తింటుంటాం. పుచ్చకాయలో విట మిన్ సీ, ఏ పుష్కలంగా ఉంటాయి.కొన్ని రకాల పుచ్చకాయలు క్యాన్సర్, గుండె సంబంధిత జబ్బులనుంచి రక్షించే శక్తివంతమైన ఆంటీక్సీడెంట్లను కలిగి ఉంటా యి. నీటి శాతం...


పప్పులని ఇలా వండి తింటే పోషకాలు ఎక్కువగా అందుతాయట..

పప్పుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని ఎలా తింటే మంచిదో తెలుసుకోండి.


Life Style: మీరు కుబుసం వీడుతున్నారా లేదా!

హడావిడి మోడ్రన్ లైఫ్ లో మనసుకు ఉల్లాసమనేదే లేకుండా జీవితాలు మోనోటోనస్ గా మారుతున్నాయి. ఇందువల్ల నిర్లిప్తత, యాంగ్జైటీ, రకరకాల నెగెటివ్ ఆలోచనలు, డిప్రెషన్ లో కూరుకుపోతున్నారు. ఈ ఒత్తిడిని అధిగమించి, అనవసరపు ఆలోచనల కుబుసాన్ని వదిలించుకొని, కొత్త ఆలోచనలతో ఉల్లాసంగా ఉంటూ, పనిలో ప్రొడక్టివిటీని పెంపొందిచుకోవటానికి కొన్ని ఎఫెక్టివ్ ఉపాయాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి. మీ మైండ్ లో ఏముందో పేపర్ మీద రాయండి ఊపిరాడనీయకుండా వచ్చే ఆలోచనలు, టెన్షన్స్, భయాలు...


Buttermilk: వేసవి కాలంలో మానవుల అమృతం..మజ్జిగ వల్ల ప్రయోజనాలేంటో తెలుసా?

Benefits Of Buttermilk: వేసవి కాలంలో అలసట, నీరసం రావడం సాధారణమే. అయితే శరీరంలో నీరు శాతం తగ్గినప్పుడే ఇలాంటి సమస్యలను ఎదురవుతాయనేది అందరికి తెలిసిన విషయమే! అలాంటి సందర్భాల్లో తక్షణ శక్తి కోసం మన వివిధ రకాల పానీయాలను స్వీకరిస్తుంటాం. అయితే వేసవిలో భూలోకంలో దొరికే అమృతం మజ్జిగ గురించి మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.


Red Garlic Chutney: సౌత్‌ ఇండియన్ స్టైల్‌ ఎర్రని వెల్లుల్లి పచ్చడి.. ఇలా చేస్తే రుచి అద్భుతం..!

Red Garlic Chutney: సాధారణంగా మన టిఫిన్లు, రైస్‌లోకి కొబ్బరి చట్నీ తయారు చేసుకుంటాం. మన సౌత్‌ లో ఇది ఎంతో ఫెమస్, దోశ, ఇడ్లిలోకి రుచి అద్బుతంగా ఉంటుంది.


Akshaya Tritiya 2024 మీ రాశి ప్రకారం, అక్షయ తృతీయ వేళ వీటిని దానం చేస్తే.. మీ ఇంట కనకవర్షం కురుస్తుందట..!

Akshaya Tritiya 2024 అక్షయ తృతీయ అంటే అందరికీ గుర్తొచ్చేది బంగారంతో పాటు ఖరీదైన వస్తువులే.. వీటినే ఎక్కువగా కొంటూ ఉంటారు. అయితే కేవలం కొనడం వరకే కాదు.. కొన్ని వస్తువులను తప్పనిసరిగా దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతిష్యం ప్రకారం, 12 రాశుల వారు ఏమి దానం చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...


పసుపుతో హెయిర్ కేర్.. జుట్టును బలంగా ఎలా మార్చుకోవాలో తెలుసుకోండి!

అందరి వంటిట్లో లభించే పసుపు (Turmeric) కేవలం వంటల్లో వాడే మసాలా దినుసు మాత్రమే కాదు. దీనితో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. విశేషమైన ఔషధ గుణాలు ఉన్న పసుపును ఆయుర్వేద వైద్యంలో శతాబ్దాలుగా వినియోగిస్తున్నారు. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది, చర్మానికి మెరుపును అందిస్తుంది. అంతేకాదు జుట్టుకు కూడా అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. పసుపు జుట్టు పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. చుండ్రును దూరంగా ఉంచుతుంది. హెయిర్...


Ullipaya Nilva Pachadi: ఉల్లిపాయ నిల్వ పచ్చడి ఇలా చేసుకుంటే... ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇడ్లీ ,దోశ, అన్నంతో తినవచ్చు

Ullipaya Nilava Pachadi: నిల్వ పచ్చడి అనగానే మామిడికాయలు, ఉసిరికాయలు, నిమ్మకాయలతో చేసేవే కాదు... ఉల్లిపాయతో కూడా చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయ నిల్వ పచ్చడి రెసిపీ చాలా సులువు.


మీ కలలను సాకారం చేసుకోండిలా!

ప్రతి ఒక్కరికీ జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే కల ఉంటుంది. ఆ కలలను సాకారం చేసుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. మీ కలలను సాకారం చేసుకునేందుకు ఈ టిప్స్‌ ఫాలో అయితే మంచిది.


జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల

జనం మెచ్చిన కర్రీలు: కీమా ఫస్ట్..పప్పు లాస్ట్..ప్రపంచ ర్యాకింగ్స్ విడుదల కీమా అంటే ఏమిటో దాని రుచి ఎలాంటి దాదాపు భారీతీయులకు తెలుసు. ప్రఖ్యాత భారతీయ  వంటకాల్లో ఇదొకటి. ప్రపంచ వ్యాప్తంగా వంటకాలను గుర్తించి వాటికి ర్యాంకింగ్స్ ఇచ్చే వంటల గైడ్ బెస్ట్ అట్లాస్ తాజా ర్యాంకింగ్ లలో 9 భారతీయ వంటకాలతో ప్రపంచంలోని అత్యుత్తమ వంటకాల లిస్ట్ ను ప్రకటించింది. ఇంద...


Rice Powder Face Pack : ఈ రైస్ పౌడర్ ఫేస్ ప్యాక్.. మూడు రాత్రులు వాడండి.. చంద్రుడిలా చర్మం మెరిసిపోతుంది!

Rice Powder Face Pack : ముఖం అందంగా మెరిసిపోవాని అందరూ కోరుకుంటారు. ఇందుకోసం సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించాలి. అందుబో బియ్యం ఒకటి.


ఈ నంబర్స్ లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఉందా.. అయితే జనం మీ గురించి ఏమనుకుంటారో తెలుసుకోవచ్చు

Numerology: న్యూమరాలజీ అనేది పురాతన నమ్మకం. ఇది వారి పుట్టిన తేదీ ఆధారంగా వారి లక్షణాలు , ధోరణులను అంచనా వేయగలదు. ప్రతి వ్యక్తి పుట్టినరోజును సంగ్రహించడం ద్వారా సంబంధిత సంఖ్యలు కనుగొనబడతాయి. ఉదాహరణకు ఒకరి పుట్టినరోజు 25 అని అనుకుందాం. అతని పుట్టినరోజుల మొత్తం 7.జీవితంలో అహంకారం, అతి విశ్వాసం ఉన్న వారి పుట్టిన తేదీని చూద్దాం. ఎప్పుడూ రాజుల్లా ప్రవర్తించే వారు. వారెవరో చూద్దాం. Number 3: 3, 12, 21, 30 తేదీలలో జన్మించిన వ్యక్తులు తరచుగా తమను తాము నిరూపించుకోవడానికి ఎదుటి వాళ్ల దృష్టిని ఆకర్షించడానికి తమను తాము వ్యక్తం చేస్తారు. వారిని లెవలేట్ చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే వారి అహంకారం బయటపడుతుంది. Number 9: 9, 18, 27 తేదీలలో జన్మించిన వ్యక్తులు ఎల్లప్పుడూ అహంకారంతో ఉంటారు. ఇతరులకు సహాయం చేయడంలో రాణిస్తారు. ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులను అతిగా సాధించడం. పనికి వస్తే తెల్లవారినట్లుగా ఇచ్చిన పని పూర్తి చేస్తారు. Number 1: 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారి మితిమీరిన ఆత్మవిశ్వాసం వారిని బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుంది. ఇతరులకన్నా తామే గొప్పవారమని ఎప్పుడూ అహంకారంతో ఉంటారు. Number 5: 5, 14, 23 తేదీలలో జన్మించిన వ్యక్తులు స్వతంత్రంగా మరియు ధైర్యంగా ఉంటారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా తమదే చట్టమని అహంకారంతో వ్యవహరిస్తున్నారు. వారి ప్రత్యేక దృక్పథం కారణంగా వారు ఇతరుల కంటే మెరుగైన వారని భావిస్తారు. Number 8: 8,17,26 తేదీలలో జన్మించిన వ్యక్తులు పోటీ , ప్రతిష్టాత్మక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎల్లప్పుడూ విజయం యం కోసం ప్రయత్నిస్తారు. కానీ ఇతరులకు మద్దతివ్వడంలో ఎప్పుడూ ముందుంటారు. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Healthy Lifestyle: మీరు నైట్ షిఫ్ట్ చేస్తున్నారా? అయితే ఇది తెలుసుకోవడం తప్పనిసరి

Healthy Breakfast: మనం తీసుకునే ఆహారంలో పొద్దున తీసుకుని అల్పాహారం ఎంతో ముఖ్యమైనది. అయితే నైట్ షిఫ్ట్ చేసేవారు కొందరు పొద్దున ఆలస్యంగా లేవడం వల్ల.. టిఫిన్ బదులు అన్నం తింటారు. మరి దీని వల్ల ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావం పడుతుందో తెలుసుకుందాం..


అక్షయ తృతీయ నాడు బంగారం, వెండి మాత్రమే కాదు.. ఈ వస్తువులు కూడా కొంటే అదృష్టం!

హిందూమతంలో అక్షయ తృతీయ (Akshaya Tritiya) పండుగకు ఎంతో విశిష్ఠత ఉంది. ఈ పర్వదినాన దేశవ్యాప్తంగా ఉన్న హిందువులు బంగారం, వెండి కొంటారు. ఈ ముఖ్యమైన పండుగను ఏటా వైశాఖ మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10న, శుక్రవారం నాడు వచ్చింది. అయితే ఈ పండుగ సందర్బంగా చేయాల్సిన పనుల గురించి న్యూస్18తో మాట్లాడారు పండిట్ నందకిశోర్ ముద్గల్. ఆయన డియోఘర్‌లోని ముద్గల్ జ్యోతిష్య కేంద్రంలోని పండితుల్లో ఒకరు. ఈ పవిత్రమైన రోజున...


BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?

BellyFat: పొట్ట కింద కొవ్వుపేరుకుపోవడానికి ఇవే కారణాలంటా..?.. నిపుణులు ఏమంటున్నారంటే..?


మహా బలం.. తెలిస్తే వదలరు.. వేసవి కాలానికి రారాజు ఈ పండు!

తాటి ముంజలు తాటిచెట్ల కాయల నుంచి లభిస్తాయి. ఇవి వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి. ఇవి చూడటానికి జెల్లీలా, పట్టుకుంటే జారిపోయేంత మృదువుగా ఉంటాయి. తియ్యగా, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపలి భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ‘ఐస్ యాపిల్’ అని కూడా అంటారు. తాటి ముంజలు మన భారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లభిస్తాయి. ముఖ్యంగా మన దక్షణ భారత దేశంలో విరివిగా దొరుకుతాయి. చలికాలంలో పూతగా మొదలై వేసవి ప్రారంభంలో తాటి ముంజలు ఏర్పడుతాయి.సమ్మర్ వచ్చేసింది. వేడి దాటిని తట్టుకునేందుకు ఎన్నో ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ సీజన్‌లో పండ్లు, పళ్ల రసాలు ఎక్కువగా తీసుకుంటే బాడీ డీ హైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది. పండ్లలో కూడా ముఖ్యంగా పుచ్చకాయ, ఖర్బూజ వంటివి ఎక్కువ నీటి శాతంతో పాటు ప్రొటీన్లను కలిగి ఉంటాయి. అయితే వీటన్నింటికి కంటే మానవ శరీరానికి ఎక్కువ మేలు చేసేవి తాటి ముంజలు. కేవలం వేసవిలో మాత్రమే ఇవి విరివిగా లభిస్తాయి. అధిక నీరు ఉండటం కారణంగా తాటి ముంజలు శరీరాన్ని చల్లపరిచే గుణం ఉంటుంది. ఐస్ యాపిల్స్‌లో ఎ, బి, సి వంటి విటమిన్లు, జింక్, ఐరన్, పొటాషియం, ఫాస్పరస్, కాల్షియం మొదలైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. వేసవి వేడి నుంచి శరీరాన్ని చల్లబరిచేది తాటి ముంజలు. ఇన్ని ఉపయోగాలున్నా ఈ తాటి ముంజలను శ్రీకాకుళంలో ప్రతి సెంటర్ వద్ద జోరుగా విక్రయాలు జరుపుతున్నారు. డజన్ రూ.100 పైనే అమ్ముతున్నారు. తమకు అన్ని ఖర్చులు పోను రోజుకు రూ.1000 వరకు ఆదాయం ఉంటుందని చెబుతున్నారు. మరెందుకు ఆలస్యం ఈ ఐస్ యాపిల్ ని తినండి… చల్లగా ఉండండి.


ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో తెలుసా?

జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... సాధారణంగా ఒక్కొక్కరికీ ఒక్కో అలవాటు ఉంటుంది. అయితే... జోతిష్యశాస్త్రం ప్రకారం కూడా.. ఒక్కో రాశి కి కామన్ గా కొన్ని అలవాట్లు ఉంటాయట. మరి ఏ రాశివారికి ఎలాంటి అలవాట్లు ఉంటాయో ఓసారి చూద్దాం... 1.మేష రాశి.. మేష రాశివారు.. ఎక్కడ ఉన్నాం.. ఎవరితో ఉన్నాం.. ఏం చేస్తున్నాం అనేది చూడరు. గట్టి గట్టిగా మాట్లాడేస్తూ ఉంటారు. ఈ...


సీతమ్మ తల్లి పలికిన ఒకే ఒక్క మాట.. సింధూరం పూసుకున్న హనుమంతుడు.. ఏమి జరిగిందో తెలుసుకుందాం

సింధూరం అంటే హిందూ సాంప్రదాయంలో ఒక భాగమని చెప్పవచ్చు. ఈ సింధూరాన్ని ధరించేందుకు భక్తులు ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుంటారు. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహానికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తుంటారు. అందుకే కాబోలు శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సింధూరంతో స్వామివారికి పలు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు.‌ ఈ నేపథ్యంలో సింధూరంకు ఆంజనేయస్వామికి గల అనుబంధం, సింధూరంతో ఆంజనేయ స్వామివారిని అలంకరించడానికి గల కారణమేమిటనే విషయాలను భద్రాచలం లోని శ్రీ...


Food Precautions: రోజూ పరగడుపున ఈ పదార్ధాలు అస్సలు ముట్టకూడదు

Food Precautions: రోజూ పరగడుపున ఈ పదార్ధాలు అస్సలు ముట్టకూడదు


Mango Lassi: చల చల్లని మ్యాంగో లస్సి తాగి చూడండి, ఈ ఎండల్లో ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది

Mango Lassi: ఎండాకాలంలో ఏదైనా చల్ల చల్లగా తినాలనిపిస్తుంది. ఎప్పుడూ పెరుగు, మజ్జిగ మాత్రమే కాదు, ఒకసారి మ్యాంగో లస్సీ చేసుకుని తాగండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది.


Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి!

Summer Special : టూర్ వెళ్లేటప్పుడు బ్యాగ్ ఇలా ప్యాక్ చేసుకోండి! యాత్రకు వెళ్లేవారు తమ వెంట మెడికల్ కిట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వీటిలో టెంచర్, అయోడిన్ హైడ్రోజన్ పెరాకైడ్. కాటన్, కట్టు కట్టే క్షాత్ తోపాటు వ్యాధులకు సంబంధించిన మందులు ఉండేట్లు చూడాలి వాతావరణ మార్పులుకు అనుగుణంగా వచ్చే జలుబు దగ్గు, విరేచనాలు, జ్వరాలకు సంబంధించిన మందులను ముందుగానే...


ఆర్థిక ఇబ్బందులను దూరం చేసే వాస్తు టిప్స్.. ఇలా చేస్తే డబ్బు సమస్యలు ఉండవు

Vastu Tips: మీరు ఎంత కష్టం చేసినా, దానికి తగ్గ ఫలితం పొందట్లేదా..? డబ్బు విషయంలో ఎప్పుడూ నష్టాలే వస్తున్నాయా..? ఆర్థిక ఇబ్బందులు అస్సలు వదలట్లేదా..? అయితే కొన్ని వాస్తు దోషాలు ఇందుకు కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంటి లేఅవుట్, స్ట్రక్ఛర్ మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది. అందుకే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు వాస్తు దోషాలను సెట్ చేసుకోవాలి. అలాగే కొన్ని వాస్తు టిప్స్ పాటిస్తే అప్పులు తీర్చుకోవడం సాధ్యమవుతుంది, ఆర్థిక స్థిరత్వం...


Spiderman Costume: స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో బైక్ మీద రొమాన్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు.. వీడియో వైరల్..

Spiderman Costume: కొందరు యువత సోషల్ మీడియాలో ఫెమస్ అవ్వడానికి రకరకాల స్టంట్ లు వేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరు యువతీ యువకులు ప్రస్తుతం స్పైడర్మ్యాన్ కాస్టూమ్స్ లో ఢిల్లీ రోడ్లపై తిరుగుతు హల్ చల్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గామారింది.


కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి

కోళ్ళకూ భావోద్వేగాలుంటాయి.. మూడ్ను బట్టి ముఖం రంగు మారుస్తాయి కోళ్లకు భావోద్వేగాలు ఎంటాయా? మనుషుల మాదిరిగానే భావోద్యేగం కలిగినప్పుడు వాటి ముఖంలో తేడా కనిపిస్తుందా? సాధారణంగా మనుషులకు బాధ కలిగిన ప్పుడు ముఖం ఎరుపుగా కనిపిస్తుంది.. ఈ విషయం మనకు తెలుసు. కానీ కోళ్లలో కూడా భావోద్వేగాలు ఉంటాయట..అవి కూడా బాధలో ఉన్నప్పుడు మొఖం ముదురు ఎరుపు రంగులోకి మారుతుం...


Yoga Heath Benefits: యోగాతో ఎన్నో రోగాలకు గుడ్ బై.. సీక్రెట్ తెలిస్తే వెంటనే మొదలుపెడతారు!

Yoga Benefits In Telugu: ప్రతిరోజూ యోగా చేయడం వల్ల శరీరం ఫిట్‌గా ఉండడం తో పాటు శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Marriage Cancel: తాళి కట్టేముందు వధువు షాక్‌.. రెండో ఎక్కం చెప్పనందుకు పెళ్లి రద్దు

Bride Cancelled Her Wedding Due To Groom Not Read Second Table In UP: అమ్మాయిల ఆలోచన తీరు మారడంతో పెళ్లి కాని అబ్బాయిలకు ఇబ్బంది వచ్చింది. తాజాగా ఓ యువతి చేసిన పనితో వరుడు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.


Clove Tea 5 Benefits: లవంగం టీ తాగుతున్నారా? మైండ్‌ బ్లాంక్‌ అయ్యే మిరకిల్స్..!

లవంగం మన వంటగదుల్లో కచ్చితంగా ఉండే ఓ మసాలా. ఇందులో మెడిసినల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. లవంగం మనం సాధారణంగా స్పైసీ వంటకాల్లో వినియోగిస్తాం. చికెన్, మటన్‌, బగారా రైస్ ఏదైనా వెజిటేబుల్ మసాలా కర్రీ వండుకున్నప్పుడు ఉపయోగిస్తాం. అయితే, ఈ మాసాలా గత ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నాం. జలుబు, దగ్గుతో బాధపడుతున్నవారికి లవంగం ఎఫెక్టివ్ రెమిడీ. లవంగం మన డైట్లో చేర్చుకోవడం మేలు. కొంతమంది ఆరోగ్య నిపుణులు లవంగం రాత్రి పడుకునేటప్పుడు చేర్చుకోవాలని చెబుతారు....


మీ పిల్లలతో ఈ మాటలు అస్సలు అనొద్దు..

పిల్లల్ని పెంచే విషయంలో ప్రతీ తల్లీదండ్రులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. అవేంటో తెలుసుకోండి.


Relationship Tips : మీ భాగస్వామి చిరాకుగా ఉన్నప్పుడు ఇలా అస్సలు చేయెుద్దు

Relationship Tips In Telugu : చిరాకు అనేది మనుషులకు సాధారణం. అయితే జంటలో ఒకరు చిరాకుగా ఉన్నప్పుడు ఇంకొకరు కొన్ని పనులు చేయకపోవడమే మంచిది.


Honey Vs Jaggery : బెల్లం, తేనెలో ఏది ఆరోగ్యానికి ప్రయోజనాలను అందిస్తుంది?

Honey Vs Jaggery : స్వీట్లను దాదాపు అందరూ ఇష్టపడుతారు. ఆరోగ్యం విషయానికి వస్తే తీపి సమస్యగా ఉంటుంది. అయితే బెల్లం, తేనెలో ఏది తీసుకుంటే మంచిది?


పేగుల్ని శుభ్రపరిచే ఆహారాలు ఇవే!

జీర్ణవ్యవస్థలో పేగులు కీలకం. ఇవి ఆరోగ్యంగా ఉంటేనే జీర్ణశక్తి బాగుంటుంది. ఇలాంటి పేగుల్ని శుభ్రం చేసేందుకు కొన్ని ఆహారాలు సహాయపడతాయి. అవేంటో చూద్దాం.


Snakes : పాములు స్నానం చేస్తాయా.. వేడి నుంచి ఉపశమనానికి అవి ఏం చేస్తాయంటే..?

స్నానం చేయకుండా మనుషులు ఉండలేరు. అయతే పాములు కూడా స్నానం చేస్తాయా.. లేక నీటికి అవి దూరంగా ఉంటాయా అన్న సందేహం అందరికీ వస్తుంది. నిజానికి పాములకు స్నానం చేయడం చాలా అవసరం. అయితే పాములు ఎలా స్నానం చేస్తాయి.. వాటికి స్నానం చేయడం ఎందుకంత ముఖ్యమో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా పాములు వెచ్చని నీటిలో సేదతీరడానికి ఇష్టపడతాయి. అయితే చల్లటి నీటిలో ఉండటానికి మాత్రం పెద్దగా ఇష్టపడవంట. కొన్ని జాతుల పాములు ఉపశమనం పొందడానికి పదే పదే తడుస్తుంటాయి.. దీనినే స్నానంగా చూడవచ్చంట. పాములు ఎప్పుడూ తడుస్తుంటాయి. అయితే పాములు స్నానం చేయవు. అతను కేవలం తడి ప్రదేశానికి వెళ్లి, అందులో దొర్లుతూ స్నానం తమ శరీరాన్ని చల్లబరుచుకుంటాయి. ఎందుకంటే వాటికి నీరు చాలా అవసరం. పాములు సాధారణంగా కొద్దిగా స్నానం చేసి.. నీటిని తాగడం ద్వారా తమను తాము హైడ్రేట్ చేసుకుంటాయి. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం ద్వారా అవి చర్మం ద్వారా శ్వాస పీల్చుకోవడానికి వీలుగా వారి చర్మ రంధ్రాలను శుభ్రపరుచుకుంటాయి. అందుకే జూల్లో పెంపుడు పాముల కోసం ఒక గిన్నెలో నీటిని నింపుతారు.. పాము దానిలోకి ప్రవేశించి సేదతీరుతాయి. కొన్ని జాతుల పాములు స్నానం చేయడం ఆనందిస్తాయి. అవి అక్కడ గంటల తరబడి నీట మునిగి ఉండగలవు.. అయితే స్నానాన్ని ఇష్టపడని అనేక రకాల పాములు ఉన్నాయి. చెరలో ఉంచబడిన పాములు ఎప్పటికప్పుడు నీటి గిన్నెలలో తడిసిపోతాయి. పాము చలిలో అస్సలు బతకదు అంటుంటారు.. నిజానికి అతి వేడి ప్రదేశంలో కూడా పాములు జీవించలేదు. అందుకే ఎండా కాలంలో అవి స్నానం చేయడానికి చూస్తాయి. అందుకే ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్న సమయంలో నీటి తొట్ల దగ్గర పాములు ఎక్కువ మనకు కనిపిస్తుంటాయి. ఇక పాములకు నీరు అంటే ఇంష్టమో కాదు ఇప్పుడు తెలుసుకుందాం. పాములు నీటిని ఇష్టపడతాయి.. అంతేకాదు నీటిని త్రాగడానికి అనేక పద్ధతులను అవలంబిస్తాయి. పాముల దవడ కింది భాగం చర్మం స్పాంజ్ లాగా ఉంటుంది. పాము నీటిపైకి వచ్చినప్పుడు, దాని చర్మం నీటిని పీల్చుకుంటుంది. పాము ఆ నీటిని నెమ్మదిగా తాగుతుంది. కొన్ని పాములు నీటి వనరు దగ్గర పడుకుని నోటిని నీటిలో ముంచి నీరు తాగుతాయి. ఇతర పాములు తమ పెదవులను నీటి వనరులకు తాకి ఆ నీటిని నోటిలోకి లాగుతాయి. నీటి పాము నీటిలో బాగా నివసిస్తుంది. ఆక్సిజన్ పొందడానికి మాత్రమే దాని నోటిని నీటి నుండి బయటకు తీస్తుంది. లోపల ఎక్కువసేపు ఉండగలవు.


ముఖంపై ముడతలు నివారించే బెస్ట్ ఫేస్ ప్యాక్..!

ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వయసు పెరుగుతుంటే ముఖం పై ముడతలు రావడం మొదలౌతాయి. మన వయసు పెరుగుతోంది అనడానికి సంకేతం ఇది. అయితే దీనికి ప్రధాన కారణం సూర్యునిలోని అతినీలలోహిత కిరణాలు. ఈ కిరణాల ప్రభావాల నుండి చర్మాన్ని రక్షించడానికి , ఇప్పటికే ఉన్న ముడతలను తొలగించడానికి ఇక్కడ కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. గుడ్డు , నిమ్మకాయ: గుడ్డులోని తెల్లసొన ప్రోటీన్ చర్మం...


కుక్కలు అక్కడే ఎందుకు వాసన చూస్తాయ్..! ఆ అనుభవం మీకు కూడా ఎదురైందా?

Dogs: కుక్కల ఎంతో విశ్వాస జంతులు. కుటుంబంలోని అందరితో కలిసిపోయే గుణం కుక్కల సొంతం. మోస్ట్ ఫ్రెండ్లీ జంతువులు కుక్కలు మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా వింతగా ప్రవర్తిస్తాయి. ఆ అభువనాన్ని మీరు కూడా ఎదుర్కొనే ఉంటారు. ఇంతకీ ఆ అనుభవమేంటీ? అని ఆలోచిస్తున్నారా? Dogs: కుక్కల విశ్వాసం గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరితో ఇంట్లో కుటుంబ సభ్యున్నిలా కలిసిపోయే గుణం కుక్కల సొంతం. మోస్ట్ ఫ్రెండ్లీ జంతువులు కుక్కలు. అయితే,...


ఏసీ వాడుతున్నారా? కరెంట్ బిల్ తక్కువగా రావాలంటే ఇలా చేయండి

వేసవి కాలం ఉక్కగా ఉన్నప్పుడు ఏసీ ఆన్ చేసి, ఉష్ణోగ్రత తగ్గించేస్తాం. నిద్రలోకి జారుకుంటాం. కాసేపటి తర్వాత చల్లదనం ఎక్కువై నిద్ర సరిగా పట్టదు. ఇలా అయితే ప్రమాదం అంటున్నారు నిపుణులు. వేసవిలో ఏసి ఎంత ఉష్ణోగ్రతలో నిద్రపోవాలని తెలుసుకుందాం. వేసవి వచ్చేసింది. కాబట్టి మనం ఎండాకాలానికి ప్రిపేర్ అయిపోవాల్సిందే. ఫ్యాన్లూ, ఏసీలకూ నో రెస్ట్. చాలా సార్లు ఏసీ, ఫ్యాన్‌లను మనం మనకు నచ్చినట్లు వాడేస్తాం. కానీ వాటిని జాగ్రత్తగా వాడుకోకపోతే, చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని విశాఖకు చెందినఏసి నిర్వాహకులు మురళి అంటున్నారు. ముఖ్యంగా ఏసీ లెవెల్ సరిగా లేకపోతే, కరెంటు బిల్లుపై తీవ్ర ప్రభావం పడుతుంది. అంతేకాదు నిద్ర కూడా సరిగా పట్టదు. అందుకే ఏసిని ఉపయోగించే విషయంలో ఈ జాగ్రత్తలు తెలుసుకోవాలని అంటున్నారు. మనం ఏసీ ఉష్ణోగ్రతను ఎప్పుడు ఎలా ఉంచుకోవాలో తెలియకపోతే, ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. ఏసీ పనిచెయ్యాలి. అదే సమయంలో మన ఆరోగ్యం దెబ్బతినకూడదు. అలాగే కరెంటు బిల్లూ పెరగకూడదు. అంటే.. మనం గదిలో ఉన్న ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రతలను లెక్కలోకి తీసుకొని, ఏసీ ఎంత ఉండాలో డిసైడ్ అవ్వాలి. అది సరిగ్గా నిర్ణయించుకుంటే, మనకు మంచి నిద్ర పడుతుందంటున్నారు. మీరు ఏసి ఉష్ణోగ్రత మరీ తక్కువగా ఉంచినట్లయితే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది.ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్‌లో ఉంచితే 15 ఏళ్లలోపు పిల్లలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చిన్న పిల్లలు అతి వేడి, అతి చల్లదనాన్ని తట్టుకోలేరు. కాబట్టి పిల్లల గది ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటే, అప్పుడు వారు హాయిగా నిద్రపోతారు. పెద్దలకు ఏసి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ ఉండాలి. ఈ ఉష్ణోగ్రత దగ్గర నిద్ర బాగా, సౌకర్యవంతంగా ఉంటుంది. ఏసీ ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంచితే చలి విపరీతంగా పెరిగి అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉంటుంది. వృద్ధులు చలిని భరించలేరు. అందువల్లగది ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉంటే, వారి ఆరోగ్యం క్షీణించవచ్చు అంటున్నారు. ఏసిలో మీరు టైమర్‌ని సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నదీ లేనిదీ పడుకునేముందు చెక్ చేసుకోండి. లేదంటే, ఉదయం పూట విపరీతమైన చలి పెరిగి, ఆరోగ్యం చెడిపోవచ్చు. ఉదయం పూట ఏసీ వల్ల గది చాలా చల్లగా అయిపోతూ ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని రాత్రి ఏసీ టెంపరేచర్ సరిగ్గా సెట్ చేసుకుని నిద్రపోవాలి.


అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి

అదృష్టం అంటే ఇదీ : వంట గదిలో తవ్వుతుంటే.. బంగారు నాణాలు దొరికాయి ఇల్లు రీ కన్స్ట్రక్షన్ చేస్తున్న ఓ జంట నక్తతోక తొక్కారు. వంటగదిలో తవ్వకాలు జరిపిన వారికి విలువైన 17వ శతాబ్దకాలం నాటి నాణేలు దొరికాయి. రాబర్ట్, బెట్టీ ఫుచ్స్ అనే జంట  దక్షిణ ఇంగ్లాండ్‌లోని వెస్ట్ డోర్సెట్‌లో 17వ శతాబ్ధానికి చెందిన ఓ పురాతన కాటేజ్ సౌత్ పోర్టన్ ఫార్మ్ 2019లో కొన్నారు. అయ...


Shani Dev Blessings: 2025 వరకు ఈ 3 రాశులకు శనిదేవుడి కటాక్షం.. ఇక నుంచి వీరిది లగ్జరీ లైఫ్..

Shani transit 2024: కర్మఫలదాత అయిన శని 2025 వరకు కుంభరాశిలోనే ఉంటాడు. శని యెుక్క ఈ సంచారం కొందరిని అపరకుబేరులను చేయనుంది. శని కటాక్షం పొందబోయే ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.


Dream Meaning: కలలో మీ కుటుంబసభ్యుల మరణం చూశారా? అది ఏ సంకేతమో తెలుసా?

Dream Meaning: కలలో మీ కుటుంబసభ్యుల మరణం చూశారా? అది ఏ సంకేతమో తెలుసా?


పనస పండును కోయడంలో ఈ యువకుడి స్టైల్ వేరు..!

పండ్లు తినడం ద్వారా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు మరియు ఫైబర్లతో నిండిన పండ్లు మనకు పకృతి ప్రసాదించిన తీపి బహుమతి. అయితే పండ్లను తినడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పండ్లు అనేక రుచులు,ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.పండ్లు తినడం ద్వారా శరీరానికి తగినంత ఫైబర్, ఖనిజాలు, యాంటీ యాక్సిడెంట్లు, విటమిన్లు అందిస్తాయి.అయితే వేసవిలో ఎక్కువ దొరికే పండ్లలో పనస పండు కూడా...


Civet Coffee | పిల్లి మలంతో కాఫీ.. తాగేందుకు ఎగబడుతున్న జనం

ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన.. ఖరీదైన కాఫీ మన ఇండియాలోనే తయారవుతుంది. దానిపేరు సివెట్ కాఫీ. దీనిని ఎలా తయారు చేస్తారో తెలుసా? పిల్లి మలంతో చేస్తారు. అదెలాగో తెలుసుకుందాం.పునుగు పిల్లి విసర్జనతో కాఫీ పౌడర్ తయారు చేసి కిలో రూ.50 వేలకు అమ్ముతారు. ఇది చదివి షాకయ్యారా? అక్షరాలా నిజం. పునుగు పిల్లి మలంతో చేసే కాఫీ పౌడర్‌కు అంత డిమాండ్ ఉంటుంది. దీన్నే ‘సివెట్ కాఫీ’ లేదా ‘కోపీ లువాక్’ అని పిలుస్తారు.


నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ..

నమ్మలేని నిజం : అచ్చం సింహ గర్జన మాదిరిగానే ఈ చిన్నారి అరుస్తుంది.. మీరూ వినండీ.. పిల్లలు.. మనం ఎలా నేర్పిస్తే అలానే చేస్తారు.. ఎలా మాట్లాడమంటే అలా మాట్లాడటం నేర్చుకుంటారు.. ఈ చిన్నారి విషయంలో మాత్రం అందుకు అతీతం.. అవును.. ఈ చిన్నారి వయస్సు కేవలం ఐదు సంవత్సరాలు మాత్రమే.. ఈ పాప అచ్చం.. సింహం ఎలా అయితే గర్జిస్తుందో.. అచ్చం అలాగే గర్జిస్తుంది. సింహం ఎ...


Curry Leaves Benefits: మజ్జిగలో కరివేపాకు ఇలా కలుపుని తాగితే.. దెబ్బకు యూరిక్ యాసిడ్, కిడ్నీలో రాళ్లు మటుమాయం

Curry Leaves Benefits: మజ్జిగలో కరివేపాకు ఇలా కలుపుని తాగితే.. దెబ్బకు యూరిక్ యాసిడ్, కిడ్నీలో రాళ్లు మటుమాయం


ఈ పండ్లలో ప్రోటీన్‌ కంటెంట్ అధికం!

ప్రోటీన్‌ కంటెంట్ ఎక్కువగా ఉన్న పండ్ల గురించి ఇక్కడ వివరించాం. వీటిని తింటే మీ కండరాల రికవరీ బాగుంటుంది. ఈ పండ్లు తింటే కండరాలు దృఢంగా మారుతాయి.


Name Astrology: మీ పేరులో మొదటి అక్షరం 'A' అయితే... మీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే

పిల్లలకు పేరు పెట్టే సమయంలో.. మన విశ్వంలో తిరిగే గ్రహాలు కూడా తమ శక్తిని ఇస్తాయని చెబుతుంటారు. అందువల్ల మన పేరులో అన్ని అక్షరాలకు తమదైన ప్రత్యేకత ఉంటుంది. ఒకవేళ మీ పేరు 'A' అక్షరంతో ప్రారంభమైతే.. దానికి కూడా ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. ఈ శక్తి జీవితంలో మీరు నిర్ణయాలు తీసుకోవడంలో కీలకంగా ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం) పేరులోని మొదటి అక్షరం ద్వారా కూడా మన వ్యక్తిత్వ లక్షణాలు మనకు తెలుస్తాయి. A అక్షరం సూర్యుని నక్షత్రమైన కృతిక నక్షత్రం కిందకు వస్తుంది. వీరి రాశిచక్రం విషయానికొస్తే.. A అక్షరంతో పేరు మొదలయ్యేవారు మేష రాశిలోకి వస్తారు. వీరి ప్రభువు అంగరాకుడు. దేవత అగ్ని. అందుకే వీరికి శక్తిసామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం) ఢిల్లీ జ్యోతిష్కురాలు మమత చెప్పిన వివరాల ప్రకారం..'A' అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు చాలా తెలివైన వారు. నీతి నిజాయతీతో ఉంటారు. ప్రేమపూర్వక స్వభావం, దయ గలవారు. వీరిలో సృజనాత్మక ఎక్కువ. అందరికంటే భిన్నంగా పనిచేయాలనుకుంటారు. తమ లక్ష్యం కోసం కష్టపడి పనిచేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం) ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారిలో ఎక్కువ మంది 'A' అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్నవారే కనిపిస్తారు. రంగంలో 'ఎ' అక్షరంతో మొదలయ్యే పేర్లతో ఉన్నవారు ఎక్కువగా కనిపిస్తారు. వీరు తమ తమ రంగాల్లో నిపుణులు ఎదుగుతారు. ప్రతి విషయంలోనూ పర్‌ఫెక్ట్ ప్లానింగ్ ఉంటుంది. ఉదాహరణకు లాయర్లు, సైంటిస్టులు, వ్యాపారవేత్తలుగా ఉన్నతస్థానానికి చేరుతారు. (ప్రతీకాత్మక చిత్రం) A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారు.. తమ జీవితాన్ని బాగా ప్లాన్ చేసుకుంటారు. తమ ఎనర్జీకి సరిపోయే వాళ్లు వస్తేనే.. వాళ్లతో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. జీవిత భాగస్వామిని అమితంగా ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ నిజమైన ప్రేమను కోరుకుంటారు. నకిలీ ప్రేమను ఏమాత్రం సహించరు. (ప్రతీకాత్మక చిత్రం) A అక్షరం ఉన్నవారిలో కొన్ని చెడు గుణాలు కూడా ఉన్నాయి. కొన్నిసార్లు తమ గురించి మాత్రమే పట్టించుకుంటారు. వీరు ఇతరులు చెప్పేది వినడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఎప్పుడూ తామే కరెక్ట్ అనే ఫీలింగ్‌లో ఉంటారు. ఒక్కోసారి వారి అతివిశ్వాసం అహంకారంగా మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం) A అక్షరంతో పేరు మొదలయ్యేవ వారు.. ప్రతిరోజూ ఉదయాన్నే సూర్యభగవానుడికి నీటిని సమర్పించి పూజించాలని జ్యోతిష్యులు మమత చెప్పారు. వీటితో పాటు ఆదిత్య హృదయ మూలాన్ని కూడా పఠించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.(ప్రతీకాత్మక చిత్రం) (Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది ఖచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ) (ప్రతీకాత్మక చిత్రం)


Today Panchangam: నేడు అమృత ఘడియలు ఎప్పుడున్నాయంటే...!

తెలుగు పంచాంగం ప్రకారం.. 26 ఏప్రిల్ 2024 శుక్రవారం రోజున రాహుకాలం, దుర్ముహుర్తంతో పాటు శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు ఇలా ఉన్నాయి. తేది :- 26 ఏప్రిల్ 2024 శ్రీ క్రోథి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్ర మాసం కృష్ణపక్షం శుక్రవారం తిథి:- విదియ ఉ॥06:25ని॥ వరకు తదుపరి తదియ నక్షత్రం:- అనూరాధ రాత్రి 02:17ని॥ వరకు యోగం:- వరీయాన్ తె. 03:12ని॥ వరకు కరణం:- గరజి ఉ॥ 06:25వణిజి రాత్రి 06:33ని॥ వరకు వర్జ్యం:- ఉ.శే.వ.06:33ని॥వరకు అమృత ఘడియలు:-...


ఈ తేదీల్లో పుట్టిన వారికి కోపం ఎక్కువ.. దూకుడు తగ్గించుకోకపోతే ఇబ్బందులు తప్పవు..!

న్యూమరాలజీ ప్రకారం.. పుట్టిన తేదీల ఆధారంగా వ్యక్తుల వ్యక్తిత్వం, స్వభావాన్ని అంచనా వేయవచ్చు. డేట్ ఆఫ్ బర్త్‌తో అన్ని సంఖ్యలనూ యాడ్ చేస్తే, ఒక లైఫ్ పాత్ నంబర్ వస్తుంది. ఇది వ్యక్తుల గుణగణాలు, లక్షణాలను సూచిస్తుంది. ఈ సంఖ్యల ఆధారంగా వ్యక్తుల ప్రవర్తన ఎలా ఉంటుందనేది సైతం న్యూమరాలజిస్టులు విశ్లేషిస్తారు. అయితే కొన్ని తేదీల్లో పుట్టిన వారికి విభిన్నమైన ఎమోషన్స్ ఉంటాయి. కొందరు చాలా ఎక్కువగా కోప్పడతారు. ప్రతి విషయంలోనూ దూకుడుగా వ్యవహరిస్తారు. వీరికి...